International
oi-Jakki Mahesh
ఓ
వైపు
అమెరికా
అధ్యక్షుడు
డొనాల్డ్
ట్రంప్
తీసుకుంటున్న
దూకుడు
నిర్ణయాలతో
ప్రపంచవ్యాప్తంగా
ఉద్రిక్తతలు
పెరుగుతుంటే..
ఆయన
చిన్న
కుమారుడు
బారన్
ట్రంప్
మాత్రం
తన
సమయస్ఫూర్తితో
ఓ
మహిళ
ప్రాణాలను
కాపాడి
రియల్
హీరో
అనిపించుకున్నాడు.
బ్రిటన్‌లో
తన
మాజీ
ప్రియుడి
చేతిలో
దాడికి
గురవుతున్న
ఓ
మహిళను
బారన్
ట్రంప్
వేల
మైళ్ల
దూరం
నుంచి
చేసిన
ఒక్క
ఫోన్
కాల్
రక్షించింది.
అసలేం
జరిగిందంటే?
మెట్రో
యూకే
నివేదిక
ప్రకారం..
ఈ
ఘటన
లండన్‌లో
చోటుచేసుకుంది.
ఓ
బ్రిటీష్
మహిళపై
ఆమె
మాజీ
ప్రియుడు
మాత్వేయ్
రుమ్యాన్సేవ్
కిరాతకంగా
దాడి
చేస్తున్నాడు.
ఆ
సమయంలో
బాధితురాలు
ప్రాణభయంతో
తన
స్నేహితుడైన
బారన్
ట్రంప్‌కు
వీడియో
కాల్
చేసింది.
బారన్
ట్రంప్
ఫోన్
ఎత్తగానే..
అవతలి
వైపు
ఓ
వ్యక్తి
మహిళను
దారుణంగా
కొట్టడం,
ఆమె
ఆర్తనాదాలు
వినబడ్డాయి.
సుమారు
15
సెకన్ల
పాటు
ఈ
దృశ్యాలను
చూసిన
బారన్
ట్రంప్
పరిస్థితి
తీవ్రతను
అర్థం
చేసుకున్నారు.
నిందితుడిని
నేరుగా
బెదిరిస్తే
మహిళ
ప్రాణాలకు
ముప్పు
ఉంటుందని
భావించిన
బారన్
ట్రంప్..
ఏ
మాత్రం
ఆలస్యం
చేయకుండా
అమెరికా
నుంచి
యూకే
ఎమర్జెన్సీ
నంబర్
999కు
కాల్
చేసి
పోలీసులకు
సమాచారం
అందించారు.
కోర్టులో
వినిపించిన
కాల్
రికార్డింగ్
ఈ
కేసు
విచారణ
సందర్భంగా
లండన్
కోర్టులో
బారన్
ట్రంప్
చేసిన
కాల్
రికార్డింగ్‌ను
పోలీసులు
వినిపించారు.ఆ
కాల్‌లో
బారన్
ట్రంప్
మాట్లాడుతూ..
“నాకు
ఇప్పుడే
ఓ
అమ్మాయి
నుంచి
ఫోన్
వచ్చింది,
ఆమెపై
ఎవరో
దాడి
చేస్తున్నారు.
ఆమె
చాలా
ఆపదలో
ఉంది,
దయచేసి
వెంటనే
కాపాడండి”
అని
బారన్
ట్రంప్
అర్ధరాత్రి
2:23
గంటలకు
పోలీసులను
వేడుకున్నారు.
బారన్
ట్రంప్
ఇచ్చిన
సమాచారంతో
పోలీసులు
నిమిషాల్లోనే
ఘటనా
స్థలానికి
చేరుకుని..
రక్తపు
మడుగులో
ఉన్న
మహిళను
రక్షించి
నిందితుడిని
అదుపులోకి
తీసుకున్నారు.
“బారన్
వల్లే
నేను
బ్రతికున్నాను”
–
బాధితురాలు
కోర్టులో
బాధితురాలు
వాంగ్మూలం
ఇస్తూ
కన్నీటి
పర్యంతమైంది.
“ఆ
రోజు
బారన్
సరైన
సమయంలో
పోలీసులకు
కాల్
చేయకపోతే
నేను
ఈరోజు
ప్రాణాలతో
ఉండేదాన్ని
కాదు.
అతను
నా
పాలిట
దైవంలా
మారాడు”
అని
పేర్కొంది.
దాడికి
ముందు
బారన్
ఆమెకు
కొన్ని
మిస్డ్
కాల్స్
ఇచ్చారని,
దాడి
జరిగినప్పుడు
భయంతో
ఫోన్
తీయగానే
బారన్
నంబర్
కనిపించడంతో
వెంటనే
వీడియో
కాల్
చేశానని
ఆమె
వివరించింది.
డొనాల్డ్
ట్రంప్
రాజకీయ
నిర్ణయాల
వల్ల
ఎక్కడో
ఓ
చోట
రక్తం
చిందించే
పరిస్థితులు
కనిపిస్తుంటే..
ఆయన
కుమారుడు
మాత్రం
ప్రాణాలను
కాపాడి
మానవత్వాన్ని
చాటుకున్నారని
సోషల్
మీడియాలో
నెటిజన్లు
ప్రశంసిస్తున్నారు.


