భార్య ప్రాణం కోసం 300 కిలోమీటర్లు రిక్షా తొక్కిన 75 ఏళ్ల వృద్ధుడు!

Date:


India

oi-Jakki Mahesh

ఒడిశాకు
చెందిన

వృద్ధుడి
నిస్వార్థ
ప్రేమ,
పట్టుదల
ఇప్పుడు
దేశవ్యాప్తంగా
అందరినీ
కదిలిస్తోంది.
తన
భార్య
ప్రాణాలను
కాపాడుకోవడానికి
75
ఏళ్ల
వయసులో
ఆయన
చేసిన
పోరాటం
ప్రతి
ఒక్కరినీ
కన్నీరు
పెట్టిస్తోంది.
ప్రేమకు
ఆకలి
ఉండదు,
వయసు
అడ్డుకాదు
అని
ఒడిశాకు
చెందిన
బాబు
లోహర్(75)
మరోసారి
నిరూపించారు.
బీహార్‌కు
చెందిన
మౌంటెన్
మ్యాన్
దశరథ్
మాంఝీ
తరహాలోనే
బాబు
లోహర్
తన
పక్షవాతం
సోకిన
భార్య
జ్యోతి(70)
కోసం
అసాధ్యమైన
ప్రయాణాన్ని
సుసాధ్యం
చేశారు.


సంబల్పూర్
నుంచి
కటక్
వరకు..
9
రోజుల
సాహసం

సంబల్పూర్‌లోని
మోదీపడ
నివాసి
అయిన
బాబు
లోహర్
భార్యకు
బ్రెయిన్
స్ట్రోక్
రావడంతో
స్థానిక
వైద్యులు
కటక్‌లోని
ఎస్సీబీ
మెడికల్
కాలేజీకి
తీసుకెళ్లాలని
సూచించారు.
అయితే
అంబులెన్స్
అద్దెకు
కూడా
డబ్బులు
లేని
స్థితిలో
ఆయన
అధైర్యపడలేదు.
తన
వద్ద
ఉన్న
పాత
సైకిల్
రిక్షానే
అంబులెన్స్‌గా
మార్చారు.
భార్యకు
అసౌకర్యం
కలగకుండా
రిక్షాలో
పాత
మెత్తలు
అమర్చారు.
సంబల్పూర్
నుంచి
కటక్
వరకు
ఉన్న
300
కిలోమీటర్ల
దూరాన్ని
రిక్షా
తొక్కుతూ
కేవలం
9
రోజుల్లో
చేరుకున్నారు.
రాత్రివేళల్లో
రోడ్డు
పక్కన
దుకాణాల
వద్ద
తలదాచుకుంటూ,
ఎండను
వానను
లెక్కచేయకుండా
గమ్యానికి
చేరుకున్నారు.


ఆసుపత్రిలో
చికిత్స..
తిరుగు
ప్రయాణంలో
ప్రమాదం

కటక్
ఆసుపత్రిలో
సుమారు
రెండు
నెలల
పాటు
జ్యోతికి
చికిత్స
అందింది.
ఆమె
కోలుకున్న
తర్వాత

నెల
19న
అదే
రిక్షాపై
వారు
తిరుగు
ప్రయాణం
ప్రారంభించారు.
అయితే
చౌద్వార్
సమీపంలో
ఒక
వాహనం
వీరి
రిక్షాను
ఢీకొట్టింది.

ప్రమాదంలో

వృద్ధురాలు
మరోసారి
తీవ్రంగా
గాయపడ్డారు.


“మాకు
మేమే
దిక్కు”..
చలించిన
వైద్యులు

ప్రమాదం
తర్వాత
వారిని
సమీపంలోని
హెల్త్
సెంటర్‌కు
తరలించారు.
అక్కడ
చికిత్స
అందించిన
డాక్టర్
వికాస్,
వారి
దీనస్థితిని
చూసి
చలించిపోయారు.
వారికి
వైద్యంతో
పాటు
సొంతంగా
ఆర్థిక
సాయం
కూడా
అందించి
అండగా
నిలిచారు.
“మాకు
ఎవరూ
లేరు..
ఒకరికొకరం
మాత్రమే
మిగిలాం,”
అని
బాబు
లోహర్
కన్నీళ్లతో
చెప్పిన
మాటలు
అక్కడి
వారిని
కలచివేసాయి.
గాయాల
నుంచి
కోలుకున్న
తర్వాత,
బాబు
లోహర్
మళ్లీ
రిక్షాను
సిద్ధం
చేసుకుని
సంబల్పూర్
వైపు
తన
ప్రయాణాన్ని
కొనసాగిస్తున్నారు.


బాబు
లోహర్
సాహసంపై
ప్రశంసలు


వయసులో
అన్ని
కష్టాల
మధ్య
భార్యను
కాపాడుకోవడానికి
ఆయన
చూపిన
అంకితభావం
పట్ల
సర్వత్రా
ప్రశంసలు
కురుస్తున్నాయి.
నిజమైన
ప్రేమకు
బాబు
లోహర్
ఒక
నిదర్శనంగా
నిలిచారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related