పీఎం కిసాన్ నిధులు జమ కాలేదా – అయితే, ఇలా చేస్తే వెంటనే..!!

Date:


Andhra Pradesh

oi-Sai Chaitanya

పీఎం కిసాన్ నిధుల పై అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ నెల 13న ప్రధాని మోదీ గౌహతి లో 22వ విడత పీఎం కిసాన్ నిధులు విడుదల చేసారు. దేశ వ్యాప్తంగా అర్హత సాధించిన రైతుల ఖాతా ల్లో ఒకే సారి నిధులు జమ అయ్యాయి. ఏపీలో పీఎం కిసాన్ తో పాటుగా అన్నదాత సుఖీభవ నిధుల ను ఖాతాల్లో వేసారు. అయితే, పీఎం కిసాన్ నిధుల అందని రైతులకు కీలక సూచన చేస్తున్నారు. ఫోన్ నెంబర్ ద్వారా ఫిర్యాదు చేయటంతో సమస్య పరిష్కరించుకోవచ్చని సూచిస్తున్నారు. ఈ మేరకు హెల్ప్ లైన్ నెంబర్లను ప్రకటించారు.

ప్రధాని మోదీ 22వ విడత పీఎం కిసాన్ నిధులను విడుదల చేసారు. రైతుల ఖాతాల్లో ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో మూడో విడతగా రూ 2 వేలు జమ చేసారు. దీని ద్వారా దాదాపు రూ.18,640 కోట్లను కేంద్రం రిలీజ్ చేసింది. సుమారు 9 కోట్ల 32 లక్షల మంది రైతులకు ఈ విడతలో రూ.2 వేల చొప్పున అందించారు. అయితే, అర్హత ఉన్నా తమ ఖాతాల్లో నిధులు జమ కాలేదని కొందరు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరి కోసం అధికార యంత్రాంగం కీలక సూచన చేస్తోంది. నిధులు రాని వారు హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. పీఎం కిసాన్ లబ్దిదారుల జాబితాలో పేరు ఉండి డబ్బులు పొందేందుకు అర్హత ఉన్నా నిధులు జమ కాకుంటే ఈమెయిల్, టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన హెల్ప్‌లైన్ నంబర్లు 155261, 1800115526 లేదా 011-23381092 నెంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు[email protected]కి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

నిధులు అందకపోతే వెంటనే ఇలా చేస్తే..

ఈ నెంబర్లకు కాల్ చేయటం ద్వారా అర్హత ఉన్నా.. నిధులు ఎందుకు అందలేదనే సమాచారం రైతులు తెలుసుకోవచ్చు. ఆ కారణం తెలుసుకుని సమస్యను పరిష్కరించుకుంటే మీ అకౌంట్లో డబ్బులు పడతాయి. ఇప్పటికే కేంద్రం పలుమార్లు రైతులకు కేవైసీ గురించి హెచ్చరిక చేసింది. అర్హత ఉన్న ప్రతీ రైతు.. కేవైసీ చేయకపోతే పీఎం కిసాన్ నిధులు జమ కావని స్పష్టం చేసింది. ఇలాంటి రైతులకు ఈ సారి నిధులు నిలిచిపోయాయి. ఏడాదిలో ఒకసారి పీఎం కిసాన్ వెబ్ సైట్లోకి వెళ్లి ఈకేవైసీ అప్డేట్ చేయాలి. ఇలా చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశముంది. ఇక ఈకేవైసీ, బ్యాంక్ అకౌంట్లో ఏమైనా లోపాలు ఉన్నా నిలిచిపోవచ్చు. ఇక మీ బ్యాంక్ అకౌంట్‌ను ఈకేవైసీ, ఆధార్‌తో లింక్ చేయకపోవడం వల్లన నిధులు నిలిచిపోతాయి. ఇక ల్యాండ్ రికార్డుల్లో తప్పులు ఉండటం వల్ల కూడా పీఎం కిసాన్ జమ కావని అధికారులు చెబుతున్నారు. కేంద్రం ఖరారు చేసిన నిబంధనలకు అర్హత ఉండీ.. నిధులు జమ కాకుంటే, వారి ఫిర్యాదు ఆధారంగా వెంటనే నగదు క్రెడిట్ చేస్తారని అధికారులు వెల్లడించారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related