ప్రముఖ కవయిత్రి రాజకుమారి ఇందిరాదేవి ఇక లేరు !!

Date:


Telangana

oi-Korivi Jayakumar

ప్రముఖ
కవయిత్రి,
చిత్రకారిణి
రాజకుమారి
ఇందిరాదేవి
ధన్‌రాజ్‌గిర్‌
(96)
మృతి
చెందారు.
హైదరాబాద్‌లోని
గోషామహల్‌
ప్రాంతంలోని
జ్ఞాన్‌బాగ్‌
ప్యాలెస్‌లో
తుదిశ్వాస
విడిచారు.
రాజకుమారి
ఇందిరాదేవి
కేవలం
కవయిత్రిగానే
కాకుండా
చిత్రకారిణిగా,
రచయిత్రిగా,
ఫొటోగ్రాఫర్‌గా
బహుముఖ
ప్రతిభను
ప్రదర్శించారు.
ఆమె
మృతి
తెలుగు,
హిందీ,
ఉర్దూ
సాహిత్య
లోకాలకు
తీరని
లోటుగా
మారింది.
రాజకుమారి
ఇందిరాదేవి
దివంగత
మహాకవి
గుంటూరు
శేషేంద్ర
శర్మ
ధర్మపత్ని
కావడం
విశేషం.

బహుముఖ
ప్రతిభావంతురాలు

చిన్నతనం
నుంచే
కళలపై
ఆసక్తి
పెంచుకున్న
ఆమె,
యుక్తవయసు
నుంచే
ఫొటోగ్రఫీపై
మక్కువతో
అరుదైన
చిత్రాల
సేకరణ
చేపట్టారు.
ఆమె
మృతితో
భారతీయ
సాహిత్య
రంగం

మహత్తర
వ్యక్తిత్వాన్ని
కోల్పోయిందని
పలువురు
ప్రముఖులు
వ్యాఖ్యానిస్తున్నారు.
కళ,
కవిత్వం,
ఆలోచనలతో
ఎందరికో
ఆమె
మార్గదర్శకంగా
నిలిచారని
కొనియాడారు.
ఆమె
ఆత్మకు
శాంతి
చేకూరాలని,
ఆమె
కుటుంబ
సభ్యులకు
సాహిత్య
ప్రపంచం
ప్రగాఢ
సానుభూతిని
తెలియజేస్తున్నట్టు
వాపోయారు.

సాహిత్య
ప్రస్థానం..

అల్లా
ఇక్బాల్‌,
గాలీబ్‌,
శ్రీ
అరబిందో
వంటి
మహానుభావుల
రచనల
నుంచి
ప్రేరణ
పొందిన
ఇందిరాదేవి
సాహిత్య
రంగంలోకి
అడుగుపెట్టారు.
భావోద్వేగాలు,
ఆధ్యాత్మికత,
మానవ
సంబంధాల
లోతును
ప్రతిబింబించేలా
ఆమె
కవిత్వం
సాగింది.
1964లో
ఆమె
తొలి
కవితా
సంపుటి
‘ది
అపోసల్‌’
ప్రచురితమైంది.
అనంతరం
1965,
1966
సంవత్సరాల్లో
మరికొన్ని
కవితా
సంకలనాలు
వెలువరించి
సాహిత్య
వర్గాల్లో
గుర్తింపు
పొందారు.

అకాడమీ
స్థాయి
సేవలు..

సాహిత్య
సేవలతో
పాటు
సంస్థాగత
పాత్రల్లోనూ
ఆమె
విశేష
సేవలందించారు.
ఉమ్మడి
ఆంధ్రప్రదేశ్‌
హిందీ
అకాడమీకి
తొలి
అధ్యక్షురాలిగా
వ్యవహరించడంతో
పాటు,
ఉర్దూ
అకాడమీ
ఛైర్‌పర్సన్‌గా
కూడా
బాధ్యతలు
నిర్వర్తించారు.
భాషా
సమన్వయం,
సాహిత్య
అభివృద్ధికి
ఆమె
చేసిన
కృషి
అపూర్వమైనది.

నోబెల్‌
నామినేషన్‌..

1973లో
వరల్డ్‌
పోయెట్రీ
సొసైటీ
ఇంటర్‌కాంటినెంటల్‌
(WPSI)
అధ్యక్షుడు
కృష్ణ
శ్రీనివాస్‌
ఆమె
పేరును
సాహిత్యంలో
నోబెల్‌
బహుమతికి
నామినేట్‌
చేశారు.

ఘనత
సాధించిన
తొలి
భారతీయ
మహిళగా
రాజకుమారి
ఇందిరాదేవి
చరిత్రలో
నిలిచారు.
ఇది
ఆమె
సాహిత్య
స్థాయిని
ప్రపంచ
వేదికపై
నిలబెట్టిన
ఘనమైన
గుర్తింపుగా
నిలిచింది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related