International
oi-Bomma Shivakumar
భారత్-
అమెరికా
మధ్య
వాణిజ్య
సంబంధంలో
కీలక
పరిణామం
చోటు
చేసుకుంది.
అమెరికా
అధ్యక్షుడు
ట్రంప్
భారత్
కు
గుడ్
న్యూస్
చెప్పారు.
భారతీయ
వస్తువులపై
ఇప్పటికే
ఉన్న
25
శాతం
సుంకాలను
18
శాతానికి
తగ్గిస్తూ
కీలక
నిర్ణయం
తీసుకున్నారు.
ప్రధాని
మోదీతో
ఫోన్
కాల్
అనంతరం
ఈ
మేరకు
తన
సొంత
సామాజిక
మాధ్యమమైన
ట్రూత్
సోషల్
ఇదే
విషయంపై
పోస్టు
చేశారు.
”
ఇదే
విషయంపై
ఇవాళ
ప్రధాని
మోదీతో
మాట్లాడాను.
ఆయన
నాకు
గొప్ప
స్నేహితుడు.
అలాగే
శక్తివంతమైన
నాయకుడు.
రష్యా
నుంచి
చమురు
కొనుగోలును
ఆపడానికి..
యూఎస్,
వెనిజులా
నుంచి
కొనుగోలు
చేయడానికి
ఆయన
అంగీకరించారు.
ఇరు
దేశాల
మధ్య
వాణిజ్య
ఒప్పందానికి
అంగీకారం
కుదిరింది”
అని
ట్రంప్
స్పష్టం
చేశారు.
ఈ
మేరకు
ట్రూత్
సోషల్
లో
పోస్టు
చేశారు.
ఇక
భారత
ప్రభుత్వం
2026-27
ఆర్థిక
సంవత్సరానికి
బడ్జెట్
ప్రవేశపెట్టిన
మరుసటి
రోజే
ట్రంప్,
మోదీతో
మాట్లాడడం
ప్రాధాన్యం
సంతరిచుకుంది.
భారత
వస్తువులపై
ట్రంప్
విధించిన
50
శాతం
టారిఫ్ల
వల్ల
ఎదురయ్యే
అడ్డంకులను
అధిగమించేందుకు
ఆర్థిక
మంత్రి
నిర్మలా
సీతారామన్
ఈ
బడ్జెట్లో
కొన్ని
చర్యలను
ప్రతిపాదించిన
విషయం
తెలిసిందే.
అంతకుముందు
ఇదే
విషయంపై
భారత్
లోని
యూఎస్
రాయబారి
సెర్గియో
గోర్
ఎక్స్
వేదికగా
పోస్టు
చేశారు.
అమెరికా
అధ్యక్షుడు
డొనాల్డ్
ట్రంప్,
భారత
ప్రధాని
నరేంద్ర
మోదీతో
ఫోన్
లో
సంభాషించారని
తెలిపారు.
అయితే
ఈ
ఇద్దరు
నేతలు
ఏ
అంశాలపై
చర్చించారనే
విషయాలను
మాత్రం
గోర్
వెల్లడించలేదు.
కానీ
‘వేచి
చూడండి’
అంటూ
ఆయన
ఓ
ఆసక్తికరమైన
వ్యాఖ్యను
జోడించారు.
దాంతో
ఇరు
దేశాధినేతలు
ఏఏ
అంశాలపై
చర్చించకుంటున్నారన్న
ఉత్కంఠ
పెరిగింది.
ఇక
అంతకు
ముందు
ట్రంప్
తన
సోషల్
మీడియా
మాధ్యమం
అయిన
ట్రూత్
సోషల్
లో
ఇండియా
గేట్
ఫొటోను
షేర్
చేశారు.
ఇది
ఒక
అందమైన
విజయ
స్మారకం
అంటూ
ప్రశంసలు
కురిపించడం
విశేషం.


