నగరంలో ఆపరేషన్ కవచ్: 150 ప్రదేశాలలో తనిఖీలు | Hyderabad City Police Commissionerate Operation Kavach

Date:


హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ నగరంలో.. శాంతిభద్రతలను మరింత బలపరచడం కోసం ‘ఆపరేషన్ కవచ్’ పేరుతో రాత్రి 10:30 గంటల నుంచి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఇందులో 5000 మంది పోలీస్ సిబ్బంది, 150 ప్రదేశాలలో ఒకేసారి తనిఖీలు నిర్వహించనున్నారు.

హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ చరిత్రలో.. ఆపరేషన్ కవచ్ అపూర్వమైన చర్య. ఈ కార్యక్రమంలో లా & ఆర్డర్, ట్రాఫిక్, టాస్క్ ఫోర్స్, ఆర్మ్డ్ రిజర్వ్, బ్లూ కాల్ట్స్ వంటి బృందాలు పాల్గొంటాయి. విస్తృత తనిఖీలు నిర్వహిస్తాయి. దీనికి ప్రజలు కూడా సహకరించాలని, ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు మీ దృష్టికి వస్తే.. 100 డయల్ చేసి చెప్పాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related