Entertainment
oi-Garikapati Rajesh
మనకున్న
దర్శకుల్లో
లెక్కల
మాస్టారైన
సుకుమార్
చాలా
సృజనాత్మకంగా
సినిమాలు
తెరకెక్కిస్తారు.
ఒక్కోసారి
ఆయన
సినిమాలు
కూడా
లెక్కల
పజిల్స్
లా
ఉండేవి.
దర్శక
ధీరుడు
రాజమౌళి..
ఒక
సందర్భంలో
సుకుమార్
లాంటి
వ్యక్తి
కమర్షియల్
సినిమాలు
తీస్తే
తమలాంటివారు
సరిపోరని
అన్నారు.
దాన్ని
నిరూపిస్తూ
2018లో
పూర్తి
కమర్షియల్
సినిమాగా
రంగస్థలం
సినిమాను
రామ్
చరణ్
హీరోగా
రూపొందించారు.
బ్లాక్
బస్టర్
హిట్
గా
నిలిచింది.
ఆ
తర్వాత
పుష్ప
ప్రాజెక్టు
చేపట్టారు.
సుకుమార్
ముందుగా
ఏ
కథ
రాసుకున్నా
మహేష్
బాబుకు
వినిపిస్తారు.
ఆయన
వద్దంటే
వేరే
హీరోతో
చేస్తారు.
అలాగే
పుష్ప
కథ
రాసుకొని
వినిపించగా..
మహేష్
బాబు
సున్నితంగా
తిరస్కరించారు.
తనకన్నా
ఆ
కథ
అల్లు
అర్జున్
కు
బాగుంటుందని
చెప్పారు.
2018
నుంచి..
దీంతో
2021లో
సుకుమార్
పుష్ప
ప్రాజెక్టులోకి
అడుగుపెట్టారు.
ఈ
సినిమాను
రాజమౌళికి
చూపించగా..
దీన్ని
పాన్
ఇండియా
సినిమాగా
విడుదల
చేయమని
ఆయన
సలహా
ఇచ్చారు.
ఎందుకంటే
అందులో
అల్లు
అర్జున్
గెటప్
మొత్తం
బీహార్,
ఉత్తరప్రదేశ్
లో
నివసించే
ప్రజల్లా
ఉంటుంది..
దీనికి
వారంతా
కనెక్ట్
అవుతారనేది
రాజమౌళి
భావన.
అందుకు
తగినట్లుగానే
తెలుగు
రాష్ట్రాల్లో
ఒకరకంగా
ఈ
సినిమా
ఫ్లాప్
అయినా
ఉత్తర
భారతంలో
మాత్రం
సూపర్
హిట్
అయింది.
తర్వాత
2024లో
పుష్ప2
విడుదల
చేశారు.
ఈ
సినిమా
భారీ
విజయాన్ని
అందుకుంది.
రామ్
చరణ్
తో
2018లో
రంగస్థలం,
2021లో
అల్లు
అర్జున్
తో
పుష్ప,
2024లో
పుష్ప2
విడుదలయ్యాయి.
ప్రస్తుతం
రామ్
చరణ్
తో
సినిమా
చేసేందుకు
అన్నివిధాలుగా
స్క్రిప్ట్
ను
సిద్ధం
చేసుకుంటున్నారు.
2030
వరకు
ఖాళీ
లేదు
సుకుమార్
శిష్యుడు
బుచ్చిబాబు
చేస్తున్న
పెద్ది
సినిమా
పూర్తవగానే
రామ్
చరణ్
ఈ
సినిమా
సెట్
లో
అడుగుపెడతారు.
పుష్ప,
రంగస్థలం
తీసిన
మైత్రీ
మూవీ
మేకర్స్
వారే
ఈ
సినిమాను
కూడా
తీస్తున్నారు.
ఈ
సినిమా
షూటింగ్
రెండు
సంవత్సరాలు
పడుతుంది.
ఇది
అవగానే
మళ్లీ
అల్లు
అర్జున్
తో
పుష్ప2
సెట్స్
లోకి
అడుగుపెడతారు.
ఆ
సినిమా
కూడా
ఒక
రెండు
సంవత్సరాలు
పడుతుంది.
అంటే
ఒకరకంగా
సుకుమార్
2030
వరకు
ఖాళీగా
ఉండరు.
మెగా
హీరోలకే
విలువైన
సమయాన్ని
కేటాయించేశారు.
మంచి
సృజనాత్మకత
ఉన్న
దర్శకుడైన
సుకుమార్
జీవితంలో
పది
సంవత్సరాలు
అంటే
సాధారణమైన
విషయం
కాదు.
ఒక
దర్శకుడు
ఒక
సినిమా
తీసి
విడుదల
చేసిన
తర్వాత,
తర్వాత
సినిమా
ఏం
చేయాలా?
అని
ఆలోచిస్తుంటారు.
కానీ
సుకుమార్
జీవితంలో
కీలకమైన
10
ఏళ్లు
మెగా
కుటుంబానికే
కేటాయిస్తున్నారు.
భవిష్యత్తులో
కూడా
మరిన్ని
సంవత్సరాలు
కేటాయిస్తారేమో
చూడాలి.


