Andhra Pradesh
oi-Korivi Jayakumar
దివంగత
మాజీ
ముఖ్యమంత్రి,
తెలుగుదేశం
పార్టీ
వ్యవస్థాపకులు
ఎన్టీఆర్
(
నందమూరి
తారక
రామారావు)కు
మరి
అరుదైన
ఘనత
దక్కింది.
దుబాయ్‌లో
నిర్వహించిన
తెలుగు
వారి
ఆత్మీయ
సమావేశంలో
ఆయన
పాల్గొని..
“ఎన్టీఆర్
సజీవ
చరిత్ర”
అనే
గ్రంథాన్ని
అధికారికంగా
ఆవిష్కరించారు.
ఎన్టీఆర్
స్ఫూర్తిని
ఆదర్శంగా
తీసుకుని..
పోరాట
పటిమతో
జీవితంలో
ముందుకు
సాగాలని
టీడీపీ
పొలిట్‌బ్యూరో
సభ్యులు,
రాజకీయ
కార్యదర్శి
టి.డి.జనార్దన్
వెల్లడించారు.
ఎన్టీఆర్
ఒక్కరే
చిరస్థాయిగా
నాయకుడు..
ఈ
సందర్భంగా
టి.డి.జనార్దన్
మాట్లాడుతూ…
ఆంధ్రప్రదేశ్
రాజకీయ
చరిత్రలో
ఎంతోమంది
ముఖ్యమంత్రులు
పాలించినప్పటికీ,
ప్రజల
మనసుల్లో
చిరస్థాయిగా
నిలిచిపోయిన
నాయకుడు
మాత్రం
ఎన్టీఆర్
ఒక్కరేనని
స్పష్టం
చేశారు.
తెలుగునాట
రాజకీయాల
చరిత్రను
ఎన్టీఆర్‌కు
ముందు..
ఎన్టీఆర్‌కు
తర్వాత
అనే
విధంగా
విభజించవచ్చని
అన్నారు.
రాజకీయాల్లో
విలువలు,
ప్రజాస్వామ్యం,
సామాన్యుడి
గౌరవం
అనే
అంశాలకు
ఎన్టీఆర్
కొత్త
అర్థం
తీసుకొచ్చారని
గుర్తు
చేశారు.
ఎన్టీఆర్
శతజయంతి
సందర్భంగా
ఆయన
ఆలోచనలు,
సిద్ధాంతాలు,
భావజాలాన్ని
నేటి
తరం
యువతకు,
రాబోయే
తరాలకు
అందించాలన్న
సంకల్పంతో
ప్రత్యేక
కమిటీని
ఏర్పాటు
చేశామని
జనార్దన్
తెలిపారు.
అందరి
సహకారం,
సమన్వయంతో
ఎన్టీఆర్
జీవితం,
రాజకీయ
ప్రయాణం,
సామాజిక
సేవలను
ప్రతిబింబించేలా
పలు
పుస్తకాలను
వెలువరిస్తున్నామని
వివరించారు.
కాలానుగుణంగా
డిజిటల్
మాధ్యమాలను
కూడా
వినియోగించుకుంటూ..
ఎన్టీఆర్
ఆలోచనలను
ప్రజలకు
చేరువ
చేయడమే
లక్ష్యంగా
ప్రత్యేక
‘అన్న
ఎన్టీఆర్’
యూట్యూబ్
ఛానల్‌ను
ప్రారంభించామని
ఆయన
వెల్లడించారు.
ఈ
ఛానల్
ద్వారా
ఎన్టీఆర్
ప్రసంగాలు,
అరుదైన
వీడియోలు,
చరిత్రాత్మక
ఘటనలను
యువతకు
పరిచయం
చేయనున్నట్లు
తెలిపారు.
ఎన్టీఆర్
పేరును,
ఆయన
ఆశయాలను
అజరామరం
చేయడమే
తన
జీవిత
లక్ష్యమని
జనార్దన్
స్పష్టం
చేశారు.
భవిష్యత్తులో
ఎన్టీఆర్
పేరుతో
సాహిత్య,
సాంస్కృతిక,
విద్యా
సంబంధిత
కార్యక్రమాలు
చేపట్టడంతో
పాటు,
ప్రవాస
తెలుగు
ప్రజల
భాగస్వామ్యంతో
మరిన్ని
వినూత్న
కార్యక్రమాలు
నిర్వహించనున్నట్లు
తెలిపారు.
తెలుగు
వారి
ఐక్యతకు
ఎన్టీఆర్
ఆదర్శం
ఎన్టీఆర్
కేవలం
రాజకీయ
నాయకుడు
మాత్రమే
కాకుండా,
తెలుగు
జాతి
ఆత్మగౌరవానికి
ప్రతీకగా
నిలిచారని,
ఆయన
బాటలో
నడవడం
అంటే
సామాన్యుడి
హక్కుల
కోసం
నిలబడడమేనని
జనార్దన్
అన్నారు.
ఈ
కార్యక్రమంలో
పాల్గొన్న
ప్రవాస
తెలుగు
ప్రజలు
ఎన్టీఆర్‌కు
ఘనంగా
నివాళులు
అర్పిస్తూ,
ఆయన
ఆశయాలను
కొనసాగించాలని
ప్రతిజ్ఞ
చేశారు.


