Telangana
oi-Dr Veena Srinivas
తెలంగాణా
జాగృతి
అధ్యక్షురాలు
కవిత
తాను
బీఆర్ఎస్
లోకి
మళ్ళీ
వెళ్ళేది
లేదని,
ఘర్
వాపసీ
ఉండబోదని
స్పష్టం
చేశారు.
ప్రజల
సమస్యల
పరిష్కారం
కోసం
పోరాటం
చేస్తానని
కూడా
కవిత
ప్రకటించారు.
తాను
ఎవరూ
వదిలిన
బాణం
కాదని,
ప్రజలు
వదిలిన
బాణం
అని
ఆమె
పేర్కొన్నారు.
తనను
ఆపరేట్
చేసే
అంత
సీన్
ఎవరికీ
లేదన్నారు.
2029
ఎన్నికల్లో
స్వతంత్రంగానే
పోటీ
చేస్తానని
ఆమె
ప్రకటించారు.
బీఆర్ఎస్
లోకి
వెళ్ళేది
లేదని
తేల్చేసిన
కవిత
యాదాద్రి
భువనగిరిలోని
వివేరా
హోటల్లో
‘జనం
బాట’
కార్యక్రమంలో
భాగంగా
విలేకరుల
సమావేశంలో
కవిత
ఈ
వ్యాఖ్యలు
చేశారు.
తాను
మళ్ళీ
బీఆర్ఎస్
అధినేత
కేసీఆర్
స్వయంగా
పార్టీలోకి
రావాలని
పిలిచినా
వెళ్ళేది
లేదన్నారు.
కారణం
చెప్పకుండా
తనను
పార్టీ
నుంచి
సస్పెండ్
చేయడంపై
ఆమె
మరోసారి
ఆవేదన
వ్యక్తం
చేశారు.
తాను
చేసిన
తప్పు
ఏమిటో
చెప్పకుండా
తనను
సస్పెండ్
చేసి
బయటకు
గెంటేశారు
అన్నారు.
పెద్దల
భూములను
కాపాడటం
కోసం
పేదల
భూములు
లాక్కున్నారన్న
కవిత
ఇప్పటివరకు
16
జిల్లాలను
పర్యటించి
ప్రజా
సమస్యలను
అధ్యయనం
చేస్తూ,
వాటిపై
పోరాటానికి
కార్యాచరణ
రూపొందిస్తున్నానని
కవిత
తెలిపారు.
ఉమ్మడి
యాదాద్రి
జిల్లాకు
కాళేశ్వరం
ప్రాజెక్టు
ద్వారా
ఒక్క
ఎకరానికి
కూడా
నీరు
అందలేదని
ఆమె
విమర్శించారు.
పెద్దల
భూములు
కాపాడేందుకు
ట్రిపుల్
ఆర్
కోసం
పేదల
భూములను
బలవంతంగా
లాక్కున్నారని
కవిత
మండిపడ్డారు.
రీజినల్
రింగ్
రోడ్
నిర్వాసిత
రైతుల
కోసం
పోరాటం
చేస్తానని
స్పష్టం
రీజనల్
రింగ్
రోడ్
ప్రాజెక్టు
నిర్వాసిత
రైతుల
సమస్యలపై
రైతుల
పక్షాన
తాను
పోరాటం
చేస్తానని
అన్నారు.
రాయిగిరి,
తిమ్మాపురం,
బస్వాపూర్
వంటి
ప్రాంతాల
రైతులతో
కలిసి
మాట్లాడిన
కవిత,
ప్రాజెక్టు
రీడిజైన్
పేరుతో
చిన్న
రిజర్వాయర్‌ను
పెద్దదిగా
మార్చి
రైతుల
భూములు
లాగేసుకున్నారని
ఆరోపించారు.
కేంద్రమంత్రిని
కలిసి
ఫిర్యాదు
చేస్తామన్న
కవిత
కొన్నిచోట్ల
మూడుసార్లు
మారిన
ట్రిపుల్
ఆర్
అలైన్‌మెంట్‌లను
అంగీకరించబోమని
ఆమె
కరాఖండిగా
చెప్పారు.
ఈ
విషయమై
కేంద్ర
రవాణా
శాఖ
మంత్రి
నితిన్
గడ్కరీకి
ఫిర్యాదు
చేస్తామని
తెలిపారు.
జిల్లాలో
పెండింగ్
ప్రాజెక్టులపై
ఇద్దరు
మంత్రుల
పనితీరును
కవిత
ప్రశ్నించారు.
ఇంకా
అనేక
సమస్యలపైన
స్పందించిన
కవిత
పేద
విద్యార్థులకు
వెంటనే
బోధనా
రుసుములు
విడుదల
చేసి
ఆదుకోవాలని
కోరారు.


