India
oi-Syed Ahmed
పశ్చిమ
బెంగాల్
ముఖ్యమంత్రి,
తృణమూల్
కాంగ్రెస్
అధినేత్రి
మమతా
బెనర్జీకి
వైఎస్సార్సీపీ
అధినేత
వైఎస్
జగన్
ఇవాళ
సర్
ప్రైజ్
ఇచ్చారు.
ఇవాళ
ఆమె
పుట్టినరోజు
సందర్భంగా
శుభాకాంక్షలు
పెడుతూ
ట్వీట్
చేశారు.
అయితే
ఇందులో
సర్
ప్రైజ్
ఏముంది
అనుకుంటున్నారా..
అక్కడే
అంతా
ఉంది.
ప్రస్తుతం
బెంగాల్
లో
అసెంబ్లీ
ఎన్నికలకు
రంగం
సిద్దమవుతోంది.
ఈ
ఎన్నికల్లో
మమతను
ఎలాగైనా
ఓడించాలని
బీజేపీ
శతవిధాలా
ప్రయత్నాలు
ఇస్తోంది.
ఇలాంటి
వేళ
జగన్
ట్విస్ట్
ఇచ్చారు.
వైఎస్
జగన్
నేతృత్వంలోని
వైఎస్సార్సీపీ
అధికారంలోకి
రాకముందు
నుంచే
బీజేపీకి
దగ్గరవుతూ
వచ్చింది.
అధికారంలోకి
వచ్చాక
అయితే
ప్రధాని
మోడీ,
అమిత్
షాలకు
జగన్
పూర్తిగా
దగ్గరయ్యారు.
అయితే
ఏపీకి
కావాల్సిన
నిధుల్ని,
ప్రాజెక్టుల్ని
మాత్రం
అనుకున్న
స్ధాయిలో
సాధించుకోలేకపోయారు.
చివరికి
బీజేపీ
జగన్
కు
హ్యాండిచ్చి
ఆయన
రాజకీయ
శత్రువులు
చంద్రబాబు,
పవన్
కళ్యాణ్
తో
జట్టు
కట్టి
ఏపీ
ఎన్నికల్లో
గెలిచింది.
అయినా
జగన్
బీజేపీని
వీడలేదు.
Happy
Birthday
to
@MamataOfficial
Didi!
Praying
for
your
good
health
and
happiness
always.—
YS
Jagan
Mohan
Reddy
(@ysjagan)
January
5,
2026
అయితే
తాజాగా
బీజేపీ
విషయంలో
జగన్
అంచనాల్లో
పెద్దగా
మార్పు
రాకపోయినా
రాబోయే
రోజుల్లో
జాతీయ
స్ధాయిలో
రాజకీయాలు
ఎలా
ఉంటాయో
తెలియదు.
ఒకప్పుడు
జగన్
ను
వద్దనుకున్న
కాంగ్రెస్
పార్టీ
పట్ల
ఆయనకు
ఇప్పటికీ
శత్రుత్వం
తగ్గలేదు.
కానీ
కేంద్రంలో
కాంగ్రెస్
నేతృత్వంలోని
ఇండియా
కూటమి
అధికారంలోకి
వచ్చే
పరిస్ధితి
ఉంటే
జగన్
కు
మద్దతుగా
లాబీయింగ్
చేయడానికి
ఎవరో
కొందరు
తప్పనిసరి.
అటువంటి
పరిస్ధితుల్లో
జగన్
కచ్చితంగా
చూసేది
ఓ
మమత,
ఓ
శరద్
పవార్
వైపే.
అందుకే
మమతకు
బెంగాల్
ఎన్నికలకు
ముందే
వచ్చిన
పుట్టినరోజుకు
శుభాకాంక్షలు
చెప్పడం
ద్వారా
జగన్
ఓ
ఆప్షన్
తనకు
అందుబాటులో
ఉంచుకున్నట్లయింది.


