Cinema
oi-Korivi Jayakumar
నందమూరి
నటసింహం
బాలయ్యకి
దేశ
వ్యాప్తంగా
ఉన్న
క్రేజ్
గురించి
చెప్పాల్సిన
పని
లేదు.
తెరపై
ఆయన
మాస్
డైలాగ్స్,
పవర్‌ఫుల్
స్క్రీన్
ప్రెజెన్స్‌కి
భారీ
ఫాలోయింగ్
ఉంది.
ఎన్టీఆర్
నటవారసత్వాన్ని
కొనసాగిస్తూ
స్టార్
హీరోగా
కొనసాగుతున్నారు.
ఒక
వైపు
రాజకీయంగా
తన
తండ్రి
పెట్టిన
తెలుగు
దేశం
పార్టీ
నుంచి
మూడు
సార్లు
ఎమ్మెల్యేగా
గెలిచి
రికార్డ్
సాధించి
ప్రస్తుతం
ఎమ్మెల్యేగా
ఉన్నారు.
మరోవైపు
సినిమాల్లో
కూడా
వరుసగా
నాలుగు
సినిమాలు
హిట్
కొట్టి
ఫుల్
ఫామ్
లో
ఉన్నారు.
కాగా
వరుస
బ్లాక్‌బస్టర్లతో
జోరు
మీదున్న
బాలకృష్ణ
నందమూరి
అభిమానులకు
అదిరిపోయే
న్యూస్
లీక్
చేశారు.
తన
కుమారుడు
మోక్షజ్ఞ
సినీ
అరంగేట్రంపై
ఎప్పటినుంచో
ఉన్న
ఉత్కంఠకు
తెరదించుతూ
గుడ్
న్యూస్
వెల్లడించారు.
ఆయన
కెరీర్
లో
టాప్
చిత్రంగా
నిలిచిన
సైన్స్
ఫిక్షన్
మూవీ
“ఆదిత్య
369″కు
సీక్వెల్‌గా
రానుంది.
త్వరలోనే
ఆ
మూవీకి
“ఆదిత్య
999
మ్యాక్స్”
పేరుతో
సీక్వెల్
తెరకెక్కిస్తున్నట్టు
స్పష్టం
చేశారు.
అంతే
కాకుండా
గోవాలో
జరుగుతున్న
56వ
ఇంటర్నేషనల్
ఫిల్మ్
ఫెస్టివల్
ఆఫ్
ఇండియా
(IFFI)
వేడుకల్లో
పాల్గొన్న
బాలకృష్ణ
మీడియాతో
మాట్లాడారు.
ఈ
సందర్భంగా
ఆయన
మాట్లాడుతూ..
ఆదిత్య
999
మ్యాక్స్
త్వరలోనే
వస్తుంది.
ఈ
చిత్రంలో
నేను,
మోక్షజ్ఞ
కలిసి
నటిస్తాం
అని
చెప్పుకొచ్చారు.
దీంతో
నందమూరి
అభిమానుల
ఆనందానికి
అవధుల్లేకుండా
పోయాయి.
ఎన్నో
ఏళ్లుగా
మోక్షజ్ఞ
ఎంట్రీ
కోసం
ఎదురుచూస్తున్న
వారికి
ఇది
ఓ
తీపికబురు
అని
సోషల్
మీడియా
వేదికగా
పోస్టులు
పెడుతూ
ట్రెండ్
క్రియేట్
చేస్తున్నారు.
కాగా
1991లో
సింగీతం
శ్రీనివాసరావు
దర్శకత్వంలో
“ఆదిత్య
369”
సినిమా
తెరకెక్కింది.
దాదాపు
35
ఏళ్ల
తర్వాత
వస్తున్న
ఈ
సీక్వెల్‌కు
క్రిష్
దర్శకత్వం
వహించే
అవకాశాలున్నాయని
ప్రచారం
జరుగుతోంది.
అయితే
మోక్షజ్ఞ
సినీ
అరంగేట్రం
ఈ
భారీ
ప్రాజెక్టుతోనే
ఉంటుందా?
లేదా
అంతకంటే
ముందుగా
మరో
సోలో
చిత్రంతో
హీరోగా
వస్తారా
అని
జోరుగా
చర్చ
నడుస్తోంది.
ప్రస్తుతం
బోయపాటి
శ్రీను
దర్శకత్వంలో
అఖండ
2
చిత్రంలో
నటిస్తున్నారు.
‘అఖండ’
మూవీకి
సీక్వెల్
గా
ఈ
చిత్రం
రాబోతుంది.
ఈ
మూవీలో
సంయుక్త
హీరోయిన్
గా
నటిస్తోంది.
14
రీల్స్
ప్లస్
బ్యానర్‌పై
రామ్
ఆచంట,
గోపీ
ఆచంట
ఈ
చిత్రాన్ని
నిర్మిస్తుండగా..
బాలకృష్ణ
చిన్న
కుమార్తె
తేజస్విని
సహ
నిర్మాతగా
వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికే
వీరి
కాంబినేషన్
లో
వచ్చిన
సింహ,
లెజెండ్,
అఖండ
చిత్రాలు
భారీ
హిట్స్
అందుకోగా..
ఈ
మూవీపై
భారీ
అంచనాలు
నెలకొన్నాయి


