Andhra Pradesh
oi-Lingareddy Gajjala
ఏపీలో
మహిళలకు
మరింత
అండగా
నిలిచేందుకు
ప్రభుత్వం
సిద్ధమైంది.
ఇప్పటికే
స్వయం
సహాయ
సంఘాల
ద్వారా
రుణాలు,
ప్రోత్సాహాలు
అందిస్తున్న
కూటమి
ప్రభుత్వం
మరో
అడుగు
ముందుకేసింది.
ఇక
నుంచి
మేడ్
ఇడ్
ఆంధప్రదేశ్
అంటే
నేషనల్
కాదు,
ఇంటర్
నేషనల్
అనే
రేంజ్
మారేలా
ప్రణాళిక
చేసింది.
దీంతో
ఏపీ
బ్రాండ్
ప్రపంచవ్యాప్తంగా
విస్తరించేలా
కసరత్తు
చేస్తుంది.
రాష్ట్రంలో
స్వయం
సహాయ
సంఘాలు
తయారు
చేస్తున్న
ఉత్పత్తులకు
బ్రాండింగ్
పై
ఏపీ
ప్రభుత్వం
ఫోకస్
చేసింది.
మన
దగ్గరున్న
అరుదైన
సంపదను
మహిళలలు
అద్భుతంగా
అందిపుచ్చుకుని
ఆర్ధిక
స్థిరత్వం
సాధిస్తున్నారు.
ఇప్పుడు
మరో
అడుగు
ముందుకేసి
ఏపీ
బ్రాండ్
ను
ప్రపంచ
వ్యాప్తం
చేయాలని
ముఖ్యమంత్రి
చంద్రబాబు
నాయుడు
సెర్ప్
విభాగాన్ని
ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా
మహిళా
సంఘాలు
తయారు
చేస్తున్న
23
వేల
పైచిలుకు
వివిధ
రకాల
ఉత్పత్తులకు
దేశీయంగా,
అంతర్జాతీయంగా
మార్కెటింగ్
చేసేందుకు
వీలుగా
ఈ
బ్రాండ్
ఉపకరిస్తుందని
సీఎం
స్పష్టం
చేశారు.
సచివాలయంలో
సెర్ప్,
మెప్మా
విభాగాలపై
ముఖ్యమంత్రి
చంద్రబాబు
మంగళవారం
సమీక్ష
నిర్వహించారు.
వ్యవస్థీకృతంగా
ఈ
ఉత్పత్తులను
విక్రయించేందుకు
వినూత్నంగా,
విభిన్నంగా
బ్రాండింగ్
చేయాలని
స్పష్టం
చేశారు.
అరకు
కాఫీ
తరహాలోనే
అంతర్జాతీయ
ప్రమాణాలతో
బ్రాండ్
రూపోందిస్తే
ఉత్పత్తులకు
మరింత
విలువ
పెరుగుతుందని
సూచించారు.
ఈ
వ్యవస్థీకృత
విధానం
వల్ల
మహిళలకు
ఆర్ధిక
ప్రయోజనం
కలిగించాలన్నదే
కూటమి
ప్రభుత్వ
లక్ష్యమని
సీఎం
స్పష్టం
చేశారు.
ఎస్
హెచ్
జీ
మహిళా
సంఘాలు,
మైక్రో
ఎంట్రప్రెన్యూర్స్
కు
ఆర్ధిక
సుస్థిరత
వచ్చేలా
ఉత్పత్తుల
బ్రాండింగ్,
మార్కెటింగ్
జరగాలని
సీఎం
సూచించారు.
రాష్ట్రంలో
పశుసంవర్ధకం
తో
పాటు
సేవల
రంగంలోనూ
మహిళ
సంఘాలు
రాణించాలని
సీఎం
ఆకాంక్షించారు.
ఈ
సమీక్షకు
సెర్ప్
శాఖ
మంత్రి
కొండపల్లి
శ్రీనివాస్
సహా
ఆ
శాఖ
ఉన్నతాధికారులు
హాజరయ్యారు.
రూ
15
వేలు
చొప్పున
రివాల్వింగ్
ఫండ్
మరోవైపు
కొత్తగా
ఏర్పాటైన
డ్వాక్రా
సంఘాలకు
రూ
15
వేలు
చొప్పున
రివాల్వింగ్
ఫండ్
ఖరారు
చేసింది.
ఈ
రివాల్వింగ్
ఫండ్
ద్వారా
సంఘం
నిధిని
పెంచుకొన
అవకాశం
కలుగుతుంది.
సంఘంలోని
సభ్యుల
అవసరాలకు
అనుగుణంగా
డ్వాక్రా
సంఘం
ఈ
నిధుల
వినియోగం
పైన
నిర్ణయం
తీసుకుంటుంది.
ఈ
ఫండ్
ద్వారా
సంఘాలు
తమ
ఉత్పత్తుల
కోసం
బ్యాంకుల
నుంచి
పెద్ద
మొత్తంలో
రుణాలు
తీసుకునే
వెసులుబాటు
ఉంటుంది.
ఈ
నిధులను
ప్రభుత్వం
త్వరలోనే
సంఘాల
బ్యాంకు
ఖాతాల్లో
జమ
చేయనుంది.
ఈ
మేరకు
జిల్లాలకు
సంఘాల
జాబితాను
పంపించారు.
తదుపరి
చర్యలు
తీసుకోవాలని
జిల్లా
అధికారులను
ఆదేశిస్తూ
ఉత్తర్వులు
జారీ
అయ్యాయి.
ఈ
నిధుల
ద్వారా
కొత్త
డ్వాక్రా
సంఘాలు
ఆర్దికంగా
తమ
బలం
పెంచుకునే
అవకాశం
కలుగుతుంది.


