ప్రాణాలు తీస్తున్న చైనా మాంజా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు..

Date:


Telangana

oi-Bomma Shivakumar

సంక్రాంతి
పండగ
వచ్చిందంటే
చాలు
పిల్లలు,
పెద్దలు
గాలి
పటాలను
ఎగురవేయడానికి
ఇష్టపడుతుంటారు.
పండక్కు
ముందే
గాలిపటాలతో
సిద్ధంగా
ఉంటారు.
అయితే
ఎంతో
సరదాగా
ఆడుకునే

ఆటలో
చాలా
ప్రమాదం
పొంచి
ఉంది.
పండగ
వేళల్లో
సరదాగా
ఆడే

ఆట
కొందరి
కుటుంబాల్లో
తీవ్ర
విషాదాన్ని
నింపుతున్నాయి.
దానికి
ప్రధాన
కారణం
గాలిపటాలు
ఎగురవేసేందుకు
ఉపయోగించే
చైనా
మాంజా
దారమే.
రాష్ట్రంలో
ఇటీవల
చైనా
మాంజాతో
గాయపడి
పలువురు
మృతి
చెందిన
విషయం
తెలిసిందే.
తాజాగా
చైనా
మాంజాతో
మరో
ముగ్గురికి
తీవ్ర
గాయాలయ్యాయి.

ఇక
తెలంగాణ
ప్రభుత్వం
2016
లోనే
రాష్ట్రంలో
చైనీస్
మాంజాను
నిషేధించింది.
కానీ
చాలా
మంది
వ్యాపారస్థులు
అక్రమంగా
వీటి
అమ్మకాలు
నిర్వహిస్తున్నారు.
చైనీస్
మాంజాను
నైలాన్,
సింథటిక్
దారంతో
తయారు
చేస్తారు.
చైనీస్
మాంజాతో
పక్షులు,
మనుషులు
ప్రమాదంలో
పడుతున్నారు.

నేపథ్యంలో
చైనీస్
మాంజాపై
పోలీసుల
దాడులు
నిర్వహిస్తున్నారు.
అయితే
తాజాగా
ఉప్పల్‌
లో
మాంజా
తగిలి

యువకుడు
తీవ్రంగా
గాయపడ్డాడు.
సాయివర్దన్‌
రెడ్డి
అనే
యువకుడు
బైక్‌
పై
వెళ్తుండగా
గొంతుకు
మాంజా
తగలడంతో
తీవ్ర
గాయాలయ్యాయి.
దీంతో
అతడ్ని
సమీపంలోని
ఆస్పత్రిలో
చేర్పించారు.

మరో
ఘటనలో
చైనా
మాంజా
మెడకు
చుట్టుకుని
సాఫ్ట్‌
వేర్‌
ఇంజినీర్‌
కు
తీవ్ర
గాయాలయ్యాయి.
చైతన్య
అనే
యువకుడు
గచ్చిబౌలి
నుంచి
హఫీజ్‌పేటకు
బైక్‌
పై
వెళ్తుండగా
చైనా
మాంజా
చుట్టుకోవడంతో
అతడి
చేయి
తెగింది.
తీవ్ర
గాయాలతో
విలవిలలాడుతున్న
చైతన్యను
స్థానికులు
హస్పటల్
కు
తరలించారు
స్థానికులు.

ఇక
మరో
ఘటనలో
నల్గొండ
జిల్లా
తిరుమలగిరికి
చెందిన
సభావల్
మధు
హైదరాబాద్
నుంచి
తిరుమలగిరికి
బైక్‌
పై
వెళ్తుండగా
మార్గ
మధ్యలో
సాగర్
హైవేపై
మాల్
మార్కెట్లో
విద్యుత్
స్తంభానికి
వేలాడుతున్న
చైనా
మాంజా
చేతి
వేళ్లకు
తగిలి
తీవ్రంగా
గాయపడ్డాడు.
దాంతో
స్థానికుల
సమాచారం
మేరకు
పోలీసులు
క్షతగాత్రుడిని
ఆసుపత్రికి
తరలించారు.

మరోవైపు
చైనీస్
మాంజా
వినియోగంపై
హైదరాబాద్
సిటీ
పోలీసుల
దాడులు
నిర్వహిస్తున్నారు.
చైనీస్
మాంజాపై
తనిఖీలు
ముమ్మరం
చేయడంతో
వ్యాపారులు
ఆన్‌లైన్
బాట
పట్టినట్లు
మా
దృష్టికి
వచ్చిందని
హైదరాబాద్
సీపీ
సజ్జనార్
ఇటీవల
తెలిపారు.
ఈ-కామర్స్‌
వెబ్‌
సైట్లు,
సోషల్
మీడియా
వేదికగా
సాగే
విక్రయాలపై
24
గంటల
పాటు
ప్రత్యేక
నిఘా
ఉంచినట్లు
తెలిపారు.
ఆన్‌
లైన్‌
లో
నిషేధిత
మాంజా
కొనుగోలు
చేసినా,
విక్రయించినా
కఠిన
చర్యలు
తప్పవని
సూచనలు
చేశారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related