పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు

Date:


Business

oi-Chandrasekhar Rao

దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. రికార్డు స్థాయికి చేరిన అనంతరం ఇక పేకమేడలా కుప్పకూలుతున్నాయి. ఈ వారం రోజుల్లోనే దాదాపుగా 10,000 రూపాయలకు పైగా బంగారం ధర తగ్గిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బలహీనమైన డాలర్, అమెరికా ట్రెజరీ ఈల్డ్స్.. దీనికి ప్రధాన కారణాలు. ఈ వారంలో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 10 గ్రాముల బంగారం ధర దాదాపుగా రెండు శాతం వరకు తగ్గింది.

ఎంసీఎక్స్ బంగారం ధర 1,60,000 కంటే దిగువకు చేరింది. బంగారం, వెండి ధరలు వరుసగా రెండో వారం కూడా తగ్గడం సుదీర్ఘ విరామం తర్వాత ఇదే తొలిసారి. స్పాట్ బంగారం ఒక శాతం మేర తగ్గి ఔన్సుకు 5,050 డాలర్ల వద్ద నిలిచింది. అదే సమయంలో ఎంసీఎక్స్ వెండి కూడా ఒక శాతం తగ్గగా, స్పాట్ వెండి ఏకంగా నాలుగు శాతం మేర నష్టపోయి ఔన్సుకు 80.50 డాలర్ల వద్ద స్థిరపడింది.

డాలర్ బలపడటం, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపు అంచనాలు మందగించడం బంగారం, వెండి ధరల పతనానికి ప్రధాన కారణం. ఇరాన్‌పై దాడుల ప్రకటన, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మూసివేత వార్తలతో డాలర్ మరింత పటిష్టమైంది. దీనితో పెట్టుబడిదారులు నగదు లభ్యత కోసం డాలర్‌ను ఆశ్రయించారు. సాధారణంగా భౌగోళిక రాజకీయ అస్థిరత బులియన్ డిమాండ్‌ను పెంచినా, బ్యారెల్ $100 దాటిన ముడి చమురు ధరల ద్రవ్యోల్బణం భయాలు రాబడినిచ్చే ఆస్తుల వైపు దృష్టి మళ్ళించాయని ట్రేడింగ్ ఎకనామిక్స్ పేర్కొంది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 16,255, 22 క్యారెట్లు – రూ. 14,899, 18 క్యారెట్లు – రూ. 12,549

ముంబై..

24 క్యారెట్లు – రూ. 15,966, 22 క్యారెట్లు- రూ. 14,635, 18 క్యారెట్లు – రూ. 11,974

బెంగళూరు..

24 క్యారెట్లు – రూ. 15,966, 22 క్యారెట్లు- రూ. 14,635, 18 క్యారెట్లు – రూ. 11,974

హైదరాబాద్..

24 క్యారెట్లు – రూ. 15,966, 22 క్యారెట్లు- రూ. 14,635, 18 క్యారెట్లు – రూ. 11,974

విజయవాడ..

24 క్యారెట్లు – రూ. 15,966, 22 క్యారెట్లు- రూ. 14,635, 18 క్యారెట్లు – రూ. 11,974

విశాఖపట్నం..

24 క్యారెట్లు – రూ. 15,966, 22 క్యారెట్లు- రూ. 14,635, 18 క్యారెట్లు – రూ. 11,974



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Wet Leg to Play ‘SNL UK’ Premiere Episode

Hopefully SNL UK is ready to catch some fists...

Chase Stokes’ Short Hair, Beard on Red Carpet

Though Chase has not publicly spoken out about his...

Nvidia adds Hyundai, BYD, other automakers to AV business

Nvidia CEO Jensen Hwang gives the keynote address at...