News
oi-Suravarapu Dileep
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) ఇటీవల అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవల కాలంలో అనేక ప్లాన్‌ల వ్యాలిడిటీ సహా ఇతర ప్రయోజనాల్లో కోత విధించింది. ఇందులో రూ.99 ప్లాన్ నుంచి రూ.1499 ప్లాన్ వరకు ఉన్నాయి. ధరలు పెంచమంటూనే.. ప్లాన్‌ల ప్రయోజనాల్లో కోత విధించింది. అదే సమయంలో వివిధ రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది.
రూ.1 రీఛార్జ్ ప్లాన్ :
ఇటీవల కొన్ని ప్రత్యేక సందర్భాల్లో BSNL ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొస్తోంది. ఈ సమయంలో బీఎస్‌ఎస్‌ఎల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య పెరుగుతోంది. ఈ సంవత్సరం ఆగస్టు నెలలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆజాదీ కా ప్లాన్ పేరుతో కేవలం రూ.1 కే రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ ప్లాన్ ఆగస్టు 1 నుంచి ఆగస్టు 30 వరకు అందుబాటులోకి ఉంటుందని ప్రకటించినా, యూజర్ల నుంచి వస్తున్న స్పందనతో సెప్టెంబర్ 15 వ తేదీ వరకు పెంచుతున్నట్లు తెలిపింది. ట్రాయ్ వివరాల ఆధారంగా ఆ సమయంలో BSNL భారీ సంఖ్యలో కొత్త యూజర్లను సంపాదించుకుంది.
మరోసారి రూ.1 రీఛార్జ్ ప్లాన్ :
అనంతరం దీపావళి సమయంలోనూ దీపావళి బొనాంజా పేరుతో రూ.1 ప్లాన్‌ను తీసుకొచ్చింది. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండేది. అయితే తాజాగా ఈ ప్లాన్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ మరోసారి తీసుకొచ్చింది. ప్రజల నుంచి వస్తు్‌న్న విజ్ఞప్తుల కారణంగా ఈ ప్లాన్‌ను తీసుకొచ్చినట్లు తెలిపింది. X హ్యాండిల్ ద్వారా ఈ వివరాలను వెల్లడించింది.
రోజువారీ 2GB డేటా :
BSNL రూ.1 ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. ప్రతిరోజు 2GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంటుంది.
Back by public demand – BSNL’s ₹1 Freedom Plan!
Get, a Free SIM with 2GB data/day, unlimited calls and 100 SMS/day for 30 days of validity.
Applicable for new users only! #BSNL #AffordablePlans #BSNLPlans #BSNLFreedomPlan pic.twitter.com/pgGuNeU8c2
— BSNL India (@BSNLCorporate) December 1, 2025
కొత్తగా సిమ్ కార్డు కొనుగోలు చేసిన యూజర్లకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. అయితే సిమ్ కార్డును ఉచితంగా అందిస్తారు. ఈ ఆఫర్ డిసెంబర్ 1 న అందుబాటులోకి వచ్చింది. డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటుంది. ఈ ప్లాన్ కోసం BSNL కార్యాలయాలు, CSC లను సందర్శించాలని BSNL సూచించింది.
స్టూడెంట్ ప్లాన్ :
BSNL ఇటీవలే రూ.251 ధరలో స్టూడెంట్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని అందిస్తోంది. దీంతోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. మరియు మొత్తంగా 100GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంటుంది.
సూపర్ జూబ్లీ ప్లాన్ :
గత నెలలో బీఎస్‌ఎన్‌ఎల్ ఈ స్టూడెంట్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. డిసెంబర్ 13 వ తేదీ వరకు ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. దీంతోపాటు సూపర్ జూబ్లీ ప్లాన్ పేరుతో రూ.225 ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజువారీ 100 SMS లు, ప్రతిరోజు 2.5GB 4G డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది.
Best Mobiles in India
English summary
BSNL Rs1 Recharge Plan Relaunched in december 2025 here are the benefits


