Andhra Pradesh
oi-Bomma Shivakumar
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిల గురించ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దువ్వాడ శ్రీనివాస్ తన మొదటి భార్య వాణికి విడాకులు ఇచ్చి ప్రస్తుతం దివ్వెల మాధురితో రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు సమాచారం. ఇటీవల వీరిద్దరూ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. అయితే ఈ ఇంటర్వ్యూలో వీరిద్దరూ పెళ్లి, పిల్లల గురించి మాట్లాడిన మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఇక దివ్వెల మాధురికి ఇదివరకే మహేష్ చంద్రబోస్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఈయన మెరైన్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. నెలకు రూ. 10 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఇక ఈ దంపతులకు ముగ్గురు ఆడపిల్లల సంతానం. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ దంపతులకు కూడా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. అయితే ఇటీవల ఆమె కీలక విషయాలు తెలిపారు. దువ్వాడ శ్రీనివాస్ తో పెళ్లి విషయంపై తన భర్త తనకు ఎలాంటి కండిషన్స్ పెట్టలేదని పేర్కొన్నారు.
అయితే ప్రస్తుతం కోర్టు వివాదాలు, బిజినెస్ వ్యవహారాలు కారణంగా తాము వివాహం చేసుకోవడం లేదని త్వరలోనే పెళ్లి చేసుకుని వారసుడిని పరిచయం చేస్తామంటూ మాధురి తెలిపారు. మరో జనరేషన్ కు దువ్వాడ లాంటి లీడర్ అవసరం ఉద్దేశంతోనే వారసుడికి జన్మను ఇవ్వాలని అనుకుంటున్నామని మాధురి పేర్కొన్నారు. అలాగే ఇకపై తన పిల్లలను తనతో పాటు హైదరాబాద్ లో పెంచుకుంటానని అన్నారు. పిల్లలకు దువ్వాడ శ్రీనివాస్ సపోర్ట్ పూర్తిగా ఉందని తెలిపారు.
ఇక తన పిల్లలతోపాటు శ్రీనివాస్ ఇద్దరి అమ్మాయిల బాధ్యతలు కూడా తాము తీసుకున్నామని మాధురి పేర్కొన్నారు. ఎంతోమంది ప్రజలు బాధ్యతలు తీసుకున్నామని.. తమ పిల్లల బాధ్యతలను ఎందుకు పట్టించుకోమని అన్నారు. పెద్దమ్మాయికి ఇప్పటికే పెళ్లి జరిగింది రెండో అమ్మాయికి తండ్రిగా శ్రీనివాస్ గారు చేయాల్సినవన్నీ చేస్తున్నారని మాధురి తెలిపారు. అయితే ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.


