Business
oi-Jakki Mahesh
ప్రముఖ
ఆటోమొబైల్
దిగ్గజం
యమహా
కంపెనీ
నుంచి
ఎప్పుడెప్పుడా
అని
ఎదురుచూస్తున్న
మొదటి
ఎలక్ట్రిక్
స్కూటర్
‘EC-06’
భారత
మార్కెట్లోకి
వచ్చేసింది.
ఫిబ్రవరి
3న(మంగళవారం)
ఈ
ఎలక్ట్రిక్
స్కూటర్‌ను
అధికారికంగా
లాంచ్
చేశారు.
యమహా
కంపెనీ
తన
ఐకానిక్
డిజైన్
ను
ఎలక్ట్రిక్
సెగ్మెంట్లో
కూడా
కంటిన్యూ
చేసింది.
ఈ
స్కూటర్
చూడటానికి
చాలా
ప్రీమియం
లుక్‌లో
ఉంటుంది.
ఈ
స్కూటర్
ఎక్స్-షోరూమ్
ధరను
రూ.
1,67,600
గా
నిర్ణయించారు.
ప్రస్తుతం
ఇది
‘బ్లూయిష్
వైట్’
కలర్
ఆప్షన్‌లో
అందుబాటులో
ఉంది.
ఎంపిక
చేసిన
నగరాల్లోని
యమహా
‘బ్లూ
స్క్వేర్’
షోరూమ్‌ల
ద్వారా
దీనిని
మీరు
సొంతం
చేసుకోవచ్చు.
ఈ
ఎలక్ట్రిక్
స్కూటర్
బ్యాటరీ,
రేంజ్
వివరాలిలా..
ఈ
ఎలక్ట్రిక్
స్కూటర్
ఒక్కసారి
ఫుల్
ఛార్జ్
చేస్తే
169
కిలోమీటర్ల
రేంజ్
ఇస్తుంది.
ఇందులో
4kWh
ఫిక్స్‌డ్
బ్యాటరీని
వాడారు.
దీని
మోటార్
9
PS
పవర్,
26
Nm
టార్క్‌ను
ఉత్పత్తి
చేస్తుంది.
ఇది
గంటకు
79
కిమీ
టాప్
స్పీడ్‌తో
వెళ్తుంది.
ఇంట్లో
ఉండే
ఛార్జర్‌తో
దీనిని
సుమారు
8
గంటల్లో
ఫుల్
ఛార్జ్
చేసుకోవచ్చు.
బ్యాటరీపై
కంపెనీ
3
ఏళ్లు
లేదా
30,000
కిలోమీటర్ల
వరకు
వారంటీ
ఇస్తోంది.
అదిరిపోయే
ఫీచర్లు
యమహా
EC-06లో
రైడర్ల
సౌకర్యం
కోసం
అద్భుతమైన
ఫీచర్లు
అమర్చారు.
ఈ
ఎలక్ట్రిక్
స్కూటర్లో
ఎక్,
స్టాండర్డ్,
పవర్
అనే
మూడు
మోడ్స్
ఉన్నాయి.
ఈ
స్కూటర్
ఇరుకైన
సందుల్లో
లేదా
పార్కింగ్
చేసేటప్పుడు..
స్కూటర్
ను
వెనక్కి
తీయడానికి
రివర్స్
మోడ్
ఫీచర్
ఎంతగానో
పని
చేస్తుంది.
స్పీడ్,
బ్యాటరీ
ఛార్జింగ్
లెవెల్
చూసుకోవడానికి
కలర్
ఎల్సీడీ
డిస్
ప్లే
ఉంది.’యామహా
మోటార్
కనెక్ట్
ఆర్’
యాప్
ద్వారా
ఫోన్‌ను
కనెక్ట్
చేసుకుని
రియల్
టైమ్
డేటాను
చూడవచ్చు.
సీటు
కింద
24.5
లీటర్ల
ఖాళీ
ఉంటుంది,
ఇందులో
హెల్మెట్
లేదా
ఇతర
వస్తువులను
సులభంగా
పెట్టుకోవచ్చు.
భద్రత,
డిజైన్
ఈ
స్కూటర్లో
రెండు
వైపులా
డిస్క్
బ్రేక్‌లు
ఇచ్చారు.
మోటార్,
బ్యాటరీకి
IP67
రేటింగ్
ఉంది,
అంటే
వర్షంలో
తడిసినా
లేదా
నీటి
గుంటల్లో
వెళ్లినా
ఎలాంటి
ఇబ్బంది
ఉండదు.
ముందు
వైపు
టెలిస్కోపిక్
సస్పెన్షన్
ఉండటం
వల్ల
గుంతల
రోడ్లపై
కూడా
రైడింగ్
సాఫీగా
సాగుతుంది.
యమహా
EC-06
మార్కెట్లో
ఉన్న
టీవీఎస్
ఐక్యూబ్,
బజాజ్
చేతక్,
ఏథర్
వంటి
స్కూటర్లకు
గట్టి
పోటీ
ఇచ్చేలా
కనిపిస్తోంది.
టెక్నాలజీతో
పాటు
స్టైల్‌ను
ఇష్టపడే
కుర్రాళ్లకి
ఈ
స్కూటర్
బాగా
నచ్చుతుంది.


