International
oi-Korivi Jayakumar
భారత్
పర్యటనకు
వచ్చిన
రష్యా
అధ్యక్షుడు
వ్లాదిమిర్
పుతిన్‌కు
ప్రధానమంత్రి
నరేంద్ర
మోదీ
ప్రత్యేక
స్వాగతం
పలికారు.
న్యూఢిల్లీ
సమీపంలోని
పాలం
ఎయిర్‌పోర్ట్‌లో
పుతిన్
విమానం
ల్యాండ్
అయ్యింది.
అయితే
సాధారణంగా
ప్రోటోకాల్
ప్రకారం
సీనియర్
మంత్రులు
లేదా
అధికారులు
ఆయనకు
స్వాగతం
పలకాలి.
కానీ
ఈసారి
ప్రధాని
మోడీ
స్వయంగా
ప్రోటోకాల్‌ను
పక్కనపెట్టి..
తమ
స్నేహాన్ని
మరోమారు
రుజువు
చేస్తూ
ప్రత్యేక
ఆతిథ్యం
ఇచ్చారు.
ప్రోటోకాల్‌ను
పక్కన
పెట్టిన
మోడీ..
భారత్‌కు
అత్యంత
సన్నిహిత
మిత్ర
దేశాధ్యక్షుడు
వస్తున్నారని
భావించిన
మోడీ..
తన
సెక్యూరిటీ
పరిమితులను
కూడా
పక్కన
పెట్టి
నడుచుకుంటూ
నేరుగా
పుతిన్
వైపు
వెళ్లారు.
ఇద్దరూ
చూసుకుంటూనే
చిరునవ్వులు
పంచుకోవడం..
హత్తుకోవడం
అక్కడికక్కడే
అంతర్జాతీయ
మీడియా
దృష్టిని
ఆకర్షించింది.
మోదీ
ఈ
చర్య
ద్వారా
“భారత్-రష్యా
బంధం
కేవలం
వ్యూహాత్మకం
మాత్రమే
కాదు,
వ్యక్తిగత
మైత్రితో
కూడినది”
అని
ప్రపంచానికి
మెసేజ్
ఇచ్చినట్టయింది.
ఒకే
కారులో
ప్రయాణించిన
ఇద్దరు
నేతలు..
స్వాగత
కార్యక్రమం
అనంతరం
మోదీ,
పుతిన్
ఒకే
కారులో
ప్రధాని
నివాసం
వైపు
బయల్దేరడం
మరింత
చర్చనీయాంశమైంది.
సాధారణంగా
విదేశీ
అతిథులు
తమ
ప్రత్యేక
సెక్యూరిటీ
వాహనాల్లో
ప్రయాణించడం
సంప్రదాయం.
అయితే
ఈసారి
పుతిన్‌ను
మోదీ
తన
వాహనంలోనే
తీసుకెళ్లడం,
ఇద్దరి
మధ్య
ఉన్న
అనుబంధాన్ని
స్పష్టంగా
చూపించింది.
ఈ
పర్యటనలో
రక్షణ,
ఇంధనం,
వ్యాపారం,
అంతరిక్ష
పరిశోధన,
చమురు
సరఫరా,
న్యూక్లియర్
ఎనర్జీ
రంగాల్లో
కీలక
ఒప్పందాలు
ఖరారు
కానున్నట్లు
తెలుస్తోంది.
ముఖ్యంగా,
రష్యా
నుంచి
భారత
సైన్యానికి
సంబంధించిన
పరికరాలు,
జాయింట్
మాన్యుఫ్యాక్చరింగ్,
భారత్‌కు
పెట్రోలియం
సరఫరాపై
ప్రత్యేక
చర్చలు
జరగనున్నాయి.
అంతేకాకుండా,
అంతర్జాతీయ
పరిస్థితులు,
ఉక్రెయిన్
యుద్ధం,
గ్లోబల్
ట్రేడ్
మార్పులపై
కూడా
ద్వైపాక్షిక
చర్చ
జరుగుతుందని
దౌత్య
వర్గాలు
చెబుతున్నాయి.
ఉక్రెయిన్
యుద్ధం
కారణంగా
పుతిన్
వెలుపల
పర్యటనలు
చాలా
అరుదుగా
జరుగుతున్న
నేపథ్యంలో,
భారత్
కోసం
ఆయన
తీసుకున్న
ఈ
నిర్ణయం
ప్రపంచ
దేశాల
దృష్టిని
ఆకర్షించింది.
“రష్యాకు
భారత్
అనేది
విశ్వసనీయ
మిత్రుడు”
అనే
విషయాన్ని
ఈ
పర్యటన
మరోసారి
నిరూపించింది.


