India
oi-Chandrasekhar Rao
ఈ
తెల్లవారు
జామున
వరుస
భూకంపాలు
సంభవించాయి.
ఉత్తర
దక్షిణ
ప్రాంతాలను
వణికించాయి.
ఇప్పటివరకు
ఎటువంటి
ఆస్తి
నష్టంగానీ,
ప్రాణనష్టంగానీ
నమోదు
కాలేదు.
కొన్ని
చోట్ల
పాక్షికంగా
భవనాలు
దెబ్బతిన్నట్లు
సమాచారం
అందింది.
భూకంపం
ధాటికి
స్థానికులు
ఇళ్లల్లో
నుంచి
బయటికి
పరుగులు
తీశారు.
ప్రధాన
భూకంపం
తర్వాత
కూడా
తేలికపాటి
ప్రకంపనలు
నమోదు
కావడంతో
ఇళ్లల్లోనికి
వెళ్లడానికి
భయపడ్డారు.
అండమాన్
నికోబార్
దీవులు,
జమ్మూ
కాశ్మీర్
లో
సంభవించిన
ఈ
రెండు
భూకంపాల
తీవ్రత
రిక్టర్
స్కేల్
పై
4.6
గా
నమోదైంది.
మొదటి
భూకంపం..
అండమాన్
నికోబార్
దీవుల
ప్రాంతంలో
ఈ
వేకువజామున
3:31
నిమిషాలకు
సంభవించింది.
ఉపరితలం
నుంచి
10
కిలోమీటర్ల
దిగువన
టెక్టానిక్
ప్లేట్లల్లో
చోటు
చేసుకున్న
కదలికల
వల్ల
భూమి
కంపించింది.
9.03
డిగ్రీల
ఉత్తర
అక్షాంశం,
92.78
డిగ్రీల
తూర్పు
రేఖాంశం
వద్ద
గల
ప్రాంతాన్ని
భూకంప
కేంద్రంగా
గుర్తించినట్లు
నేషనల్
సెంటర్
ఫర్
సిస్మాలజీ
తెలిపింది.
దీని
తర్వాత
తెల్లవారు
జామున
5:35
నిమిషాల
ప్రాంతంలో
జమ్మూ
కాశ్మీర్‌లోని
బారాముల్లా
జిల్లాలో
అదే
4.6
తీవ్రతతో
మరో
భూకంపం
సంభవించింది.
జిల్లాలోని
పట్టన్
ప్రాంతాన్ని
భూకంప
కేంద్రంగా
గుర్తించారు.
జిల్లాలోని
పలు
ప్రాంతాల్లో
ప్రకంపనలు
నమోదయ్యాయి.
వీటి
తీవ్రత
స్పష్టంగా
కనిపించింది.
ఇప్పటివరకు
ఎటువంటి
ప్రాణనష్టం
లేదా
ఆస్తి
నష్టం
సంభవించినట్లు
సమాచారం
అందలేదు.
భూకంప
తీవ్రతకు
సంబంధించిన
పలు
వీడియోలు
సోషల్
మీడియాలో
వైరల్
అయ్యాయి.
అండమాన్,
నికోబార్
దీవులు
దేశ
అత్యధిక
ప్రమాదకర
భూకంప
జోన్
5
పరిధిలో
ఉన్నాయి.
ప్రధాన
టెక్టోనిక్
ప్లేట్ల
సరిహద్దులకు
దగ్గరగా
ఉండటం
వల్ల
ఈ
ప్రాంతాన్ని
ప్రపంచంలోనే
అత్యంత
చురుకైన
భూకంప
ప్రాంతాలుగా
పరిగణిస్తారు.అండమాన్
లో
సంభవించినది
హాలో
ఎర్త్
క్వెక్.
అంటే
లోతు
తక్కువగా
ఉండేదని
అర్థం.
ఈ
తరహా
తక్కువ
లోతు
భూకంపాలు,
వాటి
తరంగాలు
ఉపరితలంపైకి
అతి
వేగంగా
చేరుకుంటాయి.
బలమైన
ప్రకంపనలకు
దారితీస్తాయి.
అందుకే
వీటిని
అత్యంత
ప్రమాదకరమైనవిగా
భావిస్తారు.


