బంగారం ధరల అంచనాలు తలకిందులు

Date:

Business

oi-Chandrasekhar Rao

నేడు బంగారం, వెండి ధరలు గణనీయంగా పడిపోయాయి. కిందటి రెండు నెలలతో పోల్చి చూస్తే ఇది భారీ పతనం. ముడి చమురు ధరల పెరుగుదల వల్ల దీర్ఘకాలిక ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లు తలెత్తవచ్చనే భయాలతో వ్యాపారులు అప్రమత్తం అయ్యారు. మధ్యప్రాచ్య సంఘర్షణ నాలుగో వారంలోకి ప్రవేశించడం ఈ ఆందోళనలకు ప్రధాన కారణమైంది. శుక్రవారం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో 24 క్యారెట్ల బంగారం ధర 1,50,125 వద్ద నమోదు కాగా ఇప్పుడది మరింత తగ్గింది.

ఎంసీఎక్స్ వెండి ధర కూడా ఇదే బాట పట్టింది. దాదాపు రెండు మేర క్షీణించి కిలోకు 2,27,470 రూపాయల వద్ద ముగిసింది. ఒక్కరోజే కిలోకు 3,990 తగ్గింది. ఆదివారం బులియన్ మార్కెట్లలో వెండి ధర 2,27,960 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయం, మధ్యప్రాచ్య సంఘర్షణ, ప్రపంచ ఆర్థిక స్థితిగతులపై యుద్ధ ప్రభావం నేపథ్యంలో పెట్టుబడిదారుల అంచనాలు తలకిందులవుతున్నాయి. ఈ అనిశ్చిత పరిస్థితులు బంగారం ధరల స్థిరత్వాన్ని దెబ్బతీస్తోన్నాయి.

ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,50,070 కాగా, 22 క్యారెట్లు రూ. 1,37,140గా నమోదైంది. కిందటి ముగింపు సెషన్ తో పోల్చుకుంటే వీటి రేట్లల్లో భారీ తగ్గుదల కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఔన్స్ బంగారం 4,574.34 డాలర్లను తాకింది. ఢిల్లీ, జైపూర్లలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1,50,420, 22 క్యారెట్లు రూ. 1,37,890కి లభించగా, ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం రూ. 1,50,270, 22 క్యారెట్లు రూ. 1,37,740 వద్ద ట్రేడ్‌ అయ్యింది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 14,858, 22 క్యారెట్లు – రూ. 13,620, 18 క్యారెట్లు – రూ. 11,360

ముంబై..

24 క్యారెట్లు – రూ. 14,597, 22 క్యారెట్లు- రూ. 13,380, 18 క్యారెట్లు – రూ. 10,948

బెంగళూరు..

24 క్యారెట్లు – రూ. 14,597, 22 క్యారెట్లు- రూ. 13,380, 18 క్యారెట్లు – రూ. 10,948

హైదరాబాద్..

24 క్యారెట్లు – రూ. 14,597, 22 క్యారెట్లు- రూ. 13,380, 18 క్యారెట్లు – రూ. 10,948

విజయవాడ..

24 క్యారెట్లు – రూ. 14,597, 22 క్యారెట్లు- రూ. 13,380, 18 క్యారెట్లు – రూ. 10,948

విశాఖపట్నం..

24 క్యారెట్లు – రూ. 14,597, 22 క్యారెట్లు- రూ. 13,380, 18 క్యారెట్లు – రూ. 10,948

Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related