నో దోసె, నో పూరీ: బెంగళూరు పీజీల్లో రెండు పూటల మాత్రమే భోజనం

Date:


India

oi-Chandrasekhar Rao

బెంగళూరులోని పేయింగ్ గెస్ట్ (PG) వసతి గృహాలు భారీగా ఎల్‌పిజి సిలిండర్ల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఏర్పడిన ఈ సంక్షోభం వారి రోజువారీ ఫుడ్ మెనుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు పీజీ యజమానులు పలు నిర్ణయాలు తీసుకుంటోన్నారు. గ్యాస్ ఎక్కువగా వినియోగించే దోశ, పూరీ, చపాతీ వంటి వంటకాలకు బదులుగా బియ్యం ఆధారిత ఆహారాలకు మారాలని నిర్ణయించారు.

నగరంలో వాణిజ్య ఎల్‌పిజి సిలిండర్ల కొరత తీవ్రంగా ఉందని, ఇది లక్షలాది మంది పేయింగ్ గెస్ట్ గా ఉంటోన్న వారిపై ప్రభావం చూపుతోందని పీజీ యజమానుల సంక్షేమ సంఘం తెలిపింది. గ్యాస్‌ను ఆదా చేయడం, ఆహార సరఫరాకు అంతరాయం కలగకుండా చూసేందుకు తాత్కాలిక మార్గదర్శకాలను జారీ చేసింది. వారంలో రెండుసార్లు మాత్రమే భోజనం అందించాలని, ఎలక్ట్రిక్ వంట పద్ధతులను అవలంబించాలని సూచనలు చేసింది.

ఈ గ్యాస్ కొరత వల్ల నగరంలోని లక్షలాది మందికి సేవలు అందిస్తున్న పీజీ కిచెన్‌లు సక్రమంగా నడపడం కష్టంగా మారిందని సంఘం అధ్యక్షుడు అరుణ్ కుమార్ పేర్కొన్నారు. వాణిజ్య సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో హోటళ్లు కూడా ఆహారాన్ని తయారు చేయడానికి ఇబ్బంది పడుతున్నాయని, పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బెంగళూరులో నివసించడానికి లక్షలాది మంది పీజీ వసతి గృహాలపై ఆధారపడుతున్నారని, వారికి ఆహార ఏర్పాట్లలో ఎటువంటి అంతరాయం కలగకుండా చూడటం అత్యవసరమని పేర్కొన్నారు.

తాత్కాలిక చర్యల్లో భాగంగా గ్యాస్ వినియోగాన్ని తగ్గించడానికి కొత్త మెనూను తక్షణమే అమలు చేయాలని పీజీ యజమానులకు ఈ అసోసియేషన్ సూచించింది. సోమవారం నుండి శుక్రవారం వరకు రోజుకు రెండుసార్లు మాత్రమే భోజనం అందించాలని, నివాసితులు లంచ్ బాక్సులు తెచ్చుకోవాలని కోరింది. శని, ఆదివారాల్లో మాత్రం రోజుకు మూడుపూటలా భోజనం అందించవచ్చు.

అధిక గ్యాస్ వినియోగించే దోశ, పూరీ, చపాతీ వంటి వంటకాలను నివారించాలని మార్గదర్శకాలలో స్పష్టంగా పేర్కొన్నారు. బదులుగా బిసిబేళా బాత్, చిత్రన్నం, పులిహోర వంటి బియ్యం ఆధారిత వంటకాలను తయారు చేయమని సూచింంచింది. సలాడ్‌, ఫ్రూట్ సలాడ్‌, పప్పులు, తక్కువ వంట అవసరమయ్యే పదార్థాలతో కూడిన ఫైర్‌లెస్ కుకింగ్ ఎంపికలను కూడా పరిశీలించమని పేర్కొంది.

ఎల్‌పిజిపై ఆధారపడటాన్ని తగ్గించడానికి సాంకేతిక ప్రత్యామ్నాయాలను కూడా సంఘం సూచించింది. పీజీ యజమానులు ఇండక్షన్ స్టవ్‌లు, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లు, ఇతర విద్యుత్ పరికరాలను ఉపయోగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా పీజీలు 20 లీటర్ల ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లను ఉపయోగించడం వల్ల గ్యాస్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చని సలహా ఇచ్చింది.

సమీపంలోని పీజీల మధ్య జాయింట్ కుకింగ్ ఏర్పాట్లు కూడా చేసుకోవచ్చు. ఈ విధానం కింద ఒకే పీజీ కిచెన్‌లో ఆహారాన్ని తయారు చేసి, పొరుగున ఉన్న వసతిగృహాలకు పంపిణీ చేయవచ్చు. దీనివల్ల అనేక పీజీలు గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. నివాసితులు తమ వ్యక్తిగత గ్యాస్ సిలిండర్‌లను ఉపయోగించి వంట చేయడం ఖచ్చితంగా నిషేధించారు. సొంత వంట గ్యాస్ సౌకర్యాన్ని తాత్కాలికంగా రద్దు చేసింది.

అవసరమైతే ఇండక్షన్ స్టవ్‌లను ఉపయోగించుకోవచ్చని తెలిపింది. కొరత మరింత తీవ్రమైతే, డిమాండ్ తక్కువగా ఉండే చిన్న పట్టణాల నుండి గ్యాస్ సిలిండర్లను సేకరించే అవకాశాన్ని కూడా సంఘం అన్వేషిస్తోంది. ఈ కొరత కొనసాగితే పరిస్థితి మరింత కష్టతరం అవుతుందని అరుణ్ కుమార్ హెచ్చరించారు. 10- 15 రోజులపాటు కొనసాగితే, పరిస్థితులు దుర్భరంగా మారుతాయని అన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Phil Campbell, Motörhead Guitarist, Dead at 64

Phil Campbell, the longtime guitarist of Motörhead, has died...

Older women may inherit most of $54 trillion

Alistair Berg | Digitalvision | Getty ImagesFor many married...