India
oi-Jakki Mahesh
న్యూ
ఇయర్
వేడుకల
వేళ
ముంబైలో
ఓ
భయంకరమైన
ఘటన
వెలుగుచూసింది.
తనను
పెళ్లి
చేసుకోవాలని
ఒత్తిడి
చేస్తూ..
నిరాకరించిన
ప్రియుడిపై
ఓ
మహిళ
కత్తితో
దాడి
చేసి
అతడి
ప్రైవేట్
భాగాన్ని
కోసేసింది.
ప్రస్తుతం
బాధితుడు
ఆస్పత్రిలో
ప్రాణాపాయ
స్థితిలో
చికిత్స
పొందుతున్నాడు.
అసలేం
జరిగిందంటే?
పోలీసులు
వెల్లడించిన
వివరాల
ప్రకారం..
బాధితుడు
(44),
నిందితురాలు
(25)
ఇద్దరూ
వివాహితులు.
వీరిద్దరి
మధ్య
గత
ఆరేడు
ఏళ్లుగా
వివాహేతర
సంబంధం
కొనసాగుతోంది.
నిందితురాలు
బాధితుడి
సోదరి
ఆడపడుచు
అని
తెలుస్తోంది.
గత
కొంతకాలంగా
తన
భార్యను
వదిలేసి
తనను
పెళ్లి
చేసుకోవాలని
ఆ
మహిళ
బాధితుడిపై
ఒత్తిడి
తెస్తోంది.
ఈ
విషయంలో
వీరిద్దరి
మధ్య
తరచూ
గొడవలు
జరుగుతుండేవి.
ఈ
వేధింపులు
భరించలేక
బాధితుడు
గత
నవంబర్‌లో
బీహార్‌కు
వెళ్లిపోయాడు.
అయినప్పటికీ
ఆమె
ఫోన్
ద్వారా
అతడిని
బెదిరిస్తూనే
ఉంది.
న్యూఇయర్
స్వీట్
ఇస్తానని
పిలిచి
ఘాతుకం
డిసెంబర్
19న
బాధితుడు
తిరిగి
ముంబైకి
వచ్చాడు.
ఆమెకు
దూరంగా
ఉండాలని
నిర్ణయించుకున్నప్పటికీ
డిసెంబర్
31
అర్ధరాత్రి
1:30
గంటల
సమయంలో
“కొత్త
సంవత్సరం
స్వీట్లు
ఇస్తాను
రమ్మని”
ఆమె
అతడిని
తన
ఇంటికి
ఆహ్వానించింది.
ఆ
సమయంలో
ఆమె
పిల్లలు
నిద్రపోతున్నారు.
బాధితుడు
ఇంటికి
వెళ్లిన
తర్వాత
ఆమె
వంటింట్లోకి
వెళ్లి
కూరగాయలు
కోసే
కత్తిని
తెచ్చి
అకస్మాత్తుగా
అతని
జననేంద్రియాలపై
దాడి
చేసింది.
దీంతో
అతనికి
తీవ్ర
రక్తస్రావమైంది.
తీవ్ర
గాయాలపాలైన
బాధితుడు
ఎలాగోలా
తన
ఇంటికి
చేరుకోగా..
అతని
కుమారులు,
స్నేహితులు
వెంటనే
ఆస్పత్రికి
తరలించారు.
బాధితుడి
పరిస్థితి
విషమంగా
ఉందని,
అతనికి
శస్త్రచికిత్స
అవసరమని
వైద్యులు
వెల్లడించారు.
ఈ
ఘటనపై
కేసు
నమోదు
చేసిన
ముంబై
పోలీసులు
ప్రస్తుతం
పరారీలో
ఉన్న
మహిళ
కోసం
గాలిస్తున్నారు.


