Business
oi-Jakki Mahesh
భారత్
ఎలక్ట్రిక్
వాహనాల
రంగంలో
సాధిస్తున్న
పురోగతిని
చూసి
చైనా
ఓర్వలేకపోతోంది.
ఎలక్ట్రిక్
వాహనాల
తయారీలో
ప్రపంచ
హబ్‌గా
ఎదగాలన్న
భారత్
లక్ష్యం
చైనాకు
కంటగింపుగా
మారింది.
భారత
సర్కారు
అందిస్తున్న
భారీ
ప్రోత్సాహకాలు
అంతర్జాతీయ
వాణిజ్య
నిబంధనలకు
విరుద్ధమంటూ
చైనా
ప్రపంచ
వాణిజ్య
సంస్థ(WTO)లో
ఫిర్యాదు
చేసింది.
చైనాకు
ఎందుకంత
మంట?
భారత
సర్కారు
మేక్
ఇన్
ఇండియాలో
భాగంగా
ఎలక్ట్రిక్
వాహనాలు,
బ్యాటరీల
తయారీని
ప్రోత్సహించడానికి
అనేక
పథకాలను
ప్రవేశపెట్టింది.
దీనివల్ల
తమ
మార్కెట్
దెబ్బతింటుందని
చైనా
ఆందోళన
చెందుతోంది.
అడ్వాన్స్‌డ్
కెమిస్ట్రీ
సెల్
బ్యాటరీలు,
వాహనాల
తయారీకి
ఇస్తున్న
ఉత్పాదక
ఆధారిత
ప్రోత్సాహకాలు
నిబంధనలకు
విరుద్ధమని
చైనా
వాదిస్తోంది.
భారత్
అవలంభిస్తున్న
విధానాలు
తమ
దేశ
ఉత్పత్తుల
పట్ల
వివక్ష
చూపుతున్నాయని..
ఇది
గ్లోబల్
ట్రేడ్
రూల్స్
ఉల్లంఘించడమేనని
చైనా
ఆరోపిస్తోంది.
ఈ
విషయంపై
2025
నవంబర్,
2026
జనవరిలో
ఇరు
దేశాల
మధ్య
జరిగిన
చర్చలు
విఫలమవడంతో,
చైనా
నేరుగా
ప్రపంచ
వాణిజ్య
సంస్థ
వివాద
పరిష్కార
విభాగాన్ని
ఆశ్రయించింది.
భారత్
ఇస్తున్న
ప్రోత్సాహకాలు
ఇవే..
భారత్
2030
నాటికి
రోడ్లపై
30
శాతం
వాహనాలు
ఎలక్ట్రిక్
రూపంలోనే
ఉండాలని
లక్ష్యంగా
పెట్టుకుంది.
ఇందుకోసం
ప్రభుత్వం
పలు
సౌకర్యాలను
కల్పిస్తోంది.
పీఎం
ఈ-డ్రైవ్(PM
E-DRIVE)
పథకం
ద్వారా
వాహనాల
కొనుగోలుపై
రాయితీలు
ఇస్తోంది.
ఎలక్ట్రిక్
వాహనాలపై
జీఎస్టీ
(GST)
తగ్గింపు,
రోడ్
టాక్స్,
రిజిస్ట్రేషన్
ఫీజుల
నుంచి
100శాతం
మినహాయింపు
అందిస్తోంది.
యూపీ,
ఢిల్లీ,
మహారాష్ట్ర,
కర్ణాటక
వంటి
రాష్ట్రాలు
సొంతంగా
ఈవీ
పాలసీలను
ప్రకటించి
క్యాష్
సబ్సిడీలను
కూడా
ఇస్తున్నాయి.
పాత
బ్యాటరీలను
రీసైకిల్
చేసే
కంపెనీలకు
‘వేస్ట్
టు
వెల్త్’
మిషన్
కింద
ప్రోత్సాహకాలు
అందిస్తోంది.
భారత్‌కు
సవాల్‌గా
మారనుందా?
చైనా
చేసిన
ఈ
ఫిర్యాదుపై
జనవరి
27న
జెనీవాలో
జరిగే
సమావేశంలో
చర్చ
జరగనుంది.
ఒక
ప్రత్యేక
కమిటీని
వేసి
దర్యాప్తు
చేయాలని
చైనా
కోరుతోంది.
భారత్
మాత్రం
తమ
విధానాలు
కేవలం
దేశీయ
పరిశ్రమలను
బలోపేతం
చేసేందుకేనని,
ఇవి
ప్రపంచ
పోటీతత్వాన్ని
పెంచుతాయని
వాదిస్తోంది.
అంతర్జాతీయ
స్థాయిలో
భారత్
తన
పట్టును
పెంచుకుంటున్న
తరుణంలో
చైనా
చేస్తున్న
ఈ
ప్రయత్నాలు
‘మేక్
ఇన్
ఇండియా’కు
ఒక
సవాల్‌గా
మారాయి.
మరి
ఈ
వాణిజ్య
పోరాటంలో
WTO
ఎవరి
వైపు
నిలుస్తుందో
వేచి
చూడాలి.


