Andhra Pradesh
oi-Sai Chaitanya
న్యూ
ఇయర్
వేళ
ఏపీ
ప్రభుత్వం
భారీ
శుభవార్త
చెప్పింది.
ఎంతో
కాలంగా
22ఏ
నిషేధ
జాబితాలో
ఉన్న
భూముల
విముక్తి
వాటి
యజమానులు
వేచి
చూస్తున్నారు.
కాగా,
ప్రభుత్వం
అనేక
చర్చల
తరువాత
ఇప్పుడు
ఈ
భూమల
విషయంలో
కీలక
నిర్ణయం
తీసుకుంది.
అయిదు
రకాల
భూముల
ను
ఈ
జాబితా
నుంచి
తెలిగించింది.
మిగిలిన
భూముల
విషయంలోనూ
త్వరలోనే
నిర్ణయం
తీసుకుంటామని
స్పష్టం
చేసింది.
ఈ
అయిదు
రకాల
భూముల
విషయంలో
వెంటనే
చర్యలు
తీసుకోవాలని
అధికార
యంత్రాంగాన్ని
ఆదేశించింది.
భూయాజమానులకు
ఊరటనిచ్చేలా
22ఏ
జాబితా
నుంచి
అయిదు
రకాల
భూములను
తొలగిస్తూ
రెవెన్యూ
శాఖ
మంత్రి
అనగాని
సత్యప్రసాద్
సంతకం
చేశారు.
మిగిలిన
నాలుగు
రకాల
భూములపై
త్వరలో
జీవోఎంలో
చర్చించి
నిర్ణయం
తీసుకుంటామని
వెల్లడించారు.
ప్రభుత్వ
నిర్ణయం
ప్రకారం
ప్రైవేట్
భూములను
22ఏ
జాబితా
నుంచి
పూర్తిగా
తొలగించనున్నారు.
ప్రైవేటు
పట్టా
భూములకు
ఎవరు
దరఖాస్తు
చేసుకున్నా
అధికారులు
సుమోటోగా
తొలగించాల్సి
ఉంటుంది.
ప్రస్తుత,
మాజీ
సైనిక
ఉద్యోగుల
భూములకు
సంబంధిత
పత్రాలు
ఉంటే
నిషిద్ధ
జాబితా
నుంచి
తొలగించాలని
ప్రభుత్వం
ఆదేశించింది.
అలాగే
స్వాంత్రత్య
సమర
యోధుల
భూములను,
రాజకీయ
బాధితుల
కేటాయించిన
భూములను
కూడా
22ఏ
నుండి
తొలగించనున్నారు.
భూ
కేటాయింపుల
కోసం
జిల్లా
సైనిక
సంక్షేమ
అధికారి
చేసిన
సిఫార్సుల
రిజిస్టర్
ఒక్కటే
సరిపోతుందని
ప్రభుత్వం
స్పష్టం
చేసింది.
వెంటనే
అవసరమైన
చర్యలు
తీసుకోవాలని
సూచించింది.
అదే
విధంగా
10(1)
రిజిస్టర్,
అడంగల్స్,
ఎస్ఎఫ్ఎ
లాంటి
పాత
రెవెన్యూ
రికార్డులు
ఉన్నా,
ఎసైన్మెంట్
రిజిస్టర్లు,
డీఆర్
దస్త్రాలు
ఉన్నా
చాలని
స్పష్టమైన
ఆదేశాలు
జారీ
చేసింది.
రికార్డ్
ఆఫ్
హోల్డింగ్స్,
రిజిస్ట్రేషన్
పత్రాల్లో
ఏదోకటి
సరిపోతుందని..
8ఏ
రిజిస్టర్లు,
డికెటీ
పట్టాల్లో
ఏదైనా
ఒకటి
ఉన్నా
ఒకటే
అని
తెలియజేసింది.
దాదాపు
8
రకాల
ప్రతాల్లో
ఏ
ఒక్కటి
ఉన్నా
22ఏ
నుంచి
తొలగించాలని
ఆదేశాలు
ఇచ్చారు.
ఇంకా
అదనంగా
పత్రాలు
కావాలని
భూ
యాజమానుల
తిప్పుకోకూడదని
స్పష్టం
చేశారు.
నూతన
సంవత్సరం
బహుమతిగా
భూయజమానులకు
రాష్ట్ర
ప్రభుత్వం
భారీ
ఊరటనిచ్చింది.
రైతులకు,
భూయాజమానుల
హక్కులు
రక్షించడమే
తమ
ప్రభుత్వ
ప్రథమ
కర్తవ్యమన్న
మంత్రి
అనగాని
సత్యప్రసాద్
స్పష్టం
చేశారు.


