International
oi-Chandrasekhar Rao
అమెరికా
అధ్యక్షుడు
డొనాల్డ్
ట్రంప్..
భారత్
కు
ఓ
బిగ్
ఆఫర్
ఇచ్చారు.
పచ్చగడ్డి
వేస్తే
భగ్గుమనేంత
వైరం
పెంచుకున్న
రష్యాతో
కాకుండా
తాను
చక్రం
తిప్పుతున్న
వెనిజులాతో
వ్యాపార
లావాదేవీలు-
ప్రత్యేకించి
ముడిచమురు
కొనుగోళ్లకు
సంబంధించిన
ఒప్పందాలను
కుదుర్చుకోవాలని
సూచించారు.
రష్యా
దిగుమతులకు
ప్రత్యామ్నాయంగా
వెనిజులా
నుంచి
చమురు
కొనుగోళ్లను
తిరిగి
ప్రారంభించుకోవడానికి
భారత్‌కు
అనుమతి
ఇచ్చారు.
రష్యాకు
చెక్
పెట్టడానికి
భారత్
ను
వినియోగించుకుంటోన్నారు
ట్రంప్.
గత
ఏడాది
వెనిజులా
చమురు
కొనుగోళ్ల
విషయంలో
భారత్‌పై
టారిఫ్
విధించింది
అమెరికా.
దీని
తర్వాత
అక్కడ
చోటు
చేసుకున్న
పరిణామాల
నేపథ్యంలో
తాజా
నిర్ణయం
వెలువడినట్లు
రాయిటర్స్
తెలిపింది.
దీనిపై
ఓ
ప్రత్యేక
కథనాన్ని
ప్రచురించింది.
రష్యా
చమురు
కొనుగోళ్లపై
అమెరికా
టారిఫ్
పెంచిన
నేపథ్యంలో
ఆ
దేశం
నుండి
ముడి
చమురు
దిగుమతులను
తగ్గించుకోవాలని
సూచించింది.
అలా
చేస్తే
టారిఫ్
ను
కుదించే
అవకాశాలు
లేకపోలేదనే
వాదనలు
ఉన్నాయి.
2025
మార్చిలో
డొనాల్డ్
ట్రంప్
భారత్‌తో
సహా
వెనిజులా
నుంచి
చమురు
కొనుగోలు
చేసే
అన్ని
దేశాలపైనా
25
శాతం
టారిఫ్
విధించిన
విషయం
తెలిసిందే.
అనంతరం
ఆ
దేశాధ్యక్షుడు
నికోలస్
మదురోను
అమెరికా
బంధించడం,
కొత్త
అధ్యక్షురాలిగా
డెల్సీ
రోడ్రిగేజ్
నియమితులు
కావడం
వంటి
పరిణామాలు
చోటు
చేసుకున్నాయి.
దీంతో-
వెనిజులా
చమురు
పరిశ్రమను
నియంత్రించాలని
డొనాల్డ్
ట్రంప్
భావిస్తోన్నారు.
ఉక్రెయిన్
యుద్ధానికి
నిధులు
సమకూరుస్తున్నందుకు
రష్యా
నుంచి
ముడి
చమురు
కొనుగోళ్లను
సంపూర్ణంగా
నిలిపివేయాలనేది
డొనాల్డ్
ట్రంప్
ప్రధాన
డిమాండ్.
ఫలితంగా
రష్యా
ఆదాయ
వనరులను
దెబ్బకొట్టినట్టవుతుందనేది
ఆయన
వ్యూహం.
రష్యా
ఆయిల్
ను
నిలిపివేస్తే
అందుకు
ప్రత్యామ్నాయంగా
స్వయంగా
వెనిజులాను
తెరపైకి
తీసుకొచ్చింది
అమెరికా.
చమురు
విక్రయ
మార్గాల
గురించి
వెల్లడించడానికి
వైట్‌హౌస్,
యూఎస్
ట్రెజరీ,
భారత
చమురు,
విదేశాంగ
మంత్రిత్వ
శాఖలు
నిరాకరించినట్లు
రాయిటర్స్
తెలిపింది.
2022లో
ఉక్రెయిన్‌పై
రష్యా
దాడి,
పశ్చిమ
దేశాల
ఆంక్షల
నేపథ్యంలో
రష్యా
తన
క్రూడాయిల్
రేట్లను
తగ్గించింది.
దీంతో
ప్రధాన
కొనుగోలుదారుగా
మారింది
భారత్.
రష్యా
నుండి
దిగుమతులు
తగ్గుతున్నందున
భారత్
తన
ముడి
చమురు
వనరులను
అన్వేషించాల్సి
వస్తోందని
ఇటీవలే
కేంద్రమంత్రి
హర్‌దీప్
సింగ్
పూరి
స్పష్టంచేశారు.
జనవరిలో
నమోదైన
రష్యా
క్రూడాయిల్
దిగుమతులు
1.2
మిలియన్
బ్యారెళ్లు
కాగా,
ఫిబ్రవరిలో
ఈ
వేల్యూమ్
ఒక
మిలియన్,
మార్చిలో
8,00,000
బ్యారెళ్లకు
తగ్గే
అవకాశం
ఉంది.


