Telangana
oi-Sai Chaitanya
తెలంగాణ
రాజకీయాల్లోకి
కీలక
పరిణామాలు
చోటు
చేసుకుంటున్నాయి.
బీజేపీ
సమర్ధవంతమైన
పాత్ర
పోషించటం
లేదని
ప్రధాని
మోదీ
ఆగ్రహం
వ్యక్తం
చేసారు.
దీంతో..
పార్టీలో
కీలక
చేరికలతో
పాటుగా
కొత్త
కార్యాచరణ
సిద్దం
చేస్తోంది.
పార్టీలో
అంతర్గత
సమస్యల
పైనా
పార్టీ
నాయకత్వం
ఫోకస్
చేసింది.
కాగా..
తాజాగా
బీఆర్ఎస్
ఎంపీలు
సైతం
ప్రధాని
మోదీని
కలిసారు.
ఇదే
సమయం
లో
ప్రముఖ
సినీ
నటితో
పాటుగా
మరి
కొందరు
సినీ
పరిశ్రమకు
చెందిన
వారు
బీజేపీలో
చేరేందుకు
ముహూర్తం
ఫిక్స్
అయింది.
ప్రముఖ
సినీ
నటి
ఆమని
బీజేపీలో
చేరుతున్నారు.
ఆమనితో
పాటు
మరికొందరు
సినీనటులు
కూడా
బీజేపీలో
చేరేందుకు
సిద్ధం
అయ్యారు.
సినీ
రంగానికి
చెందిన
ప్రముఖులను
పార్టీలోకి
బీజేపీ
నేతలు
ఆహ్వానించారు.
ఇటీవలే
బీజేపీ
తెలంగాణ
రాష్ట్ర
అధ్యక్షుడు
రాంచందర్‌రావుతో
ఆమని
భేటీ
అయిన
విషయం
తెలిసిందే.
ఈ
సమావేశం
రాజకీయ
వర్గాల్లో
చర్చనీయాంశంగా
మారింది.
ఆ
భేటీలో
రాష్ట్ర
రాజకీయ
పరిస్థితులు,
బీజేపీ
లక్ష్యాలు,
ప్రజాసమస్యలు
వంటి
పలు
కీలక
అంశాలపై
విస్తృతంగా
చర్చ
జరిగినట్లు
తెలుస్తోంది.
ఆమని
పార్టీలో
చేరిక
ద్వారా
పార్టీకి
ఉపయోగపడతాయని
పార్టీ
నేతలు
చెబుతున్నారు.
రాజకీయాల్లోకి
రావాలన్న
తన
నిర్ణయం
వెనుక
ప్రజలకు
సేవ
చేయాలన్న
ఆకాంక్షే
ప్రధాన
కారణమని
ఆమని
పేర్కొన్నారు.
ఆమనికి
పార్టీలో
కీలక
బాధ్యతలు
ఇవ్వాలని
నిర్ణయించినట్లు
తెలుస్తోంది.
తాజాగా
పార్టీ
నేతలతో
జరిగిన
సమావేశంలో
సినీ
రంగంలో
పనిచేసిన
అనుభవంతో
పాటు
సమాజాన్ని
దగ్గర
నుంచి
గమనించిన
నేపథ్యంలో
ప్రజాసమస్యలను
రాజకీయ
వేదికపై
లేవనెత్తాలని
ఆమని
డిసైడ్
అయ్యారు.
రానున్న
రోజుల్లో
ఆమని
ఏ
విధమైన
రాజకీయ
పాత్ర
పోషిస్తారు,
ఆమెకు
పార్టీ
ఏ
బాధ్యతలు
అప్పగిస్తారనేది
ఆసక్తి
కరంగా
మారింది.
ఇక
రాబోయే
స్థానిక
సంస్థల
ఎన్నికల
దృష్ట్యా
బీజేపీ
తన
బలాన్ని
పెంచుకునే
అలోచనలో
పడింది.
ఇందులో
భాగంగా..
సినీ
ఇండస్ట్రీకి
చెందిన
ప్రముఖులను
పార్టీలోకి
ఆహ్వానిస్తోంది.
గతంలోనూ
పలువురు
ఇండస్ట్రీకి
చెందిన
వారు
పార్టీలో
చేరగా..
ఇప్పుడు
నటి
ఆమని
రాకతో
పార్టీ
క్యాడర్‌లో
కొత్త
ఉత్సాహాన్ని
నింపుతోంది.
ఇప్పుడు
రామ
చందర్‌రావు
ఆధ్వర్యంలో
జరుగుతున్న
ఈ
చేరిక
బీజేపీకి
మేలు
చేస్తుందని
చెబుతున్నారు.
దీంతో..ఆమని
కి
అప్పగించే
బాధ్యతల
పైన
ఆసక్తి
నెలకొంది.


