దివ్యాంగురాలిని పట్టించుకోని ప్రభుత్వం.. హామీ ఇచ్చిన సోనూసూద్ !

Date:


India

oi-Korivi Jayakumar

జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా చదువుకోవాలనే తపన ఉంటే ఏ అడ్డంకి కూడా పెద్దది కాదని మరోసారి నిరూపించింది బిహార్‌కు చెందిన ఒక చిన్నారి. పుట్టుకతోనే కాళ్లలో లోపం ఉండటంతో నడవడం కూడా కష్టంగా ఉన్నా, రోజూ రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ స్కూల్‌కు వెళ్లి చదువుకుంటోంది. ఆమె పట్టుదల ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఈ సంఘటన Gopalganj జిల్లాలోని రామ్‌నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది.

తండ్రి లేకపోవడంతో కుటుంబ బాధ్యత మొత్తం తల్లి భుజాలపై పడింది. ఆమె రోజుకూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చిన్నారికి అవసరమైన వీల్‌చైర్ కూడా కొనివ్వలేకపోయింది. కానీ చదువుకోవాలనే ఆమె పట్టుదల ముందు వైకల్యం సైతం చిన్నబోయింది.

అధికారుల నిర్లక్ష్యం..

ఈ చిన్నారి పరిస్థితిని చూసి గ్రామస్థులు పలుమార్లు స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చారు. వీల్‌చైర్ కోసం రెండు సంవత్సరాలుగా విన్నవించుకుంటున్నప్పటికీ ఎలాంటి సహాయం అందలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా సహాయం అందించాలని కోరినా అధికారులు స్పందించలేదని ఆరోపిస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్..

ఇటీవల ఈ చిన్నారి స్కూల్‌కు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియోలో ఆమె కష్టపడి నడుస్తూ స్కూల్‌కు వెళ్తున్న దృశ్యాలు చాలా మందిని భావోద్వేగానికి గురి చేశాయి. నెటిజన్లు ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తూ, వెంటనే సహాయం చేయాలని కోరారు.

సోనూసూద్ స్పందన..

ఈ వీడియో Sonu Sood దృష్టికి చేరడంతో ఆయన వెంటనే స్పందించారు. చిన్నారి పరిస్థితిపై స్పందించిన సోనూ సూద్ ఆమెకు వీల్‌చైర్ పంపిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే ఆమె ఇంటికే వీల్‌చైర్ చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో సమాజంలో మానవత్వం ఇంకా బతికే ఉందని గుర్తు చేస్తోంది.

ఇక నటుడు సోనూసూద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రీల్స్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో సైతం హీరో అని పలుమార్లు హీరో అని ప్రూవ్ చేసుకున్నారు. ముఖ్యంగా కరోనా విపత్తు సమయంలో అనేక మంది లాక్ డౌన్ తో ఎక్కడికక్కడ చిక్కుకున్నారు. దీంతో నటుడు సోనూసూద్‌ తన సొంత ఖర్చులతో ప్రత్యేకంగా విమానాలు, రైళ్లు, బస్సుల్లో బాధితులను వారి సొంతూర్లకు పంపించారు. అంతేకాకుండా అనేక మందికి నిత్యవసారాలు, డబ్బులు ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకున్నారు. తరచుగా ఎవరైన పెదవారు గుండె జబ్బుల సర్జరీ, ఇతర పెద్ద పెద్ద వ్యాధుల బారిన పడి ట్రీట్మెంట్ కోసం డబ్బులు లేని వారు నటుడు సోనూసూద్‌ టీమ్ ను అప్రోచ్అయిన ఘటనలు కొకొల్లలు.

తాజాగా.. యూఎస్ ఇజ్రాయేల్ , ఇరాన్ మీద భీకరంగా విరుచుకు పడుతుంది. దీంతో ప్రపంచదేశాలు సైతం రాబోయే రోజుల్లో ఈ యుద్దం ఇంకా ఎంతటి నష్టాలకు దారితీస్తుందో అని టెన్షన్ పడుతున్నారు.
ఎక్కడికక్కడ విమానాశ్రయాలు మూసివేశారు. దీంతో విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు చిక్కుకుని పోయారు. దీంతో దుబాయ్ లో చిక్కుకున్న మన దేశం వారు అయిన లేదా ఇతర దేశాలకు చెందిన వారైన సరే సాయం అందించేందుకు సిద్దంగా ఉన్నట్లు చెప్పారు. సాయం కావాలన్న వారు తన టీమ్ ను సంప్రదించాలన్నారు.





Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

How HARDY’s ‘McArthur’ Parallels Life at Some Country Radio Stations

“When you pass on, what you gonna pass down?” That...

Rihanna, A$AP Rocky Naming Son for Wu-Tang Clan Member a ‘Blessing’

Imagine hearing that Rihanna and A$AP Rocky named their...

CEO Jensen Huang keynote Blackwell Vera Rubin

Nvidia's CEO Jensen Huang speaks during a keynote address...

Apple acquires video editing software company MotionVFX

Apple has acquired MotionVFX, a company that develops plugins,...