మూల్యం చెల్లించుకుంటారు – హరీష్ హెచ్చరిక..!!

Date:


Telangana

oi-Sai Chaitanya

మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేసారు. మంత్రులు.. కాంగ్రెస్ నేతలు ఉద్దేశ పూర్వకం గా బీఆర్ఎస్ నేతల పైన కేసులు పెట్టి.. జైలులో పెడుతున్నారని మండిపడ్డారు. తమ పార్టీ కేడర్ ను వేధిస్తే.. తాము అధికారంలోకి వచ్చిన తరువాత మూల్యం చెల్లించుకోక తప్పదని హరీష్ రావు హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తరువాత బలం లేకపోయినా… ఛైర్మన్ సీటు కోసం కాంగ్రెస్ నేతలు ఇష్టానుసారం వ్యవహరించారని చెప్పుకొచ్చారు. మంత్రి వివేక్ లక్ష్యంగా హరీష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వైరల్ అవుతున్నాయి.

మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వం పైన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్ పైన మండిపడ్డారు. జిల్లా జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌‌ను హరీశ్ పరామర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. మంత్రి వివేక్ కారు పైన దాడి కేసులో బాల్క సుమన్ ను అరెస్ట్ చేసారు. పోలీసులు అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేసారు. దీంతో.. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వారిని చెదరగొట్టిన పోలీసులు బాల్క సుమన్ ను అరెస్ట్ చేసారు. ఆ తరువాత వైద్య పరీక్షలు చేయించి.. న్యాయమూర్తి ఎదుట ప్రవేశ పెట్టగా రిమాండ్ విధించారు. కాగా.. సుమన్ అరెస్ట్ పైన స్పందించిన హరీష్ పలు అంశాల పైన స్పందించారు. బాల్క సుమన్ అరెస్ట్ దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు.

తాము అధికారంలోకి వస్తే వదిలేది లేదని హెచ్చరిక

కాంగ్రెస్ నేతలే పథకం ప్రకారం దాడి చేసి బీఆర్‌ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు. బలం లేని చోట కాంగ్రెస్ ఎలా గెలుస్తుందో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి వివేక్ వెంకటస్వామి తీరు జుగుప్సాకరంగా ఉందని హరీశ్ విమర్శించారు. క్యాతనపల్లిలో మహిళా కౌన్సిలర్లపై దాడి జరిగితే పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదని.. బీఆర్‌ఎస్ నేతల వాహనాలు ధ్వంసమైనా ఫిర్యాదు తీసుకోలేదని మండిపడ్డారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టింగ్‌ల కోసం బీఆర్‌ఎస్‌ నేతలను వేధిస్తే ఊరుకునేది లేదని.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక తగిన మూల్యం చెల్లించుకుంటారని పోలీసులను మాజీ మంత్రి హెచ్చరించారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల తిరుగుబాటు మొదలైందని వ్యాఖ్యానించారు. ‘రాహుల్ గాంధీ.. మీ రాజ్యాంగం ఏమైందో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. క్యాతనపల్లి ఇన్సిడెంట్‌పై గవర్నర్ రిపోర్ట్ తెప్పించుకోవాలని హరీశ్ రావు కోరారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Trump fundraising pitch features U.S. soldiers killed in Iran war

President Donald Trump's political action committee this week sent...

Trump administration is collecting $10 billion on the TikTok deal

In September, Donald Trump claimed that “the United States...