నాలుగు రోజుల కాపురం.. లక్షల భరణం?: High Court

Date:


India

oi-Lingareddy Gajjala

వివాహం కంటే ముందే విడాకుల మాటలు, కాపురం మొదలకముందే భరణం డిమాండ్లు… ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ ట్రెండ్‌కుహైకోర్టు ఘాటు సందేశం ఇచ్చింది. “సరైన కారణం లేకుండా భర్తను వదిలి వెళ్లే భార్యకు భరణం అడగడానికి హక్కు ఉండదు” అని స్పష్టంగా తేల్చిచెప్పింది. భరణం అనేది ఆటోమేటిక్ హక్కు కాదని, కేవలం పెళ్లి బంధమే ఆధారం కాదని, భార్య ప్రవర్తన కూడా కీలకమే అని న్యాయస్థానం తేల్చింది.

ఈ కేసు వివరాలు కోర్టును కూడా ఆలోచింపజేశాయి. వివాహం జరిగిన నాలుగు రోజులకే మహిళ తన భర్త, అత్తమామలపై వరకట్న వేధింపులు, మానసిక, శారీరక హింస ఆరోపణలు చేసింది. అత్తమామలు రూ.10 లక్షలు నగదు, కారు డిమాండ్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వెంటనే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 125 కింద భరణం కోరుతూ ఛత్తీస్‌గఢ్ హై కోర్టును ఆశ్రయించింది.

‘నేను కాపురానికి సిద్ధం’ అన్న భర్త

అయితే, భర్త మాత్రం స్పష్టంగా ఒక మాట చెప్పాడు. “నేను భార్యతో కలిసి కాపురం చేయడానికి సిద్ధంగా ఉన్నాను” అని న్యాయస్థానానికి తెలియజేశాడు. ఈ అంశాన్ని పరిశీలించిన బిలాస్‌పూర్ ఫ్యామిలీ కోర్టు, భార్య అభ్యర్థనలో తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ భరణం ఇవ్వడానికి నిరాకరించింది.

కారణం లేకుంటే హక్కు లేదు

ఫ్యామిలీ కోర్టు తీర్పును ఛత్తీస్‌గఢ్ హైకోర్టు పూర్తిగా సమర్థించింది. భార్య తన భర్త నుంచి విడిగా జీవించడానికి చట్టబద్ధమైన, సహేతుకమైన కారణాలు చూపలేకపోయిందని ధర్మాసనం పేర్కొంది. భర్త సంసారాన్ని చక్కదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నా, భార్య స్వచ్ఛందంగా అత్తింటిని వదిలి వెళ్లి తిరిగి రావడానికి నిరాకరిస్తే, ఆమె భరణానికి అర్హురాలు కాదని స్పష్టం చేసింది.

సెక్షన్ 125పై కీలక వ్యాఖ్యలు

సీఆర్పీసీ 125 సెక్షన్‌ను ఉదహరిస్తూ, “తగిన కారణం లేకుండా విడిగా నివసించే భార్యకు భరణం ఇవ్వకూడదని చట్టమే చెబుతోంది” అని హైకోర్టు గుర్తు చేసింది. భరణం అనేది నిజంగా బాధితులైన, క్రూరత్వానికి గురైన మహిళలను రక్షించడానికి ఉద్దేశించిందే కానీ, విడిపోవడానికి సరైన న్యాయ కారణం లేకుండా వాడుకునే ఆయుధం కాదని వ్యాఖ్యానించింది.

సమాజానికి స్పష్టమైన సంకేతం

ఈ తీర్పుతో న్యాయస్థానం ఒక స్పష్టమైన గీత గీసింది. విడాకులు తీసుకున్నంత మాత్రాన.. లేదా ఆరోపణలు చేసినంత మాత్రాన భరణం హక్కు రావడం లేదు అనే సంకేతాన్ని దేశవ్యాప్తంగా పంపింది. చట్టాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నాలకు ఇది ఒక గట్టి హెచ్చరికగా న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Watch First Trailer for Netflix Documentary

Thanks to Netflix, we’re about to get a BTS...

BTS Drop New ‘The Return’ Doc Trailer

The upcoming doc will follow the band as they...

Pooh Shiesty Says He Should Be a Nike Balaclava Model

Pooh Shiesty thinks Nike owes him a check. During a...