భారత్ లో Starlink ఇంటర్నెట్ షురూ: కారులో కూడా పట్టుకెళ్లొచ్చు- బేసిక్ ప్లాన్ చాలా ఖరీదు బాబోయ్ | India debut nears as Starlink discloses monthly pricing details

Date:


Science Technology

oi-Chandrasekhar Rao

ఎలాన్
మస్క్
నేతృత్వంలోని
ప్రముఖ
శాటిలైట్
ఇంటర్నెట్
ప్రొవైడర్
స్టార్‌లింక్..
భారత్
లో
అడుగు
పెట్టింది.
దేశీయ
మార్కెట్
కోసం
తమ
ప్లాన్‌లను
అధికారికంగా
వెల్లడింది.
దీనికి
సంబంధించిన
పూర్తి
సమాచారాన్ని
తన
వెబ్‌సైట్‌లో
ఉంచింది.
ప్రపంచవ్యాప్తంగా
ఇప్పటికే
విస్తృతంగా
ప్రాచుర్యం
పొందిన
స్టార్‌లింక్
సేవలు
భారత్
లో
ప్రారంభం
కావడంపై
ఇప్పటివరకు
నెలకొన్న
అనిశ్చితికి
తెరదించినట్టయింది
దీంతో.

స్టార్
లింక్
బ్రాండ్
బాండ్/ఇంటర్నెట్
సేవలు
చౌకగా
లభించవచ్చని
ఆశించినప్పటికీ-అది
వాస్తవరూపం
దాల్చలేదు.
అత్యంత
ఖరీదైనవి.
ఇప్పటివరకు
అందుబాటులో
ఉన్న
ఇంటర్నెట్
ప్రొవైడర్లతో
పోల్చుకుంటే
దీని
రేటే
అధికంగా
కనిపిస్తోంది.
స్టార్‌లింక్
ఇండియా
వెబ్‌సైట్
లో
పొందుపరిచిన
వివరాల
ప్రకారం
చూసుకుంటే-

ప్లాన్‌లు
నెలకు
8,600
రూపాయల
నుండి
ప్రారంభమవుతాయి.
ఇది
బేసిక్
ప్లాన్.

India debut nears as Starlink discloses monthly pricing details

వినియోగదారులు
నెలవారీ
ప్లాన్‌కు
అదనంగా
ఇంటర్నెట్
హార్డ్‌వేర్
కిట్
కోసం
34,000
రూపాయలను
చెల్లించాల్సి
ఉంటుంది.

కిట్‌ను
కొనుగోలు
చేసిన
తర్వాత,
కస్టమర్లు
తామే
సొంతంగా,
సులభంగానే
దీన్ని
సెటప్
చేసుకోవచ్చు.
ఇన్‌స్టాలేషన్
పూర్తయిన
వెంటనే
ఇంటర్నెట్
సేవలు
అందుబాటులోకి
వస్తాయి.
హార్డ్
వేర్
కిట్
యాక్టివేట్
అవుతుంది.
99.9
శాతం
అప్‌టైమ్‌తో
ఇంటర్నెట్/బ్రాడ్
బ్యాండ్
సేవలు
అందుబాటులోకి
వస్తాయని
స్టార్‌లింక్
తెలిపింది.
ఇంటర్నెట్
అంతరాయాలకు
ఎటువంటి
ఆస్కారం
లేదని
ధీమా
వ్యక్తం
చేసింది.

ఉపగ్రహాలపై
ఆధారపడిన
ఇంటర్నెట్
సర్వీస్
కావడం
వల్ల
ఎటువంటి
అంతరాయం
ఉండబోదని
స్టార్
లింక్
చెబుతోంది.
నేరుగా
శాటిలైట్
నుండే

సేవలను
అందుతాయని,
దేశంలోని

మారుమూల
ప్రాంతం
నుండి
అయినా
దీన్ని
వినియోగించుకోవచ్చని
వివరించింది.
ప్రస్తుతం

సేవలు
కొన్ని
పరిమిత
ప్రదేశాలలో
మాత్రమే
అందుబాటులో
ఉన్నాయి.
30
రోజుల
ట్రయల్
వ్యవధిలో
కస్టమర్లకు
అపరిమిత
డేటా
లభిస్తుందిది.

వినియోగదారులు
స్టార్‌లింక్
ఇండియా
అధికారిక
వెబ్‌సైట్‌ను
సందర్శించి
ప్లాన్‌లు,
ఆఫర్‌లు,
లభ్యతను
తెలుసుకోవచ్చు.
పిన్
కోడ్
ఆధారంగా
వేర్వేరు
ప్లాన్‌లు,
ఆఫర్లు
అందుబాటులో
ఉంటాయి.
ప్రస్తుతం
ప్రకటించిన

ప్లాన్‌లన్నీ
కూడా
గృహావసర
వినియోగదారుల
కోసం
మాత్రమే
ఉద్దేశించినవి.
వాణిజ్య
అవసరాలకు
అవి
ఉపయోగపడవు.
దీనికి
సంబంధించిన
మరో
ప్యాకేజీని
త్వరలోనే
వెల్లడించే
అవకాశం
ఉంది
స్టార్‌లింక్.


రోమింగ్
ప్లాన్
కింద
వినియోగదారులు
యాంటెన్నా
కిట్‌ను
తమతో
పాటు
ఎక్కడికైనా
తీసుకెళ్లవచ్చు.
కారుపైన
కూడా
సులభంగా
అమర్చవచ్చు.
భారత్
లో
కంపెనీ
ఏయే
నిర్దిష్ట
సేవలను
అందిస్తుందనే
దానిపై
పూర్తి
స్పష్టత
ఇంకా
రాలేదు.
సేవలు
అందుబాటులోకి
వచ్చిన
వెంటనే
నోటిఫికేషన్
ద్వారా
సమాచారం
అందించడానికి
వినియోగదారులు
తమ
ఈమెయిల్
ఐడీని
స్టార్‌లింక్
ఇండియా
వెబ్‌సైట్‌లో
నమోదు
చేసుకోవాలని
కంపెనీ
సూచించింది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related