Business
oi-Jakki Mahesh
Tata
Punch
Facelift
SUV:
ప్రముఖ
దేశీయ
వాహన
తయారీ
సంస్థ
టాటా
మోటార్స్
తన
మోస్ట్
పాపులర్
మైక్రో
ఎస్‌యూవీ
టాటా
పంచ్
ఫేస్‌లిఫ్ట్
మోడల్‌ను
భారత
మార్కెట్లో
ఘనంగా
విడుదల
చేసింది.
మరింత
బోల్డ్
లుక్,
అత్యాధునిక
ఫీచర్లు,
మెరుగైన
ఇంజిన్
ఆప్షన్లతో
వచ్చిన
ఈ
కొత్త
పంచ్
ప్రారంభ
ధరను
రూ.5.59
లక్షలు(ఎక్స్-షోరూమ్)గా
కంపెనీ
నిర్ణయించింది.
నెక్సాన్‌ను
తలపించే
సరికొత్త
డిజైన్
కొత్త
టాటా
పంచ్
డిజైన్
ఇప్పుడు
టాటా
ప్రీమియం
ఎస్‌యూవీలైన
నెక్సాన్,
హారియర్,
సఫారీలను
పోలి
ఉంది.
ముందు
భాగంలో
కొత్త
లైటింగ్
ఎలిమెంట్స్,
పియానో
బ్లాక్
ఫినిషింగ్,
రీ-డిజైన్
చేయబడిన
గ్రిల్,
కొత్త
స్కిడ్
ప్లేట్లు
దీనికి
స్పోర్టీ
లుక్‌ను
ఇస్తున్నాయి.
కారు
వెనుక
భాగంలో
కొత్త
టెయిల్
లాంప్స్,
అప్‌డేటెడ్
బంపర్
ఉన్నాయి.
ఈ
కారు
ఇప్పుడు
సైంటిఫిక్
బ్లూ,
కారామెల్
ఎల్లో,
బెంగాల్
రూజ్
రెడ్
వంటి
ఆకర్షణీయమైన
కలర్
ఆప్షన్లలో
లభిస్తుంది.
ప్రీమియర్
ఇంటీరియర్,
టెక్నాలజీ
కారు
లోపల
కేబిన్
ఇప్పుడు
మరింత
విలాసవంతంగా
మార్చబడింది.
టాటా
లోగో
వెలుగులీనేలా
కొత్త
ట్విన్-స్పోక్
స్టీరింగ్
వీల్‌ను
అందించారు.
26.03
సెంటీమీటర్ల
భారీ
ఇన్ఫోటైన్‌మెంట్
సిస్టమ్,
ఇన్‌స్ట్రుమెంట్
క్లస్టర్‌లో
7-అంగుళాల
TFT
స్క్రీన్
ఉన్నాయి.
ఈ
కారు
స్మార్ట్,
ప్యూర్,
ప్యూర్
ప్లస్,
అడ్వెంచర్,
అకంప్లిష్డ్,
అకంప్లిష్డ్
ప్లస్
అనే
6
వేరియంట్లలో
అందుబాటులోకి
వచ్చింది.
సీఎన్‌జీతో
పాటు
ఆటోమేటిక్
కూడా!
టాటా
పంచ్
ఫేస్‌లిఫ్ట్‌లో
అతిపెద్ద
విశేషం
ఏమిటంటే,
దేశంలోనే
సీఎన్‌జీ
(CNG)
ఆప్షన్‌తో
పాటు
ఆటోమేటిక్
ట్రాన్స్‌మిషన్‌ను
కలిగి
ఉన్న
మొదటి
సబ్-కాంపాక్ట్
ఎస్‌యూవీ
ఇదే.
ఇందులో
మూడు
ఇంజిన్
ఆప్షన్లు
ఉన్నాయి.
1.2
లీటర్
టర్బో
పెట్రోల్
ఇంజిన్
శక్తివంతమైన
పనితీరును
ఇస్తుంది.
1.2
లీటర్
నేచురల్లీ
ఆస్పిరేటెడ్
పెట్రోల్
ఇంజిన్.
1.2
లీటర్
సీఎన్‌జీ
ఆప్షన్..
కేవలం
11.1
సెకన్లలోనే
0
నుండి
100
కి.మీ
వేగాన్ని
అందుకోగల
సామర్థ్యం
దీనికి
ఉంది.
భద్రతలో
‘పంచ్’
అదిరింది!
టాటా
మోటార్స్
తన
వాహనాల
భద్రతకు
ఇచ్చే
ప్రాముఖ్యతను
మరోసారి
నిరూపించుకుంది.
ఈ
కారుకు
ప్రతిష్టాత్మకమైన
భారత్
NCAP
5-స్టార్
రేటింగ్
లభించింది.
ఒక
ట్రక్కుతో
50
కి.మీ
వేగంతో
ఢీకొట్టించి
చేసిన
లైవ్
టెస్టులో
కూడా
కారులోని
ప్రయాణికులు
సురక్షితంగా
ఉన్నట్లు
కంపెనీ
వెల్లడించింది.
6
ఎయిర్‌బ్యాగ్‌లు,
360
డిగ్రీల
కెమెరా,
ఎలక్ట్రానిక్
స్టెబిలిటీ
ప్రోగ్రామ్
(ESP),
టైర్
ప్రెజర్
మానిటరింగ్
సిస్టమ్
(iTPMS),
రెయిన్
సెన్సింగ్
వైపర్స్
వంటి
అడ్వాన్స్‌డ్
సేఫ్టీ
ఫీచర్లు
ఇందులో
ఉన్నాయి.


