India
oi-Jakki Mahesh
హిమాలయాల
ఒడిలో
కొలువై
ఉన్న
చార్‌ధామ్
పుణ్యక్షేత్రాలైన
బద్రీనాథ్,
కేదార్‌నాథ్
ఆలయాల్లోకి
ఇకపై
హిందువులకు
మాత్రమే
ప్రవేశం
కల్పించాలని
ఆలయ
కమిటీ
నిర్ణయించింది.
అన్యమతస్థుల
ప్రవేశాన్ని
నిషేధిస్తూ
బద్రినాథ్-కేదార్‌నాథ్
ఆలయ
కమిటీ(BKTC)
త్వరలోనే
అధికారికంగా
తీర్మానం
చేయనుంది.
బద్రినాథ్-కేదార్‌నాథ్
ఆలయ
కమిటీ
పరిధిలోని
అన్ని
ఆలయాలకు
వర్తింపు
బద్రీనాథ్-కేదార్‌నాథ్
ఆలయ
కమిటీ
అధ్యక్షుడు
హేమంత్
ద్వివేది
ఈ
విషయాన్ని
ధ్రువీకరించారు.
కమిటీ
నియంత్రణలో
ఉన్న
అన్ని
దేవాలయాల్లోకి
అన్యమతస్థుల
ప్రవేశాన్ని
నిషేధిస్తామని
ఆయన
పేర్కొన్నారు.
దీనికి
సంబంధించిన
ప్రతిపాదనను
రాబోయే
బోర్డు
సమావేశంలో
ఆమోదించనున్నట్లు
తెలిపారు.
ఆలయాల
పునఃప్రారంభం
ఎప్పుడు?
శీతాకాలం
విరామం
తర్వాత
ఈ
ఏడాది
చార్‌ధామ్
యాత్ర
ప్రారంభం
కానుంది.
ఆలయాల
పునఃప్రారంభ
తేదీలు
ఇలా
ఉన్నాయి.
బద్రీనాథ్
ఆలయ
ద్వారాలు
ఏప్రిల్
23న
తెరుచుకోనున్నాయి.
కేదార్‌నాథ్
ఆలయ
పునఃప్రారంభ
తేదీని
మహాశివరాత్రి
నాడు
అధికారికంగా
ప్రకటిస్తారు.
గంగోత్రి,
యమునోత్రి
ఆలయ
ద్వారాలను
అక్షయ
తృతీయ
సందర్భాన్ని
పురస్కరించుకుని
ఏప్రిల్
19న
తెరుస్తారు.
ఉత్తరాఖండ్‌లో
పెరుగుతున్న
భద్రతా
ఆందోళనలు,
మతపరమైన
పవిత్రతను
కాపాడాలనే
ఉద్దేశంతో
ఈ
నిర్ణయం
తీసుకున్నట్లు
తెలుస్తోంది.
గత
కొంతకాలంగా
హిందూ
సంస్థలు,
స్థానిక
పూజారులు
ఈ
విజ్ఞప్తిని
కమిటీ
ముందు
ఉంచుతున్నారు.
ఈ
ప్రతిపాదన
ఆమోదం
పొందితే
బద్రీనాథ్-కేదార్‌నాథ్
ఆలయ
కమిటీ
పరిధిలోకి
వచ్చే
అన్ని
ఉపాలయాలకు
కూడా
ఈ
నిబంధన
వర్తిస్తుంది.


