Telangana
oi-Sai Chaitanya
తెలంగాణ
రైజింగ్
గ్లోబల్
సమిట్
కు
సర్వం
సిద్దమైంది.
ప్రపంచ
వ్యాప్తంగా
ప్రముఖులు
ఈ
సమ్మిట్
కు
తరలి
వస్తున్నారు.
వీరికి
ఆతిథ్యం
ఇచ్చేందుకు
హైదరాబాద్
సంప్రదాయ,
సాంకేతిక
హంగులతో
ముస్తాబవుతోంది.
చార్మినార్,
సచివాలయం
వద్ద
త్రీడీ
ప్రొజెక్షన్
మ్యాపింగ్,
హుస్సేన్
సాగర్‌లో
వాటర్
థీమ్
ఏర్పాటు
కానున్నాయి.
శంషాబాద్
ఎయిర్
పోర్టు
నుంచి
ఫ్యూచర్
సిటీ
వేదిక
వరకు
భారీ
ఎల్ఈడీ
తెరలు
పెట్టనున్నారు.
భవిష్యత్
తెలంగాణ
-2047
లక్ష్యాలను
ఈ
సమ్మిట్
ద్వారా
ఆవిష్కరించనున్నారు.
తెలంగాణ
రైజింగ్
గ్లోబల్
సమిట్‌కు
దేశ,
విదేశాల
నుంచి
వచ్చే
ప్రతినిధులను
ఆకట్టుకునేలా
హైదరాబాద్
ను
తీర్చి
దిద్దారు.
గ్రేటర్
హైదరాబాద్
పరిధిలో
ప్రముఖ
ప్రదేశాలు,
చెరువులు,
రహదారులు,
సమిట్
వేదిక
ఇలా
అన్నిచోట్లా
హైటెక్
ప్రొజెక్షన్లు,
డిజిటల్
రూపంలో
ప్రదర్శనలు,
ఆధునిక
విజువల్
ఎఫెక్టులతో
ప్రత్యేకంగా
పెట్టుబడుల
పండగ
వాతావరణం
సృష్టిస్తున్నారు.
చార్మినార్,
కాచిగూడ
రైల్వే
స్టేషన్
భవనంపై
ప్రత్యేక
లైటింగ్
ప్రొజెక్షన్
ఏర్పాటు
చేసి,
నగరానికి
వచ్చే
జాతీయ,
అంతర్జాతీయ
అతిథులకు
తెలంగాణ
సాంస్కృతిక
వైభవాన్ని
చూపించేలా
ఏర్పాటు
చేసారు.
సచివాలయం
వద్ద
త్రీడీ
ప్రొజెక్షన్
మ్యాపింగ్‌తో
రాష్ట్ర
అభివృద్ధి
తీరును,
భవిష్యత్
లక్ష్యాలను
ఆకర్షణీయంగా
చూపించేలా
ప్రణాళిక
రూపొందించారు.
కాగా,
దుర్గం
చెరువులో
ప్రత్యేక
ఆకర్షణగా
గ్లోబ్
ఆకారంలో
తేలియాడే
ప్రొజెక్షన్
ఏర్పాటు
చేస్తున్నారు.
ఇందులో
తెలంగాణ
రైజింగ్
గ్లోబల్
సమిట్
లోగోను
ఇన్‌లిట్
టెక్నిక్‌తో
ప్రదర్శించనున్నారు.
హుస్సేన్‌సాగర్‌లో
వాటర్
ప్రొజెక్షన్
ద్వారా
భారత్
ఫ్యూచర్
సిటీ,
మహిళా
సాధికారత,
యువత-రైతు
ప్రధాన
కార్యక్రమాలు,
మూడు
ట్రిలియన్
డాలర్ల
ఎకానమీ
లక్ష్యం
వంటి
ముఖ్య
అంశాలను
ప్రదర్శించనున్నారు.
శంషాబాద్
విమానాశ్రయం
నుంచి
సమిట్
వేదిక
వరకు
వెళ్లే
రోడ్డుపై
భారీ
డిజిటల్
ఎల్ఈడీ
స్క్రీన్లను
ఏర్పాటు
చేస్తున్నారు.
ఈ
స్క్రీన్లపై
భారత్
ఫ్యూచర్
సిటీకి
ఎలా
చేరుకోవాలి..
ఎంత
దూరం..
వంటి
వివరాలు
పొందుపరుస్తున్నారు.
నగర
వ్యాప్తంగా
గ్లోబల్
సమిట్
లోగోతో
తయారు
చేయించిన
1,500
రంగురంగుల
జెండాలతో
వేడుక
వైభవాన్ని
కళ్లకు
కట్టనున్నారు.
ఇక..
హైదరాబాద్‌లో
10
వేర్వేరు
ప్రదేశాల్లో
ప్రత్యేక
సమాచార
స్టాల్స్
ఏర్పాటు
చేస్తున్నారు.
అక్కడ
సమిట్‌కు
సంబంధించిన
వివరాలు,
ఫ్యూచర్
సిటీ
ప్రణాళిక,
డిజిటల్
స్క్రీన్లపై
విజువల్స్,
సమిట్
బ్రోచర్లు
అందుబాటులో
ఉంచనున్నారు.
వాలంటీర్లు
ప్రజలకు
సమిట్
డైలీ
షెడ్యూల్‌ను
వివరించి
అవగాహన
కల్పించేలా
ఏర్పాట్లు
జరుగుతున్నాయి.
ఫ్యూచర్
సిటీలో
డిజిటల్
తెరలతో
నిర్మించిన
టన్నెల్
ప్రత్యేక
ఆకర్షణగా
నిలుస్తోంది.
50
మీటర్ల
పొడవుతో
త్రీడీ
డిజైన్లతో
ఇంటరాక్టివ్
డిస్‌ప్లే
రూపంలో
ముస్తాబైన
సొరంగం
గుండానే
సమిట్‌కు
చేరుకోవాల్సి
ఉంటుంది.
అంతర్జాతీయ
స్థాయిలో
తెలంగాణ
అందరి
దృష్టిని
ఆకర్శించాలనే
లక్ష్యంతో
ప్రభుత్వం
ఏర్పాట్ల
ను
ప్రతిష్ఠాత్మకంగా
తీసుకుంది.


