Andhra Pradesh
oi-Syed Ahmed
ఏపీలో
పల్నాడు
రాజకీయాల్లో
కీలక
వైసీపీ
నేతలు
పిన్నెల్లి
రామకృష్ణారెడ్డి,
ఆయన
సోదరుడు
పిన్నెల్లి
వెంకట్రామిరెడ్డిలకు
ఇవాళ
మరో
ఎదురుదెబ్బ
తగిలింది.
టీడీపీకి
చెందిన
నేతల
జంట
హత్యల
కేసులో
ఆరోపణలు
ఎదుర్కొంటున్న
వీరు
ప్రస్తుతం
జైల్లో
రిమాండ్
లో
ఉన్నారు.
ఈ
రిమాండ్
గడువు
ముగుస్తున్న
నేపథ్యంలో
ఇవాళ
వీరిద్దరినీ
నరసరావుపేట
జూనియర్
సివిల్
జడ్జి
ముందు
వర్చువల్
గా
పోలీసులు
హాజరుపర్చారు.
టీడీపీ
నాయకుల
జంట
హత్యల
కేసులో
నిందితులుగా
ఉన్న
పిన్నెల్లి
రామకృష్ణారెడ్డి,
పిన్నెల్లి
వెంకట్రామిరెడ్డికి
గతంలో
కోర్టు
విధించిన
రిమాండ్
ను
మరో
రెండు
వారాల
పాటు
పొడిగించాలని
ప్రాసిక్యూషన్
కోర్టును
కోరింది.
దీనిపై
విచారణ
జరిపిన
జూనియర్
సివిల్
జడ్డి..
జనవరి
7వ
తేదీ
వరకూ
రిమాండ్
పొడిగిస్తూ
ఇవాళ
ఆదేశాలు
ఇచ్చారు.
దీంతో
వీరిద్దరూ
జనవరి
7
వరకూ
జైల్లోనే
ఉండాల్సిన
పరిస్ధితి
నెలకొంది.
ఈ
నేపథ్యంలో
వారు
బెయిల్
కోసం
హైకోర్టును
ఆశ్రయిస్తారని
తెలుస్తోంది.
గతేడాది
పల్నాడు
జిల్లా
గుండ్లపాడులో
జరిగిన
ఇద్దరు
టీడీపీ
కార్యకర్తల
హత్య
కేసులో
పిన్నెల్లి
సోదరులపై
ఈ
ఏడాది
మే
25న
పోలీసులు
కేసు
పెట్టారు.
ఈ
కేసులో
పిన్నెల్లి
రామకృష్ణారెడ్డిని
ఏ6గానూ,
పిన్నెల్లి
వెంకట్రామిరెడ్డిని
ఏ7గానూ
ఉన్నారు.
ఈ
కేసులో
తమకు
ముందస్తు
బెయిల్
ఇవ్వాలని
కోరుతూ
సుప్రీంకోర్టును
ఆశ్రయిచిన
పిన్నెల్లి
సోదరులకు
తాత్కాలిక
ఊరట
దక్కింది.
దీనిపై
తిరిగి
ప్రభుత్వం
బెయిల్
షరతుల
ఉల్లంఘించారంటూ
కోర్టును
ఆశ్రయించింది.
దీంతో
అది
కాస్తా
రద్దయింది.
అనంతరం
వీరిద్దరూ
గత
నెలలో
మాచర్ల
కోర్టులో
లొంగిపోయారు.
అనంతరం
వీరిద్దరికీ
రిమాండ్
విధించారు.
అందులో
భాగంగానే
వీరు
జైలు
జీవితం
గడుపుతున్నారు.


