బోల్తా పడ్డ మరో ట్రావెల్ బస్సు.. బస్సులో 35 మంది అయ్యప్ప భక్తులు | Ayyappa Devotees Travel Bus Overturned Five People Injured

Date:


సాక్షి, తిరుపతి జిల్లా: చిల్లకూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. అయ్యప్ప భక్తులతో వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. 

గుంటూరు నుంచి శబరిమలైకి వెళ్తున్న బస్సు రైటర్ సత్రం వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. కాగా ప్రమాద సమయంలో బస్సులో 35 మంది భక్తులు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదంలో ఐదుగురు భక్తులకు స్వల్ప గాయాలైనట్టు తెలుస్తోంది. జరిగిన ఘటనపై చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related