India
oi-Bomma Shivakumar
దేశవ్యాప్తంగా
న్యూ
ఇయర్
సెలబ్రేషన్స్
కు
ముస్తాబవుతున్న
వేళ
రాజస్థాన్
లో
భారీ
ఉగ్ర
కుట్రను
భగ్నం
చేశారు
పోలీసులు.
రాజాస్థాన్
లో
ఓ
కారులో
భారీ
స్థాయిలో
పేలుడు
పదార్థాలను
స్వాధీనం
చేసుకున్నారు.
150
కిలోల
అమ్మోనియం
నైట్రేట్,
పేలుడు
కాట్రిజ్
లు,
ఫ్యూజ్
వైర్లు
ఉన్నట్లు
గుర్తించారు.
వాటిని
పోలీసులు
స్వాధీనం
చేసుకున్నారు.
న్యూ
ఇయర్
సెలబ్రేషన్స్
వేళ
దిల్లీ
తరహా
పేలుళ్లకు
స్కెచ్
వేసినట్లు
తెలుస్తోంది.
రాజస్థాన్
లోని
టోంక్
ప్రాంతంలో
ఓ
కారులో
అక్రమంగా
తరలిస్తున్న
భారీ
పేలుడు
పదార్థాలను
పోలీసులు
స్వాధీనం
చేసుకున్నారు.
పోలీసులు
జరిపిన
తనిఖీల్లో
భాగంగా
ఓ
మారుతీ
కారులో
దాదాపు
150
కిలోల
అమ్మోనియం
నైట్రేట్,
2000
పేలుడు
కాట్రిజ్
లు,
1,100
మీటర్ల
సేఫ్టీ
ఫ్యూజ్
వైర్లను
స్వాధీనం
చేసుకున్నారు.
రాజస్థాన్
లోని
బూంది
ప్రాంతం
నుంచి
టోంక్
ప్రాంతానికి
పేలుడు
పదార్థాలు
సరఫరా
అవుతున్నాయని
పోలీసులకు
సమాచారం
అందించిన
నేపథ్యంలో
తనిఖీలు
నిర్వహించారు.
అనుమానాస్పదంగా
ఉన్న
కారులో
సోదాలు
జరిపిన
నేపథ్యంలో
భారీగా
పేలుడు
పదార్థాలను
స్వాధీనం
చేసుకున్నారు.
ఈ
క్రమంలో
పేలుడు
పదార్థాలను
అక్రమంగా
తరలిస్తున్న
సురేంద్ర
మోచి,
సురేంద్ర
పట్వా
అనే
ఇద్దరిని
అదుపులోకి
తీసుకున్నారు.
ప్రస్తుతం
వీరిపై
పూర్తిస్థాయిలో
విచారణ
జరుపుతున్నారు.
ఇక
గత
నెలలో
దిల్లీలోని
ఎర్రకోట
వద్ద
జరిగిన
కారు
బాంబు
పేలుడులో
15
మంది
మరణించిన
విషయం
తెలిసిందే.
ఈ
ఘటనలో
అనేక
మందికి
తీవ్ర
గాయాలయ్యాయి.
దర్యాప్తు
జరిపిన
ఎన్ఐఏ
బృందం
కీలక
విషయాలను
తేల్చింది.
ఉగ్రవాది
ఉమర్
ఉన్
నబీ
ఐ20
కారులో
ఆత్మాహుతి
చేసుకొని
ఈ
దారుణానికి
పాల్పడినట్టు
పేర్కొంది.
ఈ
కేసులో
ఇప్పటికే
పలువురిని
అదుపులోకి
తీసుకుని
దర్యాప్తు
చేస్తున్నారు.
ఇదే
కేసులో
అల్-
ఫలాహ్
వర్సిటీకి
చెందిన
చాలా
మంది
డాక్టర్లకు
సంబంధాలు
ఉన్నట్లు
వెల్లడైంది.


