Andhra Pradesh
oi-Syed Ahmed
ఏపీలో
భూసంస్కరణల
విషయంలో
కూటమి
సర్కార్
దూకుడు
నేపథ్యంలో
వైసీపీ
(ysrcp)
కూడా
రూటుమార్చింది.
ఓవైపు
కేంద్రం
ప్రతిపాదిస్తున్న,
మద్దతిస్తున్న
చట్టాలను
ఏపీలో
వేగంగా
అమలు
చేయడం
ద్వారా
గత
వైసీపీ
ప్రభుత్వం
తీసుకున్న
నిర్ణయాలను
రాజకీయ
కారణాలతో
ఇక్కడ
కూటమి
పార్టీలు
వ్యతిరేకించాయి.
ఆ
తర్వాత
తమ
డిమాండ్
కరెక్టే
అని
నిరూపించుకునేందుకు
తమ
ప్రభుత్వం
రాగానే
ఏపీ
భూయాజమాన్య
చట్టాన్ని
రద్దు
చేశాయి.
ఈ
నేపథ్యంలో
రాష్ట్రంలో
కూటమి
సర్కార్
పై
ఒత్తిడి
పెంచేందుకు,
అలాగే
రాజకీయంగా
బీజేపీ,
టీడీపీ
మధ్య
గ్యాప్
పెంచేందుకు
వైసీపీ
రంగంలోకి
దిగుతోంది.
గతంలో
జగన్
హయాంలో
తీసుకొచ్చిన
ల్యాండ్
టైట్లింగ్
చట్టం
కేంద్రం
చెప్తేనే
తెచ్చామని,
ఆ
తర్వాత
కూటమి
ప్రభుత్వం
దీన్ని
రద్దు
చేసేసిందని,
దీని
వల్ల
విదేశీ
ప్రత్యక్ష
పెట్టుబడులతో
పాటు
వికసిత్
భారత్
లక్ష్యాలకు
కూడా
భంగం
కలుగుతోందని
వైసీపీ
ఆరోపిస్తోంది.
ఈ
మేరకు
వైసీపీ
నేత
ధర్మాన
ప్రసాదరావు
ప్రధాని
మోడీకి
ఓ
లేఖ
రాశారు.
మీ
ప్రభుత్వ
లక్ష్యాలను,
దార్శనికతను
అనుగుణంగా
ఏపీలో
వైఎస్
జగన్
సర్కార్
ఏపీ
ల్యాండ్
టైట్లింగ్
చట్టం
2023ను
తీసుకువచ్చిందన్నారు.
అయితే
2024
సంవత్సరంలో
చంద్రబాబు
నాయుడు
నేతృత్వంలోని
ప్రస్తుత
ప్రభుత్వం
వరల్డ్
బ్యాంక్
ఈజ్
ఆఫ్
డూయింగ్
బిజినెస్
వారు
నిర్వహించిన
సర్వేలో
మన
దేశం
154వ
స్థానంలో
ఉందనే
సత్యాన్ని
మేక్
ఇన్
ఇండియా,
ఆత్మనిర్భర్
,
వికసిత్
భారత్
వంటి
ప్రతిష్టాత్మక
పథకాలకు
ఇటువంటి
ప్రగతిశీల
చట్టం
యొక్క
అవసరాన్ని
విస్మరిస్తూ,
ఈ
చట్టాన్ని
వెనక్కి
తీసుకొని
రద్దు
చేసిందని
ఆరోపించారు.
భూవివాదాలను
తగ్గించడం
ద్వారా
విదేశీ
పెట్టబడుల
ఆకర్షణతో
పాటు
వికసిత్
భారత్
లక్ష్యాల
సాధన
కోసం
కేంద్రం
ప్రతిపాదించిన
ల్యాండ్
టైట్లింగ్
చట్టాన్ని
తాము
అమలు
చేస్తే
చంద్రబాబు
ప్రభుత్వం
దీన్ని
రద్దు
చేసిందని,
ఇప్పుడు
ప్రధాని
మోడీ
ఈ
వ్యవహారంలో
జోక్యం
చేసుకుని
తగు
ఆదేశాలు
ఇవ్వాలని
ధర్మాన
ప్రసాదరావు
కోరారు.
ఏపీతో
పాటు
అన్ని
రాష్టాలూ
ఈ
చట్టాలు
చేసేలా
కేంద్రం
చర్యలు
తీసుకోవాలని
కూడా
కోరారు.
అంతర్జాతీయ
మేటి
రాజనీతిజ్ఞునిగా
రూపొందుతున్న
మన
దేశ
ప్రధానమంత్రికి
సహకరించడం
అంటే
ఈ
చట్టం
అమలు
చేయడమే
అంటూ
ధర్మాన
తన
లేఖను
ముగించారు.


