పూర్వోదయం పథకంలో రూ.1300 కోట్లతో ప్రాజెక్ట్ లు.. ఆ జిల్లాకు మహర్దశ!

Date:


Andhra Pradesh

oi-Dr Veena Srinivas

రాష్ట్ర
ఎంఎస్ఎంఈ,
సెర్ఫ్,
ఎన్ఆర్ఐ
సాధికారత
సంబంధాల
శాఖామంత్రి
కొండపల్లి
శ్రీనివాస్
విజయనగరం
జిల్లాకు
శుభవార్త
చెప్పారు.
పూర్వోదయ
పథకం
ద్వారా
విజయనగరం
జిల్లాలోని
ప్రాజెక్టులను
పూర్తి
చేస్తామని
రాష్ట్ర
ఎంఎస్ఎంఈ,
సెర్ఫ్,
ఎన్ఆర్ఐ
సాధికారత
సంబంధాల
శాఖామంత్రి
కొండపల్లి
శ్రీనివాస్
ప్రకటించారు.

పథకం
కింద
సుమారు
రూ.1300
కోట్లతో
నాలుగు
ప్రాజెక్టులను
పూర్తి
చేయడానికి
ప్రణాళికను
తయారు
చేసినట్లు
వెల్లడించి
ఆయన
తీపి
కబురు
చెప్పారు.


విజయనగరం
జిల్లా
ఇరిగేషన్
ప్రాజెక్ట్
లపై
సమీక్ష
చేసిన
మంత్రి

విజయనగరం
జిల్లాలోని
ఇరిగేషన్
ప్రాజెక్టులు,
సాగునీటి
వనరులపై
కలెక్టరేట్లో
నేడు
ప్రత్యేక
సమీక్ష
సమావేశాన్ని
మంత్రి
అధ్యక్షతన
నిర్వహించారు.
తోటపల్లి,
తారకరామ
ఉత్తరాంధ్ర
సుజల
స్రవంతి,
గజపతినగరం
బ్రాంచ్
కెనాల్,
గడిగెడ్డ,
పెద్దగెడ్డ
తదితర
ప్రాజెక్టుల
అభివృద్ధి,
మరమ్మతులు,
కాలువల్లో
పూడిక
తీత,
భూ
సేకరణ,
పునరావాసం
తదితర
అంశాలపై
ప్రజా
ప్రతినిధులతో
కలిసి
చర్చించారు.


త్వరలో
భూసేకరణ
పూర్తి
చేస్తామన్న
కలెక్టర్

ఆయా
ప్రాజెక్టుల
ఇంజనీర్లతో
మాట్లాడి
పురోగతిని
తెలుసుకున్నారు.
పూర్తి
చేయడానికి
కావాల్సిన
వనరుల
సమీకరణ,
పనులపై
చర్చించారు.
ప్రాజెక్టుల
పరిస్థితులను,
తీసుకోవాల్సిన
చర్యలను
జిల్లా
కలెక్టర్
ఎస్
రాంసుందర్
రెడ్డి
వివరించారు.
త్వరలో
భూసేకరణ
పూర్తి
చేస్తామని
చెప్పారు.
ఎంపీ
కలిశెట్టి
అప్పలనాయుడు,
ఎమ్మెల్సీ
డాక్టర్
సురేష్
బాబు,
ఎమ్మెల్యేలు
కిమిడి
కళా
వెంకట్రావు,
కోళ్ల
లలిత
కుమారి,
పూసపాటి
అతిథి
విజయలక్ష్మి
గజపతిరాజు
తమ
సూచనలను
చేశారు.


పూర్వోదయ
పథకం
ద్వారా
రూ.1300
కోట్లతో
పనులు

రాష్ట్ర
మార్క్ఫెడ్
చైర్మన్
కర్రోతు
బంగార్రాజు,
డిసిఎంఎస్
చైర్మన్
గొంప
కృష్ణ
మాట్లాడుతూ,
సాగునీటి
వనరులకు
సంబంధించిన
వివిధ
అంశాలను,
సమస్యలను
ప్రస్తావించారు.అనంతరం
మంత్రి
శ్రీనివాస్
మాట్లాడుతూ
పూర్వోదయ
పథకం
ద్వారా
రూ.1300
కోట్లతో
తోటపల్లి,
తారకరామా
ప్రాజెక్టుల
పెండింగ్
పనులు,
గజపతినగరం
బ్రాంచ్
కెనాల్,
గడిగెడ్డ

చంపావతి
అనుసంధాన
పనులను
పూర్తి
చేయనున్నట్లు
తెలిపారు.


సుమారు
రూ.2,000
కోట్లను
ఉత్తరాంధ్ర
ప్రాజెక్ట్

కోసం
ఇచ్చిన
సర్కార్

ఉత్తరాంధ్రలోని
ప్రాజెక్టులను
పూర్తి
చేయడానికి
ప్రభుత్వం
సుమారు
రూ.2,000
కోట్లను
కేటాయించిందని
తెలిపారు.
తోటపల్లి
ప్రాజెక్టు
ద్వారా
జిల్లాలో
సుమారు
80
వేల
ఎకరాలకు
సాగునీరు
అందాల్సి
ఉండగా,
ప్రస్తుతం
58వేల
ఎకరాలకు
నీరు
అందుతుందని
అన్నారు.
మిగిలిన
భూములకు
సాగునీరు
అందించేందుకు
పనులను
పూర్తి
చేస్తామన్నారు.
ఉత్తరాంధ్ర
సుజల
స్రవంతి
ప్రాజెక్టు
పనులను
వేగవంతం
చేస్తామని,
ఎదురవుతున్న
సమస్యలను
పరిష్కరించేందుకు
కృషి
చేస్తున్నామని
చెప్పారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related