Telangana
oi-Bomma Shivakumar
ప్రముఖ తెలుగు సాహితీవేత్త, తెలంగాణ కవి, రచయిత, ఉద్యమకారుడు డాక్టర్ నందిని సిధారెడ్డిని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన రాసిన అనిమేష కవితా సంపుటికి ఈ పురస్కారం లభించింది. కరోనా సమయంలోని పరిస్థితులపై ఆయన ఈ పుస్తకాన్ని రచించారు. ఇక నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడంపై పలువురు తెలుగు భాషాభిమానులు, కవులు, రచయితలు, తెలంగాణ వాదులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మేరకు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నందిని సిధారెడ్డికి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు.
తెలంగాణ ప్రముఖ కవి, ఉద్యమకారుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి ఛైర్మన్ డాక్టర్ నందిని సిధారెడ్డిని ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన రచించిన ‘అనిమేష’ కవితా సంపుటికి గాను ఈ గౌరవం దక్కింది. నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు.
తెలంగాణ మట్టి సువాసనను, ఉద్యమ స్ఫూర్తిని తన కలంతో విశ్వవ్యాప్తం చేసిన ప్రముఖ కవి, సాహితీవేత్త శ్రీ నందిని సిధారెడ్డి గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడం అత్యంత సంతోషదాయకం
ఇది తెలంగాణ సాహిత్యానికి దక్కిన గౌరవం. వారికి నా హృదయపూర్వక అభినందనలు. pic.twitter.com/o1wqCEcSPu
— KTR (@KTRBRS) March 16, 2026
“తెలంగాణ మట్టి సువాసనను, ఉద్యమ స్ఫూర్తిని తన కలంతో విశ్వవ్యాప్తం చేసిన ప్రముఖ కవి, సాహితీవేత్త శ్రీ నందిని సిధారెడ్డి గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడం అత్యంత సంతోషదాయకం.. ఇది తెలంగాణ సాహిత్యానికి దక్కిన గౌరవం. వారికి నా హృదయపూర్వక అభినందనలు” అని ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ మేరకు సిధారెడ్డికి తన తరఫున, పార్టీ తరఫున అభినందనలు తెలియజేశారు.
ఇక నందిని సిధారెడ్డి 1955 జూన్ 12న మెదక్ జిల్లాలోని బందారం గ్రామంలో జన్మించారు. బందారం, వెల్కటూర్, సిద్ధిపేటలోని పాఠశాలల్లో చదువుకున్నారు. అనంతరం ఉస్మానియా వర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఉస్మానియా యూనివర్సిటీలోనే ఎం. ఏ., ఎం. ఫిల్., పీ. హెచ్. డీ. పట్టాలను అందుకున్నారు. అనంతరం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేశారు. 2012లో ఆయన పదవీ విరమణ చేశారు. 1997లో నందిని సిధారెడ్డి రచించిన “నాగేటి సాల్లలో నా తెలంగాణ” అనే కవిత ఆయనకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది.


