India
oi-Sai Chaitanya
బీజేపీ ఆపరేషన్ బీహార్ పూర్తి చేసింది. ఇక నెక్స్ట్ టార్గెట్ ఏంటి. బీజేపీ మార్క్ రాజకీయం ప్రత్యర్థి పార్టీలకే కాదు.. మిత్రపక్షాలకు అంతు చిక్కటం లేదు. బీహార్ ఎన్నికల ఫలితాల తరువాత నితీశ్ ను సీఎంగా మద్దతు ఇచ్చిన బీజేపీ.. ఇప్పుడు ఊహించని దెబ్బ కొట్టింది. బీహార్ లో తమ పార్టీ నేత ను ముఖ్యమంత్రిని చేస్తోంది. ఇప్పుడు బీహార్ లో టాస్క్ పూర్తి చేసిన బీజేపీ.. నెక్స్ట్ గురి ఎక్కడ పెట్టబోతోంది.. ఏం చేయబోతోంది.. ఇదే ఇప్పుడు రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.
ప్రధాని మోదీ – షా రాజకీయం పవర్ మరోసారి రుజువు అయింది. బీహార్ లో నితీశ్ తో కలిసి కూటమి గా అధికారంలోకి వచ్చారు. నితీశ్ ను సీఎం చేసారు. బీహార్ కు చెందిన నేతకే చీఫ్ గా పగ్గాలు అప్పగించారు. ఇప్పుడు బీహార్ లో తమ పార్టీ నేతను ముఖ్యమంత్రిని చేస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగటానికి మిత్రపక్షాలు కీలకమని భావిస్తున్న తరుణంలో నితీశ్ ను బీహార్ ను తప్పించి.. తమ నియంత్రణలోకి తెచ్చుకుంటున్నారు. కేంద్ర కేబినెట్ లో రైల్వే శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్దమైంది. దీంతో.. నితీశ్ పార్టీ మద్దతు పైన భవిష్యత్ లో ఎలాంటి సమస్య రాకుండా ఒకే సమయంలో రెండు రకాలుగా అటు బీహార్ లో .. ఇటు కేంద్రంలో పావులు కదిపింది. అటు ఆర్జేడీకి బలం లేకపోవటంతో.. గతంలో లాగా నితీశ్ మరో వైపు చూసే అవకాశం దక్కలేదు. బీజేపీ గేమ్ లో పావుగా మారక తప్పలేదు. ఇప్పుడు బీహార్ లో అనుకున్నది చేసిన బీజేపీ.. నెక్స్ట్ ఏం చేయబోతోంది.
బీజేపీ మిత్రపక్షాలతో సఖ్యతగా ఉంటూనే.. సొంతంగా తమ బలం.. తమ ప్రభుత్వం అనే లక్ష్యం తో అడుగులు వేస్తోంది. త్వరలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో మూడు రాష్ట్రాల పైన బీజేపీ గురి పెట్టింది. బెంగాల్ లో పరిస్థితి తమకు అనుకూలంగా మారే ఛాన్స్ ఉందని బీజేపీ భావిస్తోంది. అదే విధంగా తమిళనాడు, కేరళ లోనూ కొత్త వ్యూహాలు అమలు చేసేలా రంగం సిద్దమైంది. కేంద్ర కేబినెట్ విస్తరణ కు నిర్ణయించారు. ఈ రాష్ట్రాల నుంచి ప్రాధాన్యత పెరగనుంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలి, లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన బిల్లు లను ప్రవేశ పెట్టేందుకు సిద్దమైంది. ఆపరేషన్ 2029 లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. యూపీ ఎన్నికలకు ముందే ఊహించని పరిణామాలు ఖాయంగా కనిపిస్తున్నాయి. బీహార్ పరిణామా లతో మిత్రపక్షాలు అప్రమత్తం అవుతున్నాయి. దీంతో.. మే లో జరిగే అయిదు రాష్ట్రాల ఎన్నికల తరువాత బీజేపీ కొత్త ఎత్తుగడలు.. వ్యూహాలు అమలయ్యేలా మాస్టర్ స్కెచ్ సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. పక్కా ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్తున్న బీజేపీ అధినాయకత్వం తీసుకునే రాజకీయ నిర్ణయాలు ఇప్పుడు మరింత ఉత్కంఠ పెంచుతున్నాయి.


