Telangana
oi-Bomma Shivakumar
నారాయణపేట
జిల్లా
కోస్గి
లో
ఏర్పాటు
చేసిన
నూతన
సర్పంచ్
ల
సన్మాన
సభలో
సీఎం
రేవంత్
రెడ్డి
కీలక
వ్యాఖ్యలు
చేశారు.
2029
ఎన్నికల్లో
119
నియోజకవర్గాలకు
ఎన్నికలు
జరిగితే
87
సీట్లతో
కాంగ్రెస్
ను
అధికారంలోకి
తీసుకొస్తామని
అన్నారు.
ఒకవేళ
150
నియోజకవర్గాలకు
ఎన్నికలు
జరిగితే
100కు
పైగా
స్థానాలతో
రాష్ట్రంలో
కాంగ్రెస్
ను
అధికారంలోకి
తీసుకొస్తామని
స్పష్టం
చేశారు.
ఈ
మేరకు
బీఆర్ఎస్
అధినేత,
మాజీ
సీఎం
కేసీఆర్
కు
సవాల్
విసిరారు.
“చాలా
రోజుల
తరువాత
బయటకు
వచ్చి
తోలు
తీస్తానని
కెసీఆర్
మాట్లాడుతున్నారు.
మా
సర్పంచులు
చీరి
చింతకు
కట్టి
చింతమడకకు
పంపిస్తారు
జాగ్రత్త.
సోయి
లేని
మాటలు..
స్థాయి
లేని
విమర్శలు.
ఒక్కటైనా
ప్రజలకు
పనికొచ్చే
మాటలు
మాట్లాడలేదు.
పదేండ్లు
పాలమూరుపై
పగబట్టి..
పాలమూరు
అభివృద్ధిని
అడ్డుకున్నాడు.
మటన్
కొట్టు
మస్తాన్
కు
చెప్తా…
అక్కడకు
వెళ్లి
తోలు
తీయ్.
నలభై
ఏండ్ల
అనుభవంతో
మాట్లాడే
మాటలు
ఇవేనా..
మాకు
మాటలు
రాక
కాదు.
మర్యాద
ఉండదని
మాట్లాడటం
లేదు”
అని
సీఎం
రేవంత్
రెడ్డి
పేర్కొన్నారు.
“రియల్
ఎస్టేట్
బ్రోకర్
దందా
అంటున్నాడు..
ఇదేం
దుబాయ్
పాస్
పోర్ట్
బ్రోకర్
దందా
కాదు.
నేనేం
పాస్
పోర్టు
బ్రోకర్
దందా
చేయలేదు.
అయ్య
పేరు
చెప్పుకుని
మంత్రి
పదవి
తీసుకోలేదు.
మేం
కక్షా
రాజకీయాలు
చేయం..
ఎవరి
పాపాన
వాళ్లే
పోతారని
మా
పని
మేం
చేసుకుంటున్నాం.
అయినా
మా
జోలికి
వస్తే
మా
కార్యకర్తలు
ఊరుకోరు”
అని
సీఎం
రేవంత్
అన్నారు.
“కొడంగల్
వేదికగా
సవాల్
విసురుతున్నా..
2029
ఎన్నికల్లో
119
నియోజకవర్గాలకు
ఎన్నికలు
జరిగితే
87
సీట్లతో
కాంగ్రెస్
ను
అధికారంలోకి
తీసుకొస్తా.
150
నియోజకవర్గాలకు
ఎన్నికలు
జరిగితే
100కు
పైగా
స్థానాలతో
రాష్ట్రంలో
కాంగ్రెస్
ను
అధికారంలోకి
తీసుకొస్తా..ఇదే
నా
సవాల్..
చేతనైతే
కాస్కో
బిడ్డా”
అని
సీఎం
రేవంత్..
కేసీఆర్
కు
సవాల్
విసిరారు.
“నేను
రాజకీయాల్లో
ఉన్నంత
కాలం..
రాబోయే
ఎన్నికల్లో
కేసీఆర్
కు
అధికారం
ఇక
కల్లనే.
బీఆర్ఎస్,
కేసీఆర్
చరిత్ర
ఇక
ఖతమే..
కొడంగల్
సాక్షిగా
ఇదే
నా
శపథం.
పది
మందిని
వెనకేసుకుని
పొంకనాలు
కొట్టుడు
కాదు.
అసెంబ్లీలో
చర్చిద్దాం
రా.
ఏ
అంశంపై
అయినా
అసెంబ్లీలో
చర్చించేందుకు
మేం
సిద్ధం.
సభకు
రండి..
అర్థవంతమైన
చర్చ
చేద్దాం.
కాళేశ్వరంపై
చర్చిద్దామా,
కృష్ణా
గోదావరి
జలాలపై
చర్చిద్దాం,
టెలిఫోను
ట్యాపింగ్
పై
చర్చిద్దామా
రండి”
అని
సీఎం
రేవంత్
రెడ్డి
సవాల్
విసిరారు.
“సొంత
చెల్లిలి
భర్త
ఫోన్
ట్యాపింగ్
చేశారని
వాళ్ళింటి
ఆడబిడ్డనే
చెబుతోంది.
సొంత
చెల్లెలికి
సమాధానం
చెప్పలేని
కేటీఆర్
నాకు
సవాల్
విసురుతున్నాడు.
మీ
గ్రాండ్రింపులకు,
బెదిరింపులకు
భయపడేది
లేదు.
తోలు
తీసుడు
కాదు..
మీ
తోలు
సంగతి
చూసుకోండి”
అని
సీఎం
రేవంత్
రెడ్డి
సవాల్
చేశారు.


