Andhra Pradesh
oi-Chandrasekhar Rao
వైఎస్ఆర్
కాంగ్రెస్
పార్టీ
అధినేత,
మాజీ
ముఖ్యమంత్రి
వైఎస్
జగన్మోహన్
రెడ్డి
ప్రస్తుతం
తన
సొంత
నియోజకవర్గం
కడపజిల్లా
పులివెందులలో
పర్యటిస్తోన్నారు.
మూడు
రోజుల
పర్యటన
కోసం
ఆయన
ఇక్కడికి
వచ్చారు.
ప్రతి
సంవత్సరం
క్రిస్మస్
వేడుకలను
సొంత
ఊరిలో,
కుటుంబ
సభ్యుల
మధ్య
ఆనందోత్సాహాలతో
జరుపుకోవడం
ఆనవాయితీగా
పెట్టుకున్నారాయన.
ఈ
ఏడాది
కూడా
దీన్ని
కొనసాగిస్తోన్నారు.
క్రిస్మస్
వేడుకల
కోసం
ఆయన
తల్లి
వైఎస్
విజయమ్మ
కూడా
హైదరాబాద్
నుంచి
పులివెందులకు
వచ్చారు.
ఈ
పర్యటనలో
జగన్..
మంగళవారం
మధ్యాహ్నం
బెంగళూరు
నుంచి
హెలికాప్టర్
లో
బయలుదేరిన
జగన్..
భాకరాపురానికి
చేరుకున్నారు.
అక్కడి
నుంచి
ఇడుపులపాయ
క్యాంప్
కార్యాలయానికి
వచ్చారు.
సాయంత్రం
వరకు
పులివెందులలో
ప్రజలకు
అందుబాటులో
ఉన్నారు.
రాత్రి
పులివెందుల
ఇంట్లో
బస
చేశారు.
మధ్యాహ్నం
ఒంటి
గంటకు
ఇడుపులపాయ
నుంచి
బయలుదేరి
పులివెందులకు
చేరుకుని
భాకరాపేట
క్యాంప్
ఆఫీస్‌లో
ప్రజాదర్బార్
నిర్వహిస్తారు.
రాత్రికి
అక్కడి
నివాసంలో
బస
చేస్తారు.
గురువారం
ఉదయం
8.30
గంటలకు
క్రిస్మస్
సందర్భంగా
సీఎస్‌ఐ
చర్చిలో
జరిగే
ప్రార్థనల్లో
పాల్గొంటారు.
అనంతరం
భాకరాపురం
హెలిప్యాడ్
నుంచి
హెలికాప్టర్
ద్వారా
బెంగళూరుకు
తిరుగు
ప్రయాణం
అవుతారు.
పులివెందుల
చేరుకున్న
జగన్
ను
కడప
ఎంపీ
వైఎస్
అవినాష్
రెడ్డి,
పార్టీ
జిల్లా
అధ్యక్షుడు
పోచంరెడ్డి
రవీంద్రనాథరెడ్డి,
మాజీ
డిప్యూటీ
సీఎం
అంజాద్
బాషా,
పార్టీ
అన్నమయ్య
జిల్లా
అధ్యక్షుడు,
రాజంపేట
ఎమ్మెల్యే
ఆకేపాటి
అమరనాథరెడ్డి,
బద్వేలు
ఎమ్మెల్యే
డాక్టర్
సుధ,
జెడ్పీ
చైర్మన్
రామగోవిందురెడ్డి,
ఎమ్మెల్సీలు
రామచంద్రారెడ్డి,
డీసీ
గోవిందరెడ్డి,
మాజీ
ఎమ్మెల్యే
రఘురామిరెడ్డి,
రాష్ట్ర
ప్రధాన
కార్యదర్శి
ఎస్వీ
సతీష్
కుమార్రెడ్డి,
కమలాపురం
ఇన్చార్జి
నరేన్
రామాంజులరెడ్డి
తదితరులు
కలిశారు.
కాగా-
మంగళవారం
రాత్రి
పులివెందుల
నివాసంలో
కుటుంబ
సభ్యులతో
వైఎస్
జగన్
గ్రూప్
ఫొటో
దిగారు.
తల్లి
విజయమ్మ,
భార్య
భారతి,
సోదరులు
అనిల్
రెడ్డి,
మేనల్లుడు
వైఎస్
రాజారెడ్డి
సహా
దాదాపు
అందరు
కుటుంబ
సభ్యులు
ఈ
ఫొటోలో
ఉన్నారు.
ఈ
గ్రూప్
ఫొటోలో
వైఎస్
షర్మిల
లేరు
గానీ..
ఆమె
తనయుడు
రాజారెడ్డి
ఉన్నారు.
చాలాకాలం
తర్వాత
దివంగత
ముఖ్యమంత్రి
వైఎస్
రాజశేఖర్
రెడ్డి
కుటుంబ
సభ్యులందరూ
ఒకచోటికి
చేరినట్టయింది.
కాగా-
పులివెందులలో
ఈ
ఉదయం
వైఎస్
జగన్
అస్వస్థతకు
గురయ్యారు.
జ్వరంతో
బాధపడుతున్నారు.
దీంతో
డాక్టర్ల
సూచన
మేరకు
విశ్రాంతి
తీసుకుంటోన్నారు.
ఈ
కారణంతో
పులివెందులలో
నేడు
ఆయన
పాల్గొనాల్సిన
పర్యటనలన్నీ
కూడా
రద్దయ్యాయి.
ఈ
విషయాన్ని
వైఎస్ఆర్
కాంగ్రెస్
పార్టీ
తన
అధికారిక
ఎక్స్
అకౌంట్
ద్వారా
తెలియజేసింది.


