నేడే పట్టాలెక్కనున్న చర్లపల్లి కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌- ఏపీలో హాల్ట్ స్టేషన్లు

Date:


Telangana

oi-Chandrasekhar Rao

చర్లపల్లికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ నేడు పట్టాలెక్కబోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఎక్స్ ప్రెస్ ను లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించనున్నారు. వర్చువల్ కాన్ఫరెన్స్ విధానంలో దీన్ని లాంచ్ చేయనున్నారు. మొత్తం మూడు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టనుంది. తమిళనాడు, ఏపీ, తెలంగాణ ప్రజలకు మెరుగైన కనెక్టివిటీని కల్పించడానికి ఉద్దేశించిన ఎక్స్ ప్రెస్ ఇది. దీనికి సంబంధించిన టైమింగ్స్, హాల్ట్ స్టేషన్ల వివరాలను రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.

నంబర్ 06357 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ ఈ సాయంత్రం 5:30 నిమిషాలకు నాగర్ కోయిల్ నుండి బయలుదేరుతుంది. గురువారం రాత్రి 11:45 నిమిషాలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఇది ప్రారంభోత్సవం సందర్భంగా పట్టాలెక్కబోయే రైలు. కమర్షియల్ ఆపరేషన్స్ టైమింగ్స్ ను నేడో, రేపో వెలువడుతుంది.

వల్లియూర్, తిరునెల్వేలి, కోవిల్ పట్టి, సత్తూరు, విరుధునగర్, మధురై, దిండిగల్, తిరుచిరాపల్లి, తంజావూరు, పాపనాశం, కుంభకోణం, మైలాడుథురై, సర్కాజి, చిదంబరం, తిరుప్పాద్రిపులియూర్, విల్లుపురం, చెంగల్పట్టు, తాంబరం, చెన్నై ఎగ్మూర్, సూళ్లూరుపేట, నాయుడుపేట, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్లగొండ మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related