Telangana
oi-Bomma Shivakumar
నాంపల్లి
ఎగ్జిబిషన్
లోని
ఓ
ఫర్నీచర్
షాపులో
అగ్నిప్రమాదం
జరిగింది.
నాంపల్లిలోని
బచ్చా
క్రిస్టల్
ఫర్నిచర్
దుకాణంలో
ఒక్కసారిగా
మంటలు
చెలరేగాయి.
చూస్తుండగానే
నాలుగంతస్థులు
ఉన్న
ఈ
భవనంలోని
అన్ని
ఫ్లోర్లకు
మంటలు
వ్యాప్తి
చెందాయి.
వెంటనే
సమాచారం
అందుకున్న
పోలీసులు
హైడ్రా,
విపత్తు
నిర్వహణ
బృందం
ఘటనాస్థలికి
చేరుకుని
సహాయక
చర్యలు
చేపట్టింది.
ఈ
మేరకు
అగ్ని
మాపక
సిబ్బంది
4
ఫైర్
ఇంజిన్
వాహనాలు,
స్కైలిఫ్ట్
క్రేన్
సహాయంతో
మంటలు
ఆర్పుతున్నారు.
ప్రస్తుతం
సహాయక
చర్యలు
ముమ్మరంగా
కొనసాగుతున్నాయి.
నాంపల్లిలోని
బచ్చా
క్రిస్టల్
ఫర్నిచర్
దుకాణంలో
ఒక్కసారిగా
మంటలు
చెలరేగాయి.
దీంతో
నాలుగంతస్తులున్న
ఈ
భవనంలోని
అన్ని
ఫ్లోర్లకు
మంటలు
వేగంగా
వ్యాప్తి
చెందాయి.
ఈ
ఘటనపై
వెంటనే
సమాచారం
అందుకున్న
పోలీసులు,
హైడ్రా,
విపత్తు
నిర్వహణ
బృందం
సహాయక
చర్యలు
చేపట్టారు.
అగ్నిమాపక
సిబ్బంది
4
ఫైర్
ఇంజిన్
వాహనాలు,
స్కైలిఫ్ట్
క్రేన్
సహాయంతో
మంటలు
ఆర్పుతున్నారు.
రోబో
ఫైర్
మిషన్
ద్వారా
రెస్క్యూ
కొనసాగుతోంది.
మరోవైపు
గోదాంలో
పనిచేస్తున్న
మూడు
కుటుంబాలు
మంటల్లో
చిక్కుకున్నట్లు
స్పష్టం
అవుతోంది.
మొత్తం
భవనంలో
ఆరుగురు
చిక్కుకున్నట్లు
గుర్తించారు.
వాచ్
మెన్
కుటుంబంలో
ఇద్దరు
పిల్లలు,
మరో
కుటుంబంలోని
నలుగురు
పెద్దవారు
చిక్కుకున్నట్లు
తేలింది.
చిక్కుకున్న
ఇద్దరు
చిన్నారులను
అఖిల్
(7),
ప్రణీత్
(11)
గా
గుర్తించారు.
ఈ
అగ్ని
ప్రమాదం
నేపథ్యంలో
నాంపల్లి
పరిసర
ప్రాంతాల్లో
భారీగా
ట్రాఫిక్
జామ్
అయింది.
అబిడ్స్,
నాంపల్లి,
MJ
మార్కెట్,
ఏక్
మినార్
లో
ట్రాఫిక్
భారీగా
ఉంది.
దాంతో
నాంపల్లి
ఎగ్జిబిషన్
కు
ఎవరూ
రావొద్దని
పోలీసుల
సూచనలు
చేశారు.
ఎగ్జిబిషన్
పర్యటనను
వాయిదా
వేసుకోవాలని
సూచించారు.


