India
oi-Dr Veena Srinivas
ఇరాన్ ఇజ్రాయిల్ అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా పైన పడింది. దీంతో భారతదేశంలో గ్యాస్ కొరత ఏర్పడింది. వాణిజ్య ఎల్పిజి సరఫరా అస్థిరంగా మారడంతో చాలా చోట్ల వ్యాపారులు హోటళ్లు, రెస్టారెంట్లు నిర్వహించటానికి ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ పరిస్థితిని 2025 సెప్టెంబర్ 27వ తేదీన ప్రశాంత్ కిని అంచనా వేశాడు.
భారత్ లో గ్యాస్ కొరతపై ముందే చెప్పిన ప్రశాంత్ కిని
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయన గ్యాస్ కొరత పైన చేసిన పోస్ట్ హల్ చల్ చేస్తుంది. జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని తెలిపిన వివరాల ప్రకారం భారతదేశంలో 2026 మార్చి తర్వాత ఇంధనం, సహజవాయువు కొరత ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. సరఫరా వ్యవస్థలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని ఆయన తన పోస్టులో తెలిపారు. సరఫరా వ్యవస్థలో అంతరాయాన్ని ముందే గుర్తించి సమస్యలు వచ్చే ప్రమాదాన్ని అప్పట్లోనే ఆయన హెచ్చరించారు.
గతంలో చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్
ఎల్పిజి సరఫరా సమస్యలపైన ప్రస్తుతం వార్తలు వైరల్ అవుతున్న వేళ ఆయన గతంలో చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని ఆ ట్వీట్ ను తిరిగి షేర్ చేసి, దాదాపు ఐదు నెలల క్రితమే ఈ విషయాన్ని చెప్పానని పేర్కొన్నారు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. వేణు స్వామిని మించిన జ్యోతిష్యుడు అని అంటున్నారు.
India will face fuel and natural Gas shortage after March 2026…
Supply chain disrupt…!!??— Prashanth Kini (@AstroPrashanth9) September 27, 2025
జ్యోతిష్య అంచనా నిజం కావటంతో చర్చ
కొందరు యాదృచ్ఛికంగా జరిగింది అంటుంటే, మరికొందరు ఆయన జ్యోతిష్య అంచనా నిజమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే యుద్ధం కారణంగా ముంబై, బెంగళూరు, కలకత్తా వంటి నగరాలలో గ్యాస్ సరఫరా సమస్యలు తీవ్రతరం అయ్యాయి. ఇప్పటికే హోటల్స్ అసోసియేషన్లు కమర్షియల్ ఎల్పిజి సరఫరా పైన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
గ్యాస్ కొరతపై ప్రత్యామ్నాయ మార్గాలను సైతం అన్వేషిస్తున్న ప్రభుత్వం
ఇక కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగ గ్యాస్ నిరంతరాయంగా ఉండేలా చర్యలు చేపట్టడంతో పాటు గృహ సిలిండర్ల బుకింగ్ వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది. దేశంలో చోటు చేసుకున్న గ్యాస్ కొరత సమస్యను పరిష్కరించడం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను సైతం అన్వేషిస్తున్న ప్రభుత్వం ఉత్పత్తిని పెంచాలని రిఫైనరీ లకు సూచిస్తుంది. ఈ చర్యలతో త్వరలోనే సరఫరా వ్యవస్థ మెరుగుపడుతుందని కేంద్రం భావిస్తుంది.


