India
oi-Jakki Mahesh
మధ్యప్రదేశ్
రాష్ట్ర
సర్కారు
ప్రతిష్టాత్మకంగా
చేపట్టిన
‘భిక్షాటన
రహిత
ఇండోర్’
ప్రచారంలో
ఓ
విస్తుపోయే
నిజం
వెలుగులోకి
వచ్చింది.
ఇండోర్
వీధుల్లో
భిక్షం
ఎత్తుకునే
మంగీలాల్
అనే
వ్యక్తి
ఆస్తుల
వివరాలు
చూసి
అధికారులు
అవాక్కయ్యారు.
మంగీలాల్
కేవలం
భిక్షగాడు
మాత్రమే
కాదు,
కోట్ల
విలువైన
ఆస్తులు
ఉన్న
ఓ
వ్యాపారవేత్త
అని
తేలింది.
మంగీలాల్
ఆస్తుల
చిట్టా:
మహిళా
,
శిశు
అభివృద్ధి
శాఖ
బృందం
జరిపిన
విచారణలో
మంగీలాల్‌కు
సంబంధించిన
షాకింగ్
నిజాలు
బయటపడ్డాయి.
ఇండోర్‌లోని
భగత్
సింగ్
నగర్,
శివనగర్,
అల్వాస్
ప్రాంతాల్లో
అతనికి
మూడు
సొంత
ఇళ్లు
ఉన్నాయి.
ఇందులో
ఒకటి
మూడు
అంతస్తుల
భవనం
కావడం
గమనార్హం.
మంగీలాల్‌కు
వాహనాల
వ్యాపారం
కూడా
ఉంది.
మంగీలాల్‌కు
మూడు
ఆటోలు,
ఓ
మారుతి
సుజుకి
డిజైర్
కారు
ఉన్నాయి.
వీటిని
అతను
ఇతరులకు
అద్దెకు
ఇచ్చి
సంపాదిస్తున్నాడు.
అతనికి
వడ్డీ
వ్యాపారం
కూడా
ఉంది.ఇండోర్‌లోని
ప్రసిద్ధ
సరాఫా
బజార్‌లో
మంగీలాల్
పార్ట్
టైమ్
వడ్డీ
వ్యాపారిగా
పనిచేస్తున్నాడు.
అవసరమైన
వారికి
అధిక
వడ్డీకి
అప్పులు
ఇస్తుంటాడు.
మరోవైపు
రోజూవారీగా
కూడా
సంపాదిస్తున్నాడు.
ప్రతిరోజూ
వీధుల్లో
భిక్షాటన
చేస్తూ
రూ.
400
నుండి
500
వరకు
సంపాదిస్తాడు.
ప్రభుత్వ
పథకాలు
కూడా
వదల్లేదు:
అతని
వద్ద
కోట్ల
ఆస్తి
ఉన్నప్పటికీ,
ప్రభుత్వం,
రెడ్
క్రాస్
సంయుక్తంగా
చేపట్టిన
పథకం
కింద
సింగిల్
బెడ్రూం
ఫ్లాట్‌ను
కూడా
అతను
పొడగలిగాడు.
అయినప్పటికీ
భిక్షాటనను
మాత్రం
వదల్లేదు.
చెక్కతో
చేసిన
ఓ
చిన్న
బండిపై
తిరుగుతూ
నగర
వీధుల్లో
రెగ్యులర్‌గా
భిక్షం
ఎత్తుకుంటూనే
ఉన్నాడు.
3
मकान,
3
ऑटो
और
कार
चलाने
के
लिए
ड्राइवरइंदौर
में
करोड़पति
निकला
भिखारीलकड़ी
गाड़ी
से
घिसटकर
सड़कों
पर
माँगता
भीखhttps://t.co/7GnetwG1C8
pic.twitter.com/ZLbXNRtmLt—
ऑपइंडिया
(@OpIndia_in)
January
18,
2026
అధికారుల
చర్యలు:
మంగీలాల్
ప్రవర్తనపై
అనేక
ఫిర్యాదులు
రావడంతో
జిల్లా
నోడల్
ఆఫీసర్,
మహిళా
శిశు
అభివృద్ధి
బృందం
అతడిని
గుర్తించి
సంరక్షణ
కేంద్రానికి
తరలించారు.
“నగరంలో
భిక్షాటనను
ప్రోత్సహించే
వారిపై,
వృత్తిగా
చేసుకున్న
వారిపై
కఠిన
చర్యలు
తీసుకుంటాం”
అని
జిల్లా
ప్రోగ్రామ్
ఆఫీసర్
రాజేష్
సిన్హా
వెల్లడించారు.


