నేడు ఓలా, ఉబర్, రాపిడో డ్రైవర్ల సమ్మె: ప్రయాణికులకు అలర్ట్!

Date:


India

oi-Jakki Mahesh

దేశవ్యాప్తంగా ఉన్న యాప్ ఆధారిత క్యాబ్, ఆటో, బైక్ ట్యాక్సీ డ్రైవర్లు శనివారం(ఫిబ్రవరి 7) నాడు 6 గంటల పాటు సమ్మె(Ola Uber Rapido Strike Today)కు పిలుపునిచ్చారు. ‘ఆలిండియా బ్రేక్‌డౌన్’ పేరుతో జరుగుతున్న ఈ నిరసన కారణంగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులకు కలిగే అవకాశం ఉంది.

సమ్మెకు ప్రధాన కారణం

తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU), ఇతర జాతీయ కార్మిక సంఘాలు ఈ సమ్మెను నిర్వహిస్తున్నాయి. యాప్ కంపెనీలు ఇష్టానుసారంగా ఛార్జీలు నిర్ణయించడం, డ్రైవర్లను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

డ్రైవర్ల 2 ప్రధాన డిమాండ్లు:

‘మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్-2025’ ప్రకారం, ప్రభుత్వం వెంటనే కనీస బేస్ ఛార్జీలను నోటిఫై చేయాలి. యాప్ కంపెనీలు తమ ఇష్టానుసారంగా ఛార్జీలు తగ్గించకుండా, డ్రైవర్ల యూనియన్లతో చర్చించి ధరలను ఖరారు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వైట్ బోర్డు (ప్రైవేట్) వాహనాలను కమర్షియల్ ప్రయాణాలకు లేదా వస్తువుల రవాణాకు వినియోగించడాన్ని కఠినంగా నిషేధించాలి. దీనివల్ల కమర్షియల్ లైసెన్స్ ఉన్న డ్రైవర్ల ఉపాధి దెబ్బతింటోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రయాణికులపై ప్రభావం:

ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు (సుమారు 6 గంటలు) డ్రైవర్లు యాప్‌ల నుంచి లాగ్ అవుట్ అవుతారు. ఓలా (Ola), ఉబర్ (Uber), రాపిడో (Rapido), పోర్టర్ (Porter) వంటి సేవలకు అంతరాయం ఏర్పడుతుంది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. విమానాశ్రయాలకు లేదా అత్యవసర పనులకు వెళ్లే వారు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను (మెట్రో, ఆర్టీసీ బస్సులు) చూసుకోవడం ఉత్తమం.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related