Telangana
oi-Korivi Jayakumar
తెలంగాణ
రాష్ట్రంలోని
రంగారెడ్డి
జిల్లాలో
ఉన్న
మీర్జాగూడ
వద్ద
మరో
ఘోర
రోడ్డు
ప్రమాదం
చోటు
చేసుకుంది.
గత
ఏడాది
ఇదే
ప్రాంతంలో
ఆర్టీసీ
బస్సును
కంకర
లోడుతో
వెళ్తున్న
టిప్పర్
ఢీకొట్టింది.
దీంతో
ఇద్దరు
డ్రైవర్లు
సహా
21
మంది
దుర్మరణం
చెందగా..
మరికొందరు
ప్రయాణికులు
తీవ్రంగా
గాయపడ్డారు.
ఆ
దుర్ఘటనను
మరువకముందే
అదే
ప్రాంతంలో
ఇప్పుడు
మరో
ప్రమాదం
చోటుచేసుకుంది.
కారు
చెట్టును
ఢీ
కొన్న
ఘటనలో
నలుగురు
విద్యార్థులు
అక్కడికక్కడే
మృతి
చెందగా,
ఒకరు
తీవ్ర
గాయాలపాలయ్యారు.
ఈ
వరుస
ప్రమాదాలతో
స్థానికంగానే
కాకుండా
రాష్ట్ర
వ్యాప్తంగా
విషాద
వాతావరణం
నెలకొంది.
అసలేం
జరిగిందంటే..?
మోకిల
నుంచి
హైదరాబాద్
వైపు
వెళ్తున్న
ఓ
కారు
మీర్జాగూడ
వద్ద
నియంత్రణ
కోల్పోయి
చెట్టును
ఢీకొట్టింది.
ఈ
ప్రమాదంలో
కారులో
ఉన్న
నలుగురు
విద్యార్థులు
అక్కడికక్కడే
మృతి
చెందగా
ఒకరు
తీవ్ర
గాయాలపాలయ్యారు.
కారులో
ప్రయాణిస్తున్న
వారంతా
ICFAI
యూనివర్సిటీ,
MGITలకు
చెందిన
ఐదుగురు
విద్యార్థులు
పోలీసులు
గుర్తించారు.
ప్రమాదాన్ని
గమనించిన
స్థానికులు
వెంటనే
పోలీసులకు
సమాచారం
అందించారు.
దాంతో
హుటాహుటీన
ఘటనా
స్థలానికి
చేరుకున్న
పోలీసులు..
కారులో
చిక్కుకున్న
మృతదేహాలను
వెలికి
తీసి,
పోస్టుమార్టం
నిమిత్తం
చేవెళ్ల
ప్రభుత్వ
ఆసుపత్రికి
తరలించారు.
అలానే
మరో
యువతికి
తీవ్ర
గాయాలు
కావడంతో
ఆమెను
కూడా
ఆస్పత్రికి
తరలించి
వైద్య
సహాయం
అందిస్తున్నారు.
మృతి
చెందిన
నలుగురు
విద్యార్థులను
సూర్యతేజ,
సుమిత్,
శ్రీనిఖిల్,
రోహిత్‌లుగా
పోలీసులు
గుర్తించారు.
కోకాపేట్‌లో
బర్త్‌డే
పార్టీ
ముగించుకుని,
ఒక
స్నేహితుడిని
డ్రాప్
చేసి
తిరిగి
వెళ్తున్న
సమయంలో
ఈ
ప్రమాదం
జరిగినట్లు
పోలీసులు
తెలిపారు.
ఈ
దుర్ఘటన
కారణంగా
రహదారిపై
భారీగా
ట్రాఫిక్
నిలిచిపోయింది.
ఇక
పోలీసులు
ప్రమాదానికి
గురైన
వాహనాన్ని
తొలగించి..
ట్రాఫిక్‌ను
క్లియర్
చేశారు.
అలానే
ఈ
సంఘటనపై
కేసు
నమోదు
చేసి
తదుపరి
దర్యాప్తు
చేస్తున్నట్టు
వెల్లడించారు.


