India
-Bomma Shivakumar
భారత
సముద్ర
జలాల్లోకి
అక్రమంగా
ప్రవేశించిన
ఒక
పాకిస్థానీ
బోటును
భారత
కోస్టు
గార్డు
తాజాగా
స్వాధీనం
చేసుకుంది.
ఈ
బోటులో
మొత్తం
9
మంది
సిబ్బంది
ఉన్నారని
అధికారులు
తెలిపారు.
దేశ
తీరప్రాంతంలో
కోస్టు
గార్డు
దళాలు
నిర్వహించిన
సాధారణ
నిఘాలో
భాగంగా
ఈ
నౌకను
అడ్డుకున్నారు.
భారత
అధికార
పరిధిలోకి
అనుమతి
లేకుండా
ప్రవేశించినట్లు
గుర్తించిన
తర్వాతే
ఈ
చర్య
తీసుకున్నట్లు
పేర్కొన్నారు.
పట్టుబడిన
సిబ్బంది
అంతా
పాకిస్థానీ
జాతీయులుగా
అనుమానిస్తున్నారు.
వారిని
అదుపులోకి
తీసుకున్నారు.
గుజరాత్
డిఫెన్స్
పీఆర్వో,
వింగ్
కమాండర్
అభిషేక్
కుమార్
తివారీ
‘ఎక్స్’
వేదికగా
ఈ
ఘటన
వివరాలను
వెల్లడించారు.
“వేగవంతమైన,
పకడ్బందీ
రాత్రి
ఆపరేషన్
లో
ఒక
భారత
కోస్టు
గార్డు
నౌక
అరేబియా
సముద్రంలో
పెట్రోలింగ్
నిర్వహిస్తుండగా..
2026
జనవరి
14న
ఇంటర్నేషనల్
మారిటైమ్
బౌండరీ
లైన్
(IMBL)
సమీపంలోని
భారత
జలాల్లో
ఒక
పాకిస్థానీ
చేపల
వేట
బోటును
గుర్తించింది”
అని
తెలిపారు.
“సవాలు
చేసినప్పుడు..
ఆ
బోటు
పాకిస్థానీ
వైపు
పారిపోవడానికి
ప్రయత్నించింది
అయితే,
భారత
కోస్టు
గార్డు
నౌక
భారత
జలాల్లోనే
ఈ
బోటును
అడ్డుకుందని,
“అల్-
మదీనా”
అనే
ఆ
పాకిస్థానీ
బోటులో
మొత్తం
9
మంది
సిబ్బంది
ఉన్నారని
ఆయన
పేర్కొన్నారు.
భారత
సముద్ర
అధికారులు
ఇలాంటి
చర్యలు
తీసుకోవడం
ఇదేం
మొదటిసారి
కాదు.
గతంలో
కూడా
ఇటువంటి
అనేక
ఘటనలు
జరిగాయి.
2025
డిసెంబర్
లో
భారత
కోస్టు
గార్డు
మరో
పాకిస్థానీ
చేపల
వేట
బోటును
అడ్డుకుంది.
భారత
ఎక్స్
క్లూజివ్
ఎకనామిక్
జోన్
(EEZ)లో
అక్రమంగా
ప్రవేశించి
చేపల
వేట
చేస్తున్న
ఈ
బోటులో
11
మంది
సిబ్బంది
ఉన్నారు.
వారిని
అదుపులోకి
తీసుకుని
తదుపరి
విచారణ
కోసం
స్థానిక
మెరైన్
పోలీసులకు
అప్పగించారు.
అంతకుముందు,
2023
నవంబర్
చివరిలో
కోస్టు
గార్డు
‘నజ్-రే-కరం’
అనే
పాకిస్థానీ
చేపల
వేట
నౌకను
అరేబియా
సముద్రంలో
పట్టుకుంది.
ఇంటర్నేషనల్
మారిటైమ్
బౌండరీ
లైన్
వద్ద
భారత
జలాల్లో
సుమారు
15
కి.
మీ
లోపల
చేపలు
పడుతుండగా
దానిని
గుర్తించారు.
ఈ
నౌకలో
13
మంది
సిబ్బంది
ఉన్నారని
అధికారులు
వివరించారు.
సంవత్సరాలుగా,
భారత
సముద్ర
ఏజెన్సీలు
పాకిస్థానీ
సహా,
అనుమతి
లేకుండా
భారత
సముద్ర
మండలాల్లోకి
ప్రవేశించిన
విదేశీ
చేపల
వేట
నౌకలను,
మత్స్య
కారులను
పట్టుకుంటున్నాయి.
ఇది
పశ్చిమ
తీరంలో
నిరంతర
నిఘా,
చట్టాల
అమలుకు
నిదర్శనం.
ఇటీవల
నెలలుగా,
భారత
సముద్ర
ప్రాంతాలలో
అక్రమ
ప్రవేశాలు,
చట్టవిరుద్ధ
కార్యకలాపాలపై
భద్రతా
ఆపరేషన్‌లను
పెంచిన
నేపథ్యంలోనే
ఈ
తాజా
ఘటన
చోటుచేసుకుంది.


