భారీగా పెరగనున్న ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌

Date:


Business

oi-Chandrasekhar Rao

ల్యాప్‌టాప్‌/ డెస్క్‌టాప్‌ కొనాలనుకుంటోన్నారా? అలాంటి ప్లాన్ ఏదైనా ఉందా? ఉంటే.. వీలైనంత త్వరగా కొనడం బెటర్. ఎందుకంటే వీటి ధరలు భారీగా పెరగనున్నాయి. ఈ ఏడాదిలో కనీసం 35 శాతం మేర పెరిగే అవకాశం ఉంది. దీనికి కారణాలు లేకపోలేదు. ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌ ల తయారీలో వినియోగించే కీలక కాంపొనెంట్ల ధరలకు రెక్కలొచ్చాయి. 45 శాతం అంటే ఇప్పుడున్న రేట్లకు సగానికి పెరిగాయి. దీని ప్రభావం ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌ పై పడటం ఖాయంగా కనిపిస్తోంది.

దీనిపై బిజినెస్ న్యూస్ పోర్టల్ మనీకంట్రోల్ ఓ కథనాన్ని ప్రచురించింది. రేట్లు పెరగడానికి గల అవకాశాలను విశ్లేషించింది. ప్రాసెసర్లు, గ్రాఫిక్ యూనిట్లు, మెమరీ వంటి కీలక భాగాల ధరలు పెరగడం, అలాగే ఇంటెల్ ఎంట్రీ లెవల్ ప్రాసెసర్ల కొరత ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలని పేర్కొంది. దీనివల్ల పర్సనల్ కంప్యూటర్ల ధరలు 35 శాతం వరకు పెరగవచ్చు. ఇది ప్రధానంగా డీడీఆర్ ర్యామ్ ధరలు గణనీయంగా పెరగడం, ఎంట్రీ-లెవల్ ఇంటెల్ ప్రాసెసర్‌ల లభ్యత పరిమితం కావడమే.

ఈ భాగాల ఖర్చులు పెరగడం వల్ల ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌ల కొనుగోలు శక్తిపై ప్రభావం పడనుంది. పర్సనల్ కంప్యూటర్ ధరలపై మెమరీ కాంపొనెంట్‌ల ఒత్తిడి అధికంగా ఉంటుందని మనీకంట్రోల్ పేర్కొంది. ఇటీవలి నెలల్లో డీడీఆర్ ర్యామ్ ధరలు విపరీతంగా పెరగడం వల్ల పరికరాల తయారీదారులు తమ ఉత్పత్తి ఖర్చులను పెంచాయి. తయారీదారులు ఈ అధిక ఖర్చులను వినియోగదారులకు బదిలీ చేసే అవకాశం ఉంది. ఇది ఎంట్రీ లెవల్, మిడ్ రేంజ్ పరికరాలపై ధరల పెరుగుదలకు దారితీస్తుంది.

మార్కెట్ అనలైజింగ్ కంపెనీ ఐడీసీ ప్రకారం డెస్క్‌టాప్‌లు, నోట్‌బుక్‌లు, వర్క్‌స్టేన్‌తో సహా దేశీయ పీసీ మార్కెట్ 2025లో 15.9 మిలియన్ యూనిట్లను విక్రయించింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 10.2 శాతం వృద్ధిని నమోదు చేశాయి పీసీ విక్రయాలు. వార్షిక విక్రయాలు మొట్టమొదటిసారిగా 15 మిలియన్ మార్కును అధిగమించినట్టయింది. గత ఏడాది డిసెంబర్ త్రైమాసికంలో 4.1 మిలియన్ యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఇది వార్షికంగా 18.5 శాతం వృద్ధిని అందుకుంది.

హెచ్ పీ భారత పర్సనల్ కంప్యూటర్ అమ్మకాల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. దాని తర్వాత లెనోవో, డెల్, ఏసర్, ఆసుస్ సంస్థలు ఉన్నాయి. అన్ని ప్రధాన విక్రయదారులు కూడా ఏడాది పొడవునా గణనీయమైన విక్రయాల వృద్ధిని సాధించాయి. హార్ముజ్ స్ట్రెయిట్ జలమార్గంలో ఏర్పడిన అంతరాయం సెమీకండక్టర్ల తయారీ ఖర్చులను మరింత పెంచవచ్చు. చిప్‌లు, ఇతర పీసీ విడి భాగాల ధరలు, వాటి లభ్యత రేట్లను ప్రభావం చేస్తోంది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Brenda Song on Alaska Airlines Flight Issue With Macaulay Culkin, Kids

Brenda Song Shares How 'Home Alone' Inspired Safety...

Wet Leg Performs ‘Moisturizer’ Tracks on ‘SNL UK’ Premiere Episode

Live from London, it’s Saturday Night Live! The iconic sketch...